Print this page..

పంట చేలల్లో పదనిసలు పలికిస్తున్న నోవా సాంకేతిక సస్య విధానందశాబ్దం దాటిన పరిశోధనా - అభివృద్ధి క్షేత్రాల ప్రగతి

దశాబ్దకాలంగా ఉద్యాన పంటల్లో వినూత్నమైన సాగు ప్రక్రియలను ప్రారంభించి నోవా అగ్రిటెక్‌ కంపెనీ సంచలనాలను సృష్టించింది. కేవలం వ్యాపార ప్రయోజనార్ధం కాకుండా సాగు రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో పరిష్కారాలు చూపించింది. వాణిజ్య ప్రక్రియతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రత్యేక వాతావరణ జోన్‌లలో పంట క్షేత్రాలను నెలకొల్పి, వైవిధ్యమైన పంట సాగు విధానాన్ని రైతులకు పరిచయం చేసింది. 

ఉద్యానరంగంలో పంటల మెరుగైన సాగుకు కంపెనీ అగ్రిప్లాస్టిక్‌ డివిజన్‌ను 2010 సంవత్సరంలో అగ్రిప్లాస్టిక్‌ డివిజన్‌ను ప్రారంభించి ప్లాస్టిక్‌ మల్చిషీట్‌ విక్రయాలను ప్రారంభించింది. అంతర పంటలు, అనుబంధ వ్యవసాయ రంగాల్లో నూతన పోకడలకు నాంది పలికి రైతులకు చేదోడువాదోడుగా ఉండేందుకు సస్య యాజమాన్య దృక్పదాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్లాస్టిక్‌ మల్చి ఎంతో తోడ్పడింది. మల్చి విక్రయంతో పాటు తానే స్వయంగా మల్చిపై మిరప పంటను సాగు చేసి నిరూపించింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా మల్చిసహకారంతో మిరపను సాగు చేసేందుకు ప్రయోగాత్మకంగా జహీరాబాద్‌ సమీపంలోని హుగ్గెళ్ళి గ్రామంలో 37 ఎకరాల సువిశాల సుక్షేత్రంలో బోదెలపై అమర్చిన మిరప తోట అద్బుత ఫలితాలనే ఇచ్చింది. ఈ ఫలితాలను రైతులకు వివరించేందుకు అదే క్షేత్రంలో మూడురోజుల పాటు పొలంలోనే  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 300 మంది రైతులతో శిబిరాన్ని నిర్వహించింది. ఒక రైతు దినోత్సవం రోజున 300 మంది రైతులను సంస్థ అధినేత ఏలూరి సాంబశివరావు జాతీయ మీడియా సాక్షిగా సన్మానించి గౌరవించారు. 

చలికాలంలో 80 సె. వాతావరణంలో అసాధారణమైన స్థాయిలో మిరప పంటను పండించి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘనత నోవా అగ్రిటెక్‌ కంపెనీకే దక్కింది. ఈ సదస్సు సందర్భంగా జరిగిన చర్చలో భాగంగా మల్చింగ్‌తో మిరపసాగు అత్యంత వ్యయంతో కూడినది కదా అని రైతులు ప్రశ్నించడంతో దానికి పరిష్కారంగా మిరప పంటను తొలగించిన అనంతరం అదే బోదెలపై మల్చితో కూడిన జీరోటిల్లేజ్‌ మొక్కజొన్న, పత్తి, కూరగాయల సాగును నోవా కంపెనీ ప్రారంభించి అద్భుతాలు సాధించింది. మిరప పండిన బోదెలపై నాటిన మొక్కజొన్న, పత్తి పంటలు టన్నుల కొద్దీ దిగుబడులనిచ్చి మల్చి వినియోగం మంచి ప్రయోజనాత్మకమని స్వయాన అనుభవంలో తెలుసుకోవడం వల్ల ఈ తరహా సాగుకు ప్రాచుర్యం లభించింది. మెదక్‌ జిల్లా మారుమూల ప్రాంతమైన హుగ్గెళ్ళిలో ప్రారంభమైన మల్చి వినియోగిత మిరప సాగును ఆ తరువాత ఉభయ రాష్ట్రాల రైతులు అందుకొని వేలాది ఎకరాల్లో సాగును ప్రారంభించారు. 

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలో, నర్సంపేట ప్రాంతంలో, ములుగు సమీపంలోనూ, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఆ తరువాత ఇతర మండలాల్లోనూ మల్చింగ్‌తో మిరప సాగు ఒక  ఉద్యమంలా ప్రారంభమైంది. హుగ్గెళ్ళి వ్యవసాయ క్షేత్రాల విజయాలతో నోవా అగ్రిటెక్‌ కంపెనీ కూడా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పొంది మరింత మెరుగైన రీతిలో మల్చితో మిరప సాగును కృష్ణాజిల్లాలోని మక్కపేట, ప్రకాశం జిల్లాలోని ఇసుకదర్శి గ్రామాలకు విస్తరింపచేసి తన సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. నేడు ఇక్కడా అక్కడా అనకుండా అన్ని చోట్లా మల్చితో మిరప సాగు రైతుల సస్య జీవన స్రవంతిలో భాగమైపోయింది. 

జహీరాబాద్‌ వ్యవసాయ క్షేత్రాల అనుభవంతో కామారెడ్డి జిల్లాలో నోవా కంపెనీ పలు పంటల సాగుకు ప్రధాన కేంద్రంగా వినూత్నంగా నిలిచింది. చక్కటి నీటి యాజమాన్యం, భూసారాన్ని పెంచే ప్రక్రియలు, ఖచ్చిత వ్యవసాయ విధానాల అమలు, ప్రపంచమంతటా అమలులో ఉన్న గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీస్‌లను ఖచ్ఛితంగా అమలు చేసి ఎడారి ప్రాంతాన్ని పంటల ఖజానాగా మార్చింది. బొప్పాయి, దానిమ్మ, జామ, పందిరి కూరగాయలు, మల్చి పరచిన బోదెలపై టమాటా, ములగ సాగు క్షేత్రాలు, గోధుమ, వరి, ఇతర ఆహార వాణిజ్య పంటల సాగు ద్వారా తన వ్యవసాయ విస్తరణ లక్ష్యాలను వినూత్నంగా నెరవేర్చి తెలుగు రైతులను ప్రగతిబాట నడిపించడానికి ఎనలేని కృషి జరిపింది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయాన్ని సాధించడం, తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణాన్ని సాగులోకి తీసుకురావడం, శిలావృతమైన భూముల్లో భూమికి అడ్డుగా కట్టలు వేసి వాన నీటిని ఒడిసి పట్టి భూగర్భజలాలుగా మార్చుకోవడం, ఇజ్రాయిల్‌ తరహాలో ఫాంపాండ్లు, బిందు, తుంపరల సేద్యాన్ని  అందుఆట్లోకి తీసుకురావడం వంటి వినూత్న సస్య మార్గాన్ని విజయవంతంగా ముందుకునడిపింది. 

రైతులను ఆధునిక వ్యవసాయ రంగానికి మళ్ళించడానికి నోవా అగ్రిటెక్‌ ఇప్పటికే మార్కెట్‌లో తనకున్న విశ్వసనీతకు బయో ఉత్పత్తి రంగంలోకి ముందుకు వెళుతుంది. ప్రతిష్టమైన పరిశోధన, అభివృద్ధి మంత్రంతో తెలుగు వ్యవసాయ రంగంలో వినూత్న పోకడలకు ముఖ్యంగా రైతులను సమృద్ధి వ్యవసాయ బాటలో నడిపించేందుకు తనదైన శైలిలో కృషి చేస్తుంది. ఆహార భద్రతతో సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపధ్యంలో వైవిధ్యభరితమైన పంటలు, అంతర పంటలు అనుబంధ వ్యవసాయ రంగాల్లో నూతన పోకడలకు బాటలు వేసేందుకు అగ్రిక్లినిక్‌ మాసపత్రికను ప్రారంభించి రైతుల్లో విజ్ఞానాన్ని నింపి చైతన్యాన్నికి బాటలు వేస్తుంది. అదేవిధంగా నోవా రైతు సేవా కేంద్రం సామాజిక సేవలో భాగంగా నిరంతరం రైతన్న వెంటనే  ఉండి విత్తనం నాటే దిశ నుండి మార్కెట్‌లో మంచి ఫలసాయం పొందే వరకు వినూత్న సలహాలతో రైతు ప్రగతికి బాటలు వేస్తుంది. రైతును వ్యవసాయ నిపుణునిగానూ, గౌరవనీయమైన  ఉత్పత్తిదారుణిని గానూ, భూమిపుత్రునిగానూ గౌరవించే సమాజ ఆవిష్కరణకు కృషి చేసే లక్ష్యసాధనలో పురోగమిస్తున్న నోవా సంస్థల సరికొత్త ఆవిష్కరణ నోవా అగ్రిప్లాస్టిక్‌ విభాగం. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటల అభివృద్ధికి కొత్త బాటలను వేసింది. ప్లాస్టింగ్‌ మల్చింగ్‌ ద్వారా రైతులకు భూమిలో తేమ శాతాన్ని కాపాడడం పోషక విలువల యాజమాన్యాన్ని సమగ్రంగా నిర్వహించే లక్షణాలను పుణికిపుచ్చుకున్న విధానాన్ని రైతులకు అందచేయడంలో తనకు తానే అగ్రగామిగా నిలిచింది. 


 

రచయిత సమాచారం

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌