Print this page..

మునగ ఆకు - మంచి లాభాలు

దక్షిణ భారతదేశంలో పెరటిలో పెంచే బహువార్షిక మొక్కగా మునగ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది.దక్షిణ భారతదేశంలో మునగ ఒక ముఖ్యమైన కాయగూర పంట.వీటి కాయలు,ఆకులను ఎక్కువగా వంటకాల్లో వాడటం మన తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితి.ఇతర ఆకుకూరలతో పాటు మునగాకును కూడా వాడాల్సిన అవసరం ఎంతో ఉంది.వీటి కాయల కన్నా అధిక పోషకాలు అందించేది మునగాకు. మన రాష్ట్రాల్లో మునగ ఆకు గురించి సరి అయిన అవగాహన లేక ఆహారంలో వీటి వాడుక వెనుకబడి ఉన్నది.మునగ ఆకు 300 రకాల జబ్బులను నివారిస్తుందని పరిశోధనలో వెల్లడయింది. వారానికి ఒకసారి లేదా కనీసం నేలకొకసారైనా తింటే చాలా మంచిది.

మునగ ఆకు తింటే: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జీవ రక్షక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.శరీరంలో కణనిర్మాణాన్ని క్రమబద్దం  చేస్తుంది.క్యన్సర్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది.ఇందులో విటమిన్ "" పుష్కలంగా ఉంటుంది.కాబట్టి కంటికి పోషణనిస్తుంది.మెదడు తీరును చురుకుగా ఉంచుతుంది.శరీరంలో కొలెస్టాల్ను సమన్వయం చేస్తుంది.అధికంగా చేరిన చక్కర నిల్వలను నియంత్రిస్తుంది.యాంటి ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉండి చర్మాన్ని ముడతలు లేకుండా మౄదువుగా మారుస్తుందిలివర్,కిడ్నీల పనితీరును మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.కీళ్ళవాతము,వాపుల నొప్పులను తగ్గిస్తుంది.గాయాలు,అల్సర్లు,ట్యూమర్లు వంటివి తగ్గడానికి మందులా పనిచేస్తుంది. ఆహారం ద్వారా ఇతరత్ర శరీరానికి విషతుల్యమైన పదార్థాలు కడుపులోకి చేరినపుడు వాటిని వెంటనే బయటకు పంపిస్తుంది. నీటిని కూడా శుభ్రం చేస్తుంది.నీటిని కాచి వడపోయటం వంటి పనులకు బదులుగా నీటిలో మునగాకును వేస్తే కొద్ది సేపటికి శుభ్రపడి స్వచ్చమైన నీరు సిద్దమవుతుంది.

100 గ్రాముల మునగ ఆకులో ఉండే పోషకాల సమాచారాన్ని మరియు రోజుకు అవసరమయ్యే వివిధ పోషకాలను అందించే విలువలను క్రింది పట్టికలో చూపబడినది

పేరు

 

దానిలో అందించే శాతం

శక్తి

64 కిలో కాలరీలు

3.2%

పిండి పదార్థాలు

8.3 గ్రాములు

3 %

 పీచు పదార్థం

2 గ్రాములు

8%

మాంసకౄతులు

9.4 గ్రాములు

19%

 క్రొవ్వు

1.4 గ్రాములు

2%

 ఐరన్

4 మిల్లీ.గ్రాములు

22%

కాల్షియం

185 మిల్లీ.గ్రాములు

18%

మెగ్నిషియం

42 మిల్లీ.గ్రాములు

10%

ఫాస్పరస్

112 మిల్లీ.గ్రాములు

11%

పొటాషియం

337 మిల్లీ.గ్రాములు

7%

విటమిన్ బి5

0.125 మిల్లీ.గ్రాములు

1%

విటమిన్ బి3

2.22 మిల్లీ.గ్రాములు

11%

విటమిన్ బి2

0.66 మిల్లీ.గ్రాములు

30%

విటమిన్ బి1

0.257 మిల్లీ.గ్రాములు

17%

విటమిన్

7564 I.U

15%

విటమిన్ బి6

1.2 మిల్లీ.గ్రాములు

60%

విటమిన్ సి

51.7 మిల్లీ.గ్రాములు

80%

మధుమేహమును నియంత్రిస్తుంది : .మునగ ఆకులతో ఐసోథైయోసైనైట్స్ అనే పదర్థం కలిగి ఉండటం వలన మధుమేహమును తగ్గించే గుణాన్ని కలిగి ఉంది.2014 లో జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ టెక్నాలజిలో ప్రచురించిన ఒక అధ్యయనంలో మునగ ఆకు పౌడర్ రోజుకు 7 గ్రాముల చొప్పున 30 నెలల పాటు తీసుకున్నప్పుడు 30-45 సంవత్సరాల వయస్సులో ఉన్న మహిళలలో రక్తంలో చక్కెర స్థాయిలను 30.5% శాతం తగ్గిస్తుందని కనుగొన్నారు.

కొలెస్టాల్ను నియంత్రిస్తుంది:రక్తంలో అధిక రక్త కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది.మునగ ఆకు ఇతర మొక్కల ఆహారాలు లాగానే కొలెస్ట్రాల్ను తగ్గించే ప్రభావాలను కలిగి ఉన్నది.ఉదాహరణకి 2008 లో జర్నల్ ఆఫ్ ఎథ్నో ఫార్మాకాలజిలో ప్రచురించబడిన ఒక అధ్యాయనం ప్రకారం,అధిక కొలెస్ట్రాల్,రక్తపోటు మరియు హ్రుదయ సంబంద  వ్యాదులను నివారించే గుణమ్ను మునగ ఆకు కలిగి ఉన్నదని తెలిపినది.మునగ ఆకు శరీరంలోని తాపజనక ఎంజైములను  మరియు ప్రోటాన్లను అణచివేయటం ద్వారా వాపులను తగ్గిస్తుంది.ముఖ్యంగా క్యాన్సర్  మరియు గుండె  జబ్బుల్లో దీర్ఘకాలిక మంట లేద బాదలను  మునగ ఆకు తగ్గిస్తుంది.మునగ ఆకులోని ఐసోథైయోసైనైట్స్ వలన ఇది సాధ్యపడుతుందని  జంతు అధ్యాయనాలు నిర్ధారించాయి.

కలుషితాన్ని నిర్మూలిస్తుంది: నీరు మరియు ఆహారంలో ఆర్సెనిక్ కలుషితం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన సమస్యగా పరిగణించబడుతుంది. కాలక్రమేణా,ఆర్సెనిక్ విషపూరితం గుండెజబ్బు మరియు క్యాన్సర్ ప్రమదాన్ని పెంచుతుంది.2014 లో ట్రాఫికల్ బయోమెడిసిన్ ఆసియా పసిఫిక్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం కూడా మునగ ఆకు సహ విషపూరిత రక్షిత ప్రభవాలను కలిగి ఉన్నదని తెలిపినది.ఆహారంలో మునగ ఆకు కూరను చేర్చటం మంచి ఆహార సంబంధ ఆరోగ్య లాభాలను పొందవచ్చు.ఆహారంలో మునగ ఆకుకూర ఆహార వైవిద్యానికి మంచి బాట.

రచయిత సమాచారం

జి.శైలజ.శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట విశ్వ విధ్యాలయం హైదరాబాద్,రాజేద్రనగర్. నంబర్:8179088347