Print this page..

గో మాతకు వందనం

9ఏళ్లుగా నిరాటంకంగా పాలిస్తున్న వైనం

సాధారణంగా గోవులు . ఏడాది కాలం.. పాలు ఇస్తాయి... కానీ ఓ ఆవు తొమ్మిదేళ్లుగా నిరాటంకంగా పాలిస్తూనే ఉంది. అది ఎక్కడ అనుకుంటున్నారా.. .? అనంతపురం జిల్లా తాడిమర్రికి చెందిన రైతు వీరనారప్ప ఈ ఆవును 2011లో చిక్‌బళ్లాపూర్‌లో రూ.40 వేలకు కొనుగోలు చేశారు. ఐదు నెలల క్రితం వరకు రోజూ 10 లీటర్లు ఇచ్చేదని, ప్రస్తుతం ఉదయం పూట 3 లీటర్లు ఇస్తోందని ఆ రైతు చెప్పారు. దీని దూడను రూ.45 వేలకు అమ్మినట్లు తెలిపారు. ఆవు రక్తంలో ఆక్సిటోసిన్‌ హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటే పాలు ఇలా ఏళ్ల తరబడి ఇస్తూనే ఉంటాయని పశుసంవర్థక శాఖ ఏడీ శ్రీనివాసులు, వైద్యుడు గుర్నాథ్‌రెడ్డి తెలిపారు.

రచయిత సమాచారం