రాష్ట్రంలో పండించు ప్రధాన ఆహర పంట వరి. ఈ సంవత్సరం వర్షపాతం సాధారణం కన్నా కొన్ని ప్రాంతాల్లో అధికంగా నమోదవుతున్నాయి. సీజన్ ప్రారంభంలో పంట సాగు సాఫీగా ఉన్నా మారుతున్న వాతావరణ పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావాన్ని, నష్టాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా వరిలో వివిధ రకాల తెగుళ్ళు, పురుగులు, ఆశిస్తున్నాయి. ఇందులో బ్యాక్టిరియా ఆకు ఎండుతెగులు ప్రస్తుతం నెలకొన్ని వాతావరణ పరిస్థితులో ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉంది. వరి పంటను బ్యాక్టిరియా ఆకు ఎండు తెగులు, దుబ్బు చేసుకునే దశ నుంచి చిరుపోట్ట దశ వరకు ఆశించవచ్చును.
తెగులు లక్షణాలు మరియు నివారణ చర్యలు .....
ఈ తెగులు నారుమడి నుంచి చిరు పొట్ట దశ వరకు ఏ దశలో నైనా ఆశించే అవకాశం ఉంది. నారుమడి దశలో తెగులు పోకితే ఆకుల చివర్ల నుండి క్రింద వరకు ఆకులు రెండు ప్రక్కల నీటి మచ్చులు ఏర్పడతాయి. ఈ ఆకులు క్రమేణ పసుపు రంగులోకి మారుతాయి. దీనినే క్రెసెక్ దశ అంటారు. ప్రధాన పొలంలో నారు నాటిన తర్వాత పిలక దశలో ఆశించినట్లయితే ఆకులపై పసుపురంగు నీటి డాగు మచ్చులు అలల మాదిరిగా ఆకుల అంచుల వెంబడి ఆకులపై నుండి క్రింది వరకు ఏర్పడతాయి. ఈ తెగులు ప్రధాన లక్షణం ఉదయం సమయంలో ఎండ తీవ్రత పెరిగే కంటే ముందు తెగులు పోకిన ఆకుల నుండి పసుపురంగు జిగురు బిందువు ఆకులపైన కనిపిస్తాయి. తర్వాత ఈ జిగురు ఎండకు గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా పలుకులుగా మారుతాయి. ఇవి గాలి వీచినప్పుడు ఆకు నుంచి క్రింద ఉన్న నీటిలో పడతాయి. లేదా వర్షపు జల్లులు వేగానికి వేరే ఆకులపైన పడతాయి. ఈ విధంగా బ్యాక్టిరియా ఉన్న నీరు మరియు బ్యాక్టిరియా కణాలు ఉన్న ఆకులు గాలికి రాపిడి ద్వారాను లోపలకి ప్రవేశిస్తాయి. ఒక వేళ తెగులు ఈనిక దశలో ఆశిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి ఆకు ఇరు పక్కల తర్వాత దశలో గోదుమ రంగు చారల రూపంలో ఏర్పడతాయి. ఇలాంటి మొక్కల నుంచి కొన్ని వెన్నులు మాత్రమే బయటకు వస్తాయి. దీని వలన వంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
తెగుళ్ళ వ్యాప్తికి కారణాలు...
ముఖ్యంగా ఆగస్టు మాసంలో కురిసే వర్షాలు ఈ తెగులు ఆరంభానికి ప్రధాన కారణం. అధిక వేగంతో గాలులు, ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు 2-4 రోజులు పడటం, తక్కువ ఉష్ణోగ్రతలు 22-26డిగ్రీలు నమోదు కావడం, అధిక మొతాదులో నత్రజని ఎరువుల వినియోగం, పంట తెగులును తట్టుకోలేని రకాలను సాగు చేయుటం వంటివి.
నివారణ...
తెగులును తట్టుకునే వరి వంగడాలను ఎంచుకోవటం.
పొలంలో తెగుళ్ళ లక్షణాలు గమనిస్తూ ఉండాలి.
తొలి దశ క్షణాలు గమనించినట్లయితే నత్రజని ఎరువుల వాడకం తాత్కాలికంగా నిలిపివేయాలి.
మురుగునీరు పోయే సౌకర్యం ఉండే విధంగా పొలం ఉండాలి.
ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి నీటిని పారించరాదు. ఎందుకంటే ఈ తెగులు నీటి ద్వారా వ్యాపిస్తుంది.
తెగులు దుబ్బు కట్టే దశ నుంచి చిరుపొట్ట దశలో ఆశించినట్లయితే కాపర్ ఆక్సి క్లోరైడ్ (సిఒసి) 3 గ్రాములు+ 0.4 గ్రాములు ప్లాంటామైసిన్ లేదా 0.2 గ్రాములు ప్లాంటామైసిన్ లేదా, పోషామైసిన్ మందును పొలంలో మురుగు నీరు తీసివేసి పీచికారి చేయాలి.