Print this page..

పత్తిలో రసం పీల్చు పురుగులు- యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రధాన పంటల్లో పత్తి పంట ముఖ్యమైనది.ప్రస్తుతం పత్తిని రైతులు రైతులు బిటి పత్తి హైబ్రిడ్లగానే సాగు చేస్తున్నారు.బిటి పత్తి సాగు లోకి వచ్చిన తర్వాత కాయ తొలుచు పురుగుల ఉధృతి  తగ్గినప్పటికి ముఖ్యంగా రసం పీల్చు పురుగుల సమస్య ఎక్కువగా కనపడుతుంది.ఈ నేపధ్యంలో పత్తిని ఆశించే రసం పీల్చు పురుగులైన తెల్లదోమ,పచ్చదోమ,పేనుబంక,తామరపురుగులు,నల్లి వంటివి ఎక్కువగా అశిస్తున్నట్టు గమనుంచడం జరిగింది.రైతులు సకాలంలో ఈ పురుగుల యొక్క ఉనికిని గమనించి ,సమగ్ర సస్య రక్షణ యాజమాన్య పద్దతులను క్రింద తెలిపిన విధంగా పాటించాలి.

పేనుబంక:
పిల్ల మరియు తల్లి ఉప్రుగులు  మొక్క లేత కొమ్మల నుండి మరియు ఆకు అడుగు భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి.ఆకులు దోనెలాగా మారి పెరుగుదల కుంటుబడుతుంది.ఇవి తేనే వంటి జిగురు పధార్ధాన్ని విసర్జించడం వల్ల మొక్కల ఆకులపై ,కాండం పైన నల్లి బూజు ఏర్పడుతుంది..దీని వలన కిరణ జన్య సంయోగ క్రియ తగ్గుతుంది .

యాజమాన్యం:
కాండానికి మందు పూసే పద్దతి పాటించాలి.అవసరన్ని బట్టి ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేద థయోమిథాక్సాం 0.2 గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.జీవ రసాయనాలైన వేప గింజల కషాయం లేదా వేప నూనె పిచికారి చేయాలి.

తామర పురుగులు:
వర్షాలు తక్కువగా ఉండి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే బెట్ట వాతావరణ పరిస్తితులలో  తామర పురుగులు విపరీతంగా బృద్ది చెందుతాయి.తల్లి పురుగులు చాల చిన్నవిగా,సున్నితంగా పసుపు నుండి గోదుమ రంగులో చీలిన రెక్కలతో ఉంటాయి.పిల్ల పురుగులు ,తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను మరియు పూ మొగ్గలను గీకి రసాన్ని పీలుస్తాయి.దీని వలన ఆకులు పసుపు రంగుకు మారి వాడిపోయి,గిడసబారి,ఆకులు ముడుచుకొని పెళుసుగా మారి రాలిపోతాయి.పైరు తొలిదశలో వీటి ఉదృతి ఎక్కువగా ఉంటే మొక్క గిడసబారి పెరుగుదల తగ్గుతుంది.పత్తిలో తలమాడు తెగులుని తామర పురుగులు వ్యాప్తికి వాహకాలుగ పనిచేస్తాయి.ఆకుల అడుగు భాగాన ఈనెల వెంబడి వెండి వలే మెరిసే చారలు కనపడతాయి.

యాజమాన్యం:
పురుగు ఉధృతిని ట్టి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా డైపెన్ థయారాన్ 1.25 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తొలిదశలో, పురుగు ఆశించినప్పుడు వేప గింజల కషాయం 5% లేదా వేప నూనె 1500 పి.పి.ఎమ్ 5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
పంటలో తామర పురుగుల కోసం నీలి రంగు జిగురు అట్టలను ఎకరాకు 10-15 అమర్చుకోవాలి.

తెల్లదోమ : 
తెల్లదోమ ఎక్కువగా పైరు పిందె, కాయ దశలలో సెప్టెంబరు - అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ప్రత్తిని ఆశిస్తుంది.
పిల్ల దోమలు పసుపు ఆకుపచ్చ రంగులో ఉండి, కోడిగ్రుడ్డు ఆకారంలో ఉంటాయి.
తల్లి పురుగులు పసుపు పచ్చని శరీరం, తెల్లటి రెక్కలతో ఉంటాయి. 
తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగానికి చేరి రసాన్ని పీలుస్తాయి, దీని వలన ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి మొక్కలు గిడసబారిపోతాయి.
దోమ ఆశించిన పంటలో, పూ మొగ్గలు, ఆకులు, పిందెలు రాలిపోతాయి. కాయలు తయారు కాకుండానే విచ్చుకొని నాణ్యత తగ్గుతుంది. గింజలలో నూనె శాతం కూడా తగ్గుతుంది.
ఈ పురుగులు విసర్జించే తేనె వంటి పదార్ధం వలన నల్లని బూజు తెగులు వ్యాపిస్తుంది.
ఆకుల నుంచి రసం పీల్చడం వలన ఆకులు పాలిపోయి, ఈనెలు గుళ్ళగా అయి, ఆకులు బీరునెక్కి పూర్తిగా ఎదగకుండానే రాలిపోతాయి.

యాజమాన్యం :
కాండానికి మందు పూసే పద్ధతి పాటించాలి
పంట తొలిదశలో సింథటిక్ ఫైరిథ్రాయిడ్ మరియు ఆర్గానో ఫాస్పేట్ మందులను విచ్చలవిడిగా పిచికారి చేయకూడదు.
తొలి దశలో, వేప గింజల కషఆయం 5% లేదా వేప నూనె 1500 పి.పి.ఎమ్ 5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 
పురుగు ఉధృతిని బట్టి, డైపెన్ ధయూరాన్ 1.25 గ్రా. లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
పంటలో తెల్లదోమ కోసం పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 10-15 అమర్చుకోవాలి.

పిండి నల్లి :
పిల్ల పురుగులు లేత పసుపు రంగుతో కూడిన తెలుపు రంగులో ఉంటాయి.
తల్లి పురుగులు రెక్కలు లేకుండా మైనపు పూతతో కప్పబడి ఉంటాయి.
ఈ పురుగులు ఆకు తొడిమలు, ఆకులు, పూత, కాయల నుండి రసాని్న పీలుస్తాయి. దీని వలన ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి మరియు పూత, పిందె రాలుతాయి.
పురుగులు ఆశించిన కొమ్మలు, కాయల మీద తెల్లటి పొడిలాగా ఉంటుంది.
ఉధృతి ఎక్కువాగా ఉంటే మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి. 
ఈ పురుగులు తేనెవంటి జిగురు పదార్ధం విసర్జించడం వల్ల నల్లటి బూజు తెగులు ఆశించి ప్రత్తి నాణ్యత తగ్గుతుంది.

యాజమాన్యం :
తొలిదశలో, వేప గింజల కషాయం 5% లేదా వేపనూనె 1500 పి.పి.ఎమ్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
ఉధృతిని బట్టి ప్రొఫెనోఫాస్ 50 ఇ.సి. 2 మి.లీ. + సాండోవిట్ లాంటి జిగురు మందులను 1 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

ఎర్రనల్లి :
ఎర్రనల్లి ముఖ్యంగా పైరు పిందె, కాయ దశలలో బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆశిస్తుంది.
పిల్ల పురుగులు ఎర్ర రంగులో, కంటికి కనిపించనంత పరిమాణంలో ఉంటాయి. తల్లి పురుగులు కోడి గ్రుడ్డు ఆకారంలో ఉంటాయి.
పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి సాలీడు గూడులో అల్లిక చేసి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. దీని వలన ఆకులపై పసుపు పచ్చని చుక్కలు ఏర్పడతాయి.
తరువాత ఆకు మధ్య భాగం నుండి ఎరుపుగా మారి ఎండిపోతుంది.
ముదురు ఆకులపై వీటి ప్రభావాన్ని ఎక్కువగా గమనించవచ్చు.
పంట తొలిదశలో, సింథటిక్ పైరిథ్రాయిడ్ మరియు నియో నికోసినాయిడ్ మందులను విచ్చలవిడిగా పిచికారి చేయకూడదు.

యాజమాన్యం : 
నీటిలో కరిగే గంధకము 3 గ్రా. లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

రచయిత సమాచారం

డా. కె. రవి కుమార్, డా. జె. హేమంత్ కుమార్, డా. పి. శ్రీరంజిత, శ్రీ పి.ఎమ్, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా