Print this page..

సజ్జలో హైబ్రిడ్ విత్తనోత్పత్తి

వరి,మొక్కజొన్న తర్వాత పుష్కలమైన పోషకాలు వచ్చే అహార పంట సజ్జ,భారతదేశంలో సజ్జ పంటను అధిక విస్థీర్ణంలో పండించే రాష్ట్రాలు,రాజస్థాన్,గుజరాత్,మహారాష్ర,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో,సజ్జ సంకర జాతి విత్తనోత్పత్తిని ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలలో చేస్తున్నారు.
పుష్పము:
ఈ పంటలో పరపరాగ సంపర్కం ఎక్కువగా జరుగుతుంది.ఇందులోని పుష్పాలలో అండాశయం ముందుగా పక్వానికి వస్తున్నందున తప్పనిసరిగా పరపరాగ సంపర్కం జరుగుతుంది.విత్తిన 7 వరాల తర్వాత కంకి బయటకు వస్తుంది.కంకి బయటకు వచ్చిన రెండు మూడు రోజులకు కీలాగ్రం బయటకు వెలువడతాయి.ఇది కంకిపై నుండి క్రింది వైపునకు జరుగుతూ దాదాపు 24గంటలు కొనసాగుతుంది.వెలువడిన కీలాగ్రాలు దాదాపు 12-24గంటలంపాటు పుప్పొడిని స్వీకరించే స్థితిలో ఉంటాయి.
కేసరాలు వెలువడే సరికి కీలాగ్రాలు పుప్పొడిని స్వీకరించే స్థితిలో ఉండవు.ఎండిపోయి ఉంటాయి.కేసరాలు కంకి మధ్యభాగంలో వెలువడి అటుపై వైపునకు ఇటు క్రింది వైపునకు వెలువడతాయి.పుష్పాలు విచ్చుకునేది రోజంతా జరిగినప్పటికీ ఎక్కువభాగం ఉదయం8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల మధ్యలో ఉంటుంది.
విత్తనోత్పత్తి పద్దతులు:
A.రకాలు:వివాత పరాగ సంపర్కం(ఓపెన్ పాలినేషన్)
B.సంకరరకాలు:సైటో  ప్లాస్‌మిక్ జెనెటిక్ పురుష వంద్యత్వ-ఎ.బి లైన్ &ఆర్ లైన్
విత్తనోత్పత్తి దశలు:
1.రకాలు:బ్రీడర్-పునాది-ధృవీకరణ విత్తనం.
2.సంకర రకాలు:మూల విత్తనం:కంకి-వరుస పద్దతి.
బ్రీడరు విత్తనం:

    A లైన్ విత్తనోత్పత్తి(A*B-A)
    B లైన్ విత్తనోత్పత్తి:సరైన ఏర్పాటు దూరంపాటించి చేపట్టాలి.
    R లైన్ విత్తనోత్పత్తి:సరైన ఏర్పాటుదూరం పాటించి చేపట్టాలి.
పునాది విత్తనం:
      A లైన్ విత్తనోత్పత్తి(A*B-A)
       R విత్తనోత్పత్తి:ఏర్పాటు దూరం పాటించి విత్తనోత్పత్తి చేయుట.
ధృవీకరణ విత్తనం:

     A*R సంకర విత్తనోత్పత్తి 
     A లైన్:పురుష వంద్యత్వ(పుప్పొడి రాని ఆడ మొక్కలు,B లైన్ మగ మొక్కలు
     B లైన్ :పురుష వంద్యత్వాన్ని పూరించే మగ మొక్కలు.

విత్తేకాలం:

రబీ(అక్టోబర్-నవంబర్)వేసవి (జనవరి-ఫిబ్రవరి)బాగా 
అనుకూలమైన సమయం మరియు వేసవిలో విత్తనోత్పత్తి చేయడం వల్ల కీటకాలు,శిలీంద్రాలు తక్కువ ఆశించి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.అనుకూలమైన వాతావరణం విత్తనోత్పత్తికి ముఖ్యం.
 వాతావరణ ఉష్ణోగ్రత 37డిగ్రీల సెంటిగ్రేడ్ మంచి విత్తనం ఏర్పాటుకు అనుకూలం,సంపర్క సమయంలో వర్షాలు లేకుండా ఉంటే మంచిది.

నేలలు:
సారవంతమైన నేలలు,తేలిక నుండి మధ్య రకం నేలలు,నారు ఇంకే మురుగు నీటి పారుదల గ నేలలు అనుకూలం.సమస్యాత్మక భూములను ఎంపిక చేయరాదు.అదే నేలలో క్రితం వేసిన పంట ఇప్పుడు వేస్తున్న పంట ఒకటి కాకూడదు.నేలలు ఏర్పాటు దూరం ను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేయాలి.నీటి వసతి ముఖ్యము.
వేర్పాటు దూరం:

   బ్రీడరు/పునాది విత్తనం ధృవీకరణ విత్తనం
రకాలు(ఒపివి)  400మీ. 200మీ
సంకర రకాలు 1000మీ       200మీ

విత్తనము:

సరైన విత్తనాన్ని సరైన విత్తన దశ/బ్రీడర్-ఫౌండేషన్ -సర్టిఫైడ్ వృద్ది చేయడానికి వినియోగించాలి.
రకాల విత్తనోత్పత్తి:

   రకాలు(ఒపివి) 4కిలోలు ఒక హెక్టారుకు.
సంకర రకాల విత్తనోత్పత్తికి:

   ఎ లైన్ -3కిలోలు ఒక హెక్టారుకు.
   బి/ఆర్ లైన్ -1 కిలో హెక్టారుకు.
విత్తన శుద్ది:

ఒక లీటరు నీటిలో 20గ్రా ఉప్పును కరిగించి(2%),10-15నిమిషాలు విత్తనం నానబెడితే తాలు విత్తనం,ఎర్గాట్ ఆశించిన విత్తనం,సరిగ్గా గింజ నిండని విత్తనాలు పైకి తేలుతాయి.వాటిని తీసివేసిన  తర్వాత ఆరిన కిలో విత్తనానికి 3గ్రా,థైరం లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ది చేస్తే విత్తనాల ద్వారా సంక్రమించే శిలీంద్రాలు రాకుండా కాపాడుకోవచ్చును.
విత్తేదూరం:
సాలుకు సాలుకు 45 సెం.మీ,సాళ్ళల్లో మొక్కల మధ్య 10-15సెం.మీ దూరం ఉండేలా నాటుకోవాలి.
నారుమడి తయారి:

సుమారు 260చ.మీ(6.5సెంట్లు)నారుమడి ఒక ఎకరానికి సరిపోతుంది.నారుమడిలో సేంద్రీయ ఎరువు 20కిలోలు,1కిలొ నత్రజని,అర కిలో భాస్వరం,అర కిలో పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి.కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి మొవ్వు చంపు ఈగ,కాండం తొలుచు పురుగు రాకుండా కాపాడుకోవచ్చును.
ఆడ,మగ వరుసల నిఎష్పత్తి: రెండు మగ వరుసలకు 6-8 వరుసల ఆడ మొక్కలు గాలి వాలుకు ఎదురుగా నాతాలి.పుప్పొడి పుష్కలంగా ఆడ మొక్కలపై పడటానికి వీలుగా నాలుగు వరుసల మగ మొక్కలు పొలం చుట్టూ వేయాలి.

ఎరువుల యాజామాన్యం:
పశువుల ఎరువు 10టన్నుల్లు హెక్టారుకు దుక్కిలో వేసి కలియదున్నాలి.హెక్టారుకు 60 కిలోల నత్రజని,30కిలోల భాస్వరం,24కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసి దుక్కిలో కలియదున్నాలి.తర్వాత నీరు పెట్టి 14-21రోజులలో నారు ప్రధాన పొలంలో పైన ఉదహరించిన విధంగా రెండు వరుసల మగ మొక్కలు,6-8 వరుసల ఆడ మొక్కలు నాటాలి.సగ భాగం నత్రజనిని 30రోజుల వ్యవధిలో వేసి నీరు కట్టాలి.
కలుపు నివారణ:
విత్తిన రెండు రోజులలో అట్రాజిన్(50డబ్ల్యు.పి) 500గ్రా,200లీటర్ల నీటిలో కలిపి తడిగా ఉన్న నేలపై పిచికారి చేయాలి.అవసరమైతే దంతెలతో,మనుషులతో,కలుపుతీయాలి.విత్తిన రెండు వారాలలోపు ఒత్తుమొక్కలు తీసివేయాలి.
నీటి యాజమాన్యం:
నారు నాటే వేళ,గింజ పాలుపోసుకునే  సమయంలో,గింజ గట్టిపడే సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.తేలిక నేలల్లో వారం రోజులక్లు ఒకసారి,బరువు నేలల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి నారు అందించాలి.
సమ/ఏక కాలంలో పుష్పించుట:
ఏక కాలంలో జనన మొక్కలు పుష్పించుట సజ్జ పంటలో అంత సమస్య కాదు.ఈ పైరుకు పిలకలు వేసే లక్షణం ఉన్నందువల్ల ఏ కాలంలో పుష్పించుట అంత సమస్య కాదు.పొప్పొడి రేణువులు తేలికగా ఉండటం వల్ల ఎక్కువ దూరం ప్రయాణం చేయగలవు.అదేకాక ఈ పంటలో పుప్పొడి మరియు కీలాగ్రం యొక్క గ్రాహక శక్తి ఎక్కువ కాలం ఉంటుంది.కానీ వివిధ జననీ జనకులు ఉన్న సంకర రక్కల విత్తనోత్పత్తిలో దఫాల వారిగా మగ వరుసల విత్తుట,యూరియా/డి.ఎ.పి(2%)పిచికారి లేదా నీటి తడులు తగ్గించుట వల్ల సమకాలంలో పుష్పించేలాగా సర్ధుబాటు చేయవచ్చును.
కల్తీల ఎరువేత:
కల్తీల ఏరివేతకు మూడు దశలలో మొలకదశ,పిలకలు వేసే దశ మరియు విత్తనం ఏర్పడే దశలలో మొక్క పెరిగే విధానం,ఆకుల రంగు,నూనుగు,ఆకుల మధ్య ఈనే రంగు,కణుపు రంగు,కంకి ఆకారం,పరిమాణం,రంగు మొదలైన లక్షణాల అధారంగా బేరివేయుట వలన జన్యస్వఛ్చతను కాపాడుకోవచ్చును.

పొలం ప్రమాణాలు:

ప్రమాణము

           గరిష్ట పరిమితి%

పునాది విత్తనం

ధృవీకరణ విత్తనం

వేసిన రకానికి సంబందించని మొక్కలు

  0.05  

0.10

ఆడ వరుసలలో పుప్పొడిని ఇచ్చే మొక్కలు

  0.05  

0.10

వెర్రి కంకులు ఆశించిన మొక్కలు  

  0.05  

0.10

బంకకారు కంకులు

   0.02

0.04

(0.05%) 100  మొక్కలకి 5 మొక్కలు.
విత్తనోత్పత్తి ప్రక్రియ:

ఆడ మొక్కలకు సరిపడు సుంకు లేదా పుప్పొడి ఏర్పాటు చేయాలి.గాలి వాలుకు అడ్డంగా మగ,ఆడమొక్కలు వేయాలి.పొలం చ్ఘుట్టు 4 వరుసల మగ మొక్కలు వేస్తే గింజ పూర్తిగా పడుతుంది.గాలి ద్వారా  పుప్పొడి ఒక మొక్క నుండి మరొక మొక్కకు చేరుతుంది.అందువల్ల ఒకే సమయంలో ఆదా,మగ మొక్కలు పుష్జ్పించే విధంగా ముందే ఏర్పాటు చేసి నాటుకోవాలి.సాధారణంగా మగ మొక్కలు ఆలస్యంగా పూతకు వస్తాయి.వ్యత్యాసమున్న రోజులను దృష్టిలో పెట్టుకొని ముందుగానే మగ మొక్కలను నాటుకోవాలి.మగ మొక్కల వరుసలకు వెదురు బద్దలు కట్టాలి.పుప్పొడి సరిగా లేకుంటే గింజ సరిగ్గా పట్టదు.పుప్పొడి రావడం 2-3రోజులు ఆలస్యంగా ఉంటే 2%యూరియా పిచికారి చేయాలి.
పంట నూర్పిడి:

సజ్జ పిలక నిచ్చే పంత.ముందుగా మగ మొక్కల్ కంకులను కోసి వేరుగా ఎండబెట్టి మార్కెట్లో అమ్మివేయాలి.ఆడ మొక్కల వేరుగా కంకులను కోసి శుభ్రమైన కల్లం లో ఎండబెట్టాలి.ఆడ మొక్కల నుంచి సంకర విత్తనం వస్తుంది.ఆడ మొక్కల నుంచి సంకర విత్తనం వస్తుంది.పంట కోసే సమయంలో గింజలు 16%దాకా తేమ ఉంటుంది.దాన్ని 9-10శాతం వరకు తగ్గించాలి.మొదటి కోత 60%,రెండవ కోత 20-25%,మూడవ కోత 15-20%వస్తుంది.
మొదటి రెండు కోతలలో వచ్చిన విత్తనం శుభ్రం చేసి కొత్త గోనేసంచులలో నిల్వ చేయాలి.
సస్య రక్షణ:
నారు మడిలో మొదటి 20 రోజులలో సస్యరక్షణ చర్యలు చాలా ముఖ్యం.మొవ్వుతొలుచు పురుగు,మచ్చల కాండంతొలుచు పురుగు,మిడ్జి(అగ్గిపురుగు),కంకినల్లి,మొవ్వునల్లి,పేనుబంక,ఎర్రగొంగళి పురుగు,లద్దెపురుగు,ఎర్రనల్లి,గులాబి రంగు పురుగు,శనగపచ్చ పురుగు రాకుండా ఇమిడాక్లోప్రిడ్(6-7గ్రా/కేజి)మందుతో విత్తనశుద్ది చేసుకోవాలి.కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు 1 మీతరు చాలుకు 2గ్రాముల వంతున చాళ్ళల్లో విత్తేటప్పుడు వేయాలి.ఫ్రొఫినోఫాస్ 2మి.లీ లీటరు నీటికి కలిపి విత్తనం మొలచిన 7,14,21 రోజులలో పిచికారి చేయాలి.
తేలిక నేలల్లో చెదల నివారణకు ఎకరానికి 8కిలోల2%మిథైల్ పారాథియాన్ పొడిని దుక్కిలో వేసి కలియదున్నాలి.లేత మొక్క దశలో మిడతల నుండి సజ్జను కాపాడటానికి 5%కార్బరిల్ పొడిని లేదా 2%మిథైల్ పారాథియాన్ ఎకరానికి 8-10కిలోల చొప్పున సస్య రక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే ఒక ఎకరానికి 200లీటర్లు నీటితో సిఫార్సు చేయబడిన మోతాదులో క్రిమినాశక/శిలీంధ్రనాశక మందు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయవలసి ఉంటుంది.
తెగుళ్ళు;
పచ్చ కంకి/వెర్రి కంకి తెగుళ్ళ నివారణకు కిలో విత్తనానికి 6గ్రా ఆప్రాన్ ఎస్.డి మందులో విత్తనశుద్ది చేయాలి.వ్యాధి సోకిన మొక్కలను ఏరి కాల్చి వేయాలి.విత్తిన 21 రోజులకు తెగులు మొక్కలు 5%మించి ఉన్నట్లైతే రిడోమిల్ డబ్ల్యు.పి 25 లీటరు నీటికి 1గ్రా ,వంతున పిచికారి చేయాలి.తేనేబంక తెగులు,బూజు,ఆకు ఎండు,అగ్గి తెగులు,కాటుక తెగులు,కాండం కుళ్ళు,తుప్పు,మచ్చలు,మసి చారలు,కంకి కాటుక తెగులు నివారణకు విత్తనాలను 2%(20గ్రా/లీ)ఉప్పు నీటి ధ్రావణంలో శుద్దిచేయాలి.పైరు పూత దశలో మాంకోఅజెబ్(2.5గ్రా/లీ)లేదా కార్బెందజిం(1గ్రా/లీ)జైరాం(2గ్రా/లీ)ను వరామ రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

రచయిత సమాచారం

డా.డి శశిభూషణ్,డా,సి.వి సమీర్ కుమార్,డా.టి ప్రదీప్ ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయం.