Print this page..

కంది పంటను ఆశించు కాయతొలిచే పురుగుల యాజమాన్యం పద్ధతులు

కంది పంట మొగ్గ, పూత,కాయ దశల్లో వర్షం లేదా చిరు జల్లులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు  కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. వాటిలో ముఖ్యంగా మారుక మచ్చల పురుగు,శనగ పచ్చ పురుగు, కాయ తొలిచే ఈగ, మరియు కాయ రసంపీల్చే  పురుగులు (బగ్స్) ప్రధానమైనవి.  కావున రైతు సోదరులు ఈ పురుగుల  ఉధృతిని అదుపులో ఉంచి అధిక దిగుబడులు  సాధించాలంటే సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించాలి.                

యాజమాన్య పద్ధతులు:
లోతు దుక్కులు దున్నాలి.         
పొలాన్ని ఇతర పంట అవశేషాలు లేకుండా శుభ్రంగా ఉంచాలి.                                   
గడ్డిజాతి మొక్కలు లేకుండా చేయాలి.
అధిక వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి.                       
పురుగులను ఆకర్శించే పూల మొక్కలు పొలం చుట్టూ అక్కడ అక్కడ వేసుకోవాలి. 
పంట మార్పిడి పద్ధతి పాటించాలి.
పురుగుల గుడ్లు, తొలి దశ పిల్ల పురుగులు, తర్వాత దశ లద్దె పురుగులు, మరియు కోశస్థ దశ పురుగులను కిరోసిన్ కలిపిన నీటిలో ముంచి నాశనం చేయాలి.
ఎకరానికి ఒక్క లైట్ ట్రాప్ అమర్చుకోవాలి.
ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను అమర్చుకోవాలి.
శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగుల ఉదృతిని అంచనా వేయడానికి ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలు అమర్చాలి.
మరియు వీటి ఉధృతిని అదుపులో ఉంచుటకు ఎకరానికి 10- 12 బుట్టలను అమర్చాలి.    
పొలంలో మిత్ర పురుగులు సంఖ్య పెంపొందించుకోవాలి.
అవసరాన్ని బట్టి పరాన్నజీవులను పొలంలో వదలాలి.   
పురుగు ఉధృతిని బట్టి బ్యాసిల్లస్ తురింజెన్సీస్ ఎకరానికి 300 గ్రాములు పిచికారి చేయాలి.
(1.5 గ్రాములు1 లీటర్ నీటికి).                      
అవసరాన్ని బట్టి హెలికోవెర్పా ఎన్. పి.వి. ఎకరానికి 200 య.ల్. ఇ. వాడాలి.    
మొగ్గ దశలో పురుగు ఉధృతిని బట్టి  వేప నూనె 1500 పి పి ఎం, @ 5 మి. లి, లేదా లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం.      
అవసరాన్ని బట్టి రసాయనిక  మందులను  తగిన మోతాదులో పిచికారీ చెయ్యాలి. 

మారుక  మచ్చల పురుగు : 
ఆశించిన తొలిదశలో ...
క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ. , ప్రొఫెనోఫాస్ 2.0 మీ.లీ.      
నోవాల్యూరాన్ 0.75 మి. లీ.  
ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు:  
 స్పైనోశాడ్ 0.3 మి. లీ,           
 ఎమామెక్ట్ న్   బెంజోయేట్ 0.4 గ్రా,
 ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ.      

 శనగ పచ్చ పురుగు:
ఆశించిన తొలిదశలో ...   
ఎసిపేట్   1.5 గ్రా. క్వినాల్ ఫాస్ 2.0 మి. లి. 
ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు:  
క్లోరాంట్రానిప్రోల్ 0.3 మి. లీ, లామ్డాసైహలోత్రిన్ 1.మిలీ.

కాయతొలిచే  ఆకుపచ్చ పురుగు:  
ఆశించిన తొలిదశలో ...   
ఎసిఫేట్ 1.5 గ్రా, మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ, ఇండాక్సాకార్చ్, క్వినాల్ ఫాన్ 2.0 మిలీ, 

 కాయతొలిచే ఈగ:
మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ, ఎసిఫేట్ 1.5 గ్రా, లామ్డాసైహలోత్రిన్ 1 మి.లీ.

కాయతొలిచే రసం పిల్చే పురుగులు: 
డైమిధోయేట్ 2.మిలీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ
పూత కాయ దశలో ఆశించే పురుగులలో ప్రధానమైనది.

మారుక మచ్చల పురుగు :
ఈ పురుగు ఆశించడానికి అనుకూలమైన పరిస్థితులు:
మొగ్గ పూత  చిరుపిందె సమయంలో మేఘావృతమైన వాతావరణం, చిరుజల్లులు కురవడం, మంచు వాతావరణం, పొగమంచు ఉదయాన ఎక్కువ సమయం ఉండడం, మారుకా మచ్చలు  పురుగులు ఆశించడానికి అనుకూలము. 
ఈ పురుగుని గుర్తించడానికి  ముఖ్యమైన లక్షణాలు: 
లేత గోధుమ వర్ణపు తెల్ల రెక్కల పురుగు , కోడిగుడ్డు ఆకారం గల పసుపుపచ్చని గుడ్ల ని  మొగ్గలపై, లేత ఆకులపై పిందెలపై పడుతుంది.        
గుడ్లు నుండి వెలువడిన లార్వాలు ప్రతి కణపులపై రెండు నల్లని మచ్చలు కలిగి ఉంటాయి.
ఆకులను ,పువ్వులను,  కాయలను  కలిపి గూళ్ళు గా చేసి మొగ్గలని, పిందెలని  తొలచి  తింటాయి.
తొలచిన కాయ రంధ్రం  దగ్గర లార్వా విసర్జించిన పదార్థాలు కనిపిస్తాయి. 

రచయిత సమాచారం

డా. డి.వీరన్న , డాక్టర్ యం మధు, శ్రీమతి డి.అశ్విని, డా. ఎన్. సంధ్య కిషోర్, డా. పి. జగన్మోహన్ రావు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్, పి.జె.టి.స్.ఎ.యు.