Print this page..

నాన్ వెజ్ లో నెంబర్ వన్ కోడి మాంసం.

కరోనా సంక్షోభంలో దుకాణాలలో శుభ్రత పాటిస్తే ఆరోగ్యం, ఆనందం
నిర్వాహకులు,వినియోగదారులు సూచనలు పాటించాల్సిందే

 మాంసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కోడి మాంసం నాన్ వెజ్ లో నెంబర్ వన్ దీన్ని చిన్న పెద్ద ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. అయితే దుకాణాలలో పరిశుభ్రత పాటించి తాజా మాంసాన్ని విక్రయిస్తే అందరికి ఆరోగ్యం ఆనందం.మన శరీరంలో ప్రోటీన్లు సంశ్లేషన జరగటానికి 20 రకాల అమినోఆసీడ్స్ అవసరం. మన శరీరం తనకి తానుగా 11 రకాల అమైనోఆసిడ్స్ ని సృష్టిస్తుంది. కనుక మిగిలిన 9 అమినోఆసీడ్స్ కచ్చితంగా మనం తినే ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. పశుఉత్పత్తిలు నుండి  వచ్చే ప్రోటీన్లు అనగా మాంసం, గ్రుడ్లు, పాలు మన శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆసిడ్స్ ని అందిస్తాయి. ఈ ప్రపంచంలో మాంసం తక్కువ తినేవారి శాతంలో ఇండియా 2 వ స్థానంలో ఉంది. మనదేశంలో మాంసం తలసరి వినియోగం సంవత్సరానికి  కేవలం 4.4 kg (2018 నాటికి) మాత్రమే. ఈ కోవిడ్ -19 మహమ్మారితో మాంసం తినటం తగ్గడం వల్ల, మాంసం ఆదాయాలు 4-5% వరకు పడిపోయాయి. మాంసం తినటం వలన మనకి కరోనా సోకే అవకాశం ఉందని ఆధారాలు లేవు  అయినప్పటికీ మాంసాన్ని కోసేవారికి, అక్కడ పనిచేసేవాళ్ళకి కరొనా ఉంటే కనుక వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు పట్టుకునే వస్తువుల ద్వారా మనకి సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాంసం దుకాణాల్లో పనిచేసేవారు, వినియోగదారుల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO), ఆహార భద్రతా ప్రమాణాల సంస్ధ (FSSAI), అసోసియేషన్ ఆఫ్ మీట్ సైంటిస్ట్స్ అండ్ టెక్నాలజీ (AMST) విడుదల చేసిన సూచనలను పాటిస్తే మనకి కరోనా సోకే అవకాశం తగ్గుతుంది.

వినియోగదారులు ,సామాన్యులు , పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరు కూడా పాటించవలసిన 3 సూచనలు:
1.ప్రతి ఒక్కరు ముఖానికి మాస్క్ ధరించాలి 
2.ప్రతి ఒక్కరు కూడా మరొకరి నుండి 6 అడుగుల దూరాన్ని పాటించాలి 
3.చేతులని ప్రతిసారి సబ్బుతో కానీ శానిటైజర్ తో  శుభ్రపరుచుకోవాలి .

రీటైలర్లు పాటించవలసిన జాగ్రత్తలు:
• మాంసం దుకాణాన్ని కేవలం 50% శాతం మందితో మాత్రమే కొనసాగించే విధంగా చేసుకోవాలి .దీని వల్ల ఎక్కువ స్థలం ఉండటం వల్ల  ప్రతిఒక్కరు 1 మీటర్ దూరాన్ని పాటిస్తూ పనిచేసుకోవచ్చు .
• ప్రతిఒక్కరు కూడా మాస్కను ,తలకి తోపిని ,మరియు చేతికి గ్లోవ్స్ ధరించుకొని పనిచేసుకోవాలి .
• దుకాణంలో పనిచేసేటప్పుడు వాచ్,చైన్లు ,ఉంగరాలు పెట్టుకోకూడదు. ఫోన్ ని కూడా వాడకూడదు లేదా మాట్లాడే ముందు తర్వాత శానిటైజర్ తో శుద్ధి చేసుకోవాలి .
• కోళ్లను రవాణా చేసే వాహనాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుచుకుని వాడుకోవాలి .
• వినియోగదారులకు మీ సూచనలు తెలిసేలా బయట ఒక బోర్డ్ మీద రాసి పెట్టాలి. కరోనా లక్షణాలు ఉన్నవారు దయచేసిలోనికి రావద్దని అందరికి అర్ధమయ్యే విధంగా రాయాలి  .
• వ్యాపారులకు మరియు కొనుగోలుదారులకి భౌతిక దూరం ఉండేలా ఏదైనా అడ్డు పెట్టుకోవాలి .
• నేలపైన గుర్తులతో కొలమానాలని దుకాణం లోపల, బయట పెట్టాలి.
• అందరూ వాడే టాయిలెట్స్ మరియు ఎక్కువగా ముట్టుకునే ప్రదేశాలని ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుచుకోవాలి .
• డబ్బును నోట్ల రూపంలో కాకుండా ఫోన్ ద్వారా పంపించే సౌకర్యాన్ని పెట్టుకోవాలి .
• మాంసాన్ని కోసేవారు ప్రతి గంటకు గ్లోవ్స్ ని మార్చుకోవాలి .
• ఈకలు తీసిన కోడిని కడగటానికి వాడే నీళ్ళను ప్రతిసారి మార్చుకుంటూ వాడుకోవాలి .
• మాంసాన్ని తూకం ప్లేట్లను ప్రతిసారి పరిశుభ్రపరుచుకోవాలి.  బట్టర్ పేపర్లు ను వేసుకొని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి .
• మాంసం దుకాణం ఆవరణలోకి వీధి కుక్కలను,ఇతర జంతువులను రానియ్యకూడదు .
• పని అయిపోయిన తర్వాత చెక్కదుంగను వేడినీటితో శుభ్రంగా కడిగి పైన పసుపు చల్లుకొని ఉంచుకోవాలి. దుకాణంలో వాడే కత్తులు ,గిన్నెలు, ట్రేలను వేడినీటిలో 5 నిమిషాలు ఉంచి, సబ్బునీళ్ళతో కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. పనిచేసిన స్థలాన్ని కూడా శుభ్రపరుచుకొని బ్లీచింగ్ పొడి కలిపిన నీటిని చల్లు కోవాలి .

కొనుగోలుదారులకు సూచనలు :
• దుకాణానికి వెళ్లేముందు ఇంటిదగ్గర నుండే ప్లాస్టిక్ సంచిని తీసుకవెళ్లాలి.
• డబ్బును నోట్లరూపంలో కన్నా ఫోన్ల ద్వారా ఇచ్చేట్టుగా ప్రయత్నించండి.అప్పుడు మనం చిల్లరని మళ్ళీ ఇంటికి తీసుక వెళ్ళే అవసరం ఉండదు.
• మాంసాన్ని కడిగిన నీళ్ళను వంటగదిలో ఉన్న సింక్ లో కాకుండా బయట దూరంగా ఉండే ప్రదేశంలో పోయాలి. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని వేడినీటితో కడిగి కొద్దిగా బ్లీచింగ్ పొడి ని చల్లుకోవాలి. ఓ పరిశోధనలో మాంసాన్ని కడిగిన నీరు వల్ల ప్రాణానికి హానికరమైన బాక్టీరియా వృద్ధి చెందుతుందని మనకి అస్వస్థత కలుగుతుందని వెల్లడైంది. 
• మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. మాంసం ఉడుకుతున్నప్పుడు రుచిచూడటం తగ్గించుకోవాలి .
                

రచయిత సమాచారం

డా. సౌజన్య ప్రియ రోణంకి , పి.జి. స్కాలర్ , పశువైద్య ప్రజారోగ్య, సముదాయ రోగ అధ్యయన శాస్త్ర విభాగము , శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ,తిరుపతి .