Print this page..

మిరప రైతు కోసం నోవా అద్భుత ఆవిష్కరణ "నోవా సూపర్ లావా చిల్లి"

అద్భుత ఆవిష్కరణ 
 ▪️మిరప రైతుల అస్త్రం నోవా సూపర్ " *లావా చిల్లి "
▪️మిరప రైతు ఇంట బంగారు సిరులకు సూపర్ లావా " చిల్లి "
▪️కన్నుల పండువుగా నోవా చిల్లి వేడుక* 
 _
మేడ్చల్:

మిరప రైతు ఇంట బంగారు సిరులు కురిపించేందుకు నోవా అగ్రి టెక్ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో నోవా సూపర్ లావా చిల్లి ని రూపొందించింది. సోమవారం ఈ నూతన ఉత్పత్తి ఆవిష్కరణ నోవా అగ్రి టెక్ ప్రధాన కార్యాలయంలో వేడుకగా సాగింది. నోవా అగ్రిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎటుకూరు కిరణ్ కుమార్, మార్కెటింగ్ డైరెక్టర్ వెనిగళ్ళ శ్రీకాంత్,ఆధ్వర్యంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ హెచ్ ఓ డి కందుల భార్గవి  చేతుల మీదుగా  నోవా సూపర్ లావా చిల్లి ప్రోడెక్ట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సేవలో నోవా ఆగ్రి టెక్ అనేక ఏళ్లుగా నమ్మకం  విశ్వాసం  విశ్వసనీయతతో పనిచేస్తుందన్నారు. ఆపద సమయంలో రైతన్నకు అండగా నిలుస్తూ అగ్రభాగాన నిలుస్తుందన్నారు. ఇటీవల వరి, పత్తి రైతులు ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల తో  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో నోవా అగ్రి టెక్  పత్తి రైతుల కోసం నోవా సూపర్ లావా కాటన్, వరి రైతలకు నోవా సూపర్ ప్యా డి ని  అందుబాటులోకి తీసుకువచ్చి రైతన్నల జేజేలు అందుకున్నా మని గుర్తు చేశారు.  మిరప రైతు కు అండగా నిలిచేందుకు నూతన ఉత్పత్తి ని ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు. మిరప పంటలో వచ్చు అన్ని రకాల రసం పీల్చు పురుగులకు, ముడతలకు, అకుతినే, కాయతొలచు పురుగులకు సమూలంగా నిర్మూలిస్తుందన్నారు.  అన్నిరకాల తెగుళ్లకు మరియు మచ్చలకు, అన్ని సూక్ష్మ పోషకలోపాలకు, అన్ని రకాల రుగ్మతలకు, ఒకే ఒక్క నివారణోపాయం నోవా సూపర్ లావా చిల్లి అన్నారు.  అధిక కొమ్మలతో గుబురైన పెరుగుదలను, నాణ్యమైన, పూత, కాత, మరియు అధిక దిగుబడులు నోవా సూపర్ లావా చిల్లి తో సాధ్యమన్నారు. మిరప రైతులకు నోవా సూపర్ లావా చిల్లి  అద్భుత దిగుబడులు ఇస్తుందన్నారు_ . ఈ కార్యక్రమంలో కిసాన్ సేవా కేంద్రం బృందం సభ్యులు పాల్గొన్నారు.

రచయిత సమాచారం