Print this page..

వరిలో జింక్ యాజమాన్యం

రబీలో  జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడతాయి.జింక్ ధాతు లోపం వలన మొక్కల్లో పైనుంచి  3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది.ఈ లోప తీవ్రత ఎక్కువైనప్పుడు ముదురు ఆకు చివర్లలో ,మధ్య ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుకరంగు మచ్చలు కనపడతాయి.ఆకులు చిన్నవిగా ,పెళుసుగా మారితాయి.మొక్కలు గిడసబారి దుబ్బు కూడా చేయవు.నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు.


     జింక్ లోప సవరణకు ఒకే వరి పంటకు భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి రబీ సీజన్ లో,ఆఖరి దుమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్  వేయాలి.లేదా 10 కిలోల జింక్ సల్ఫేట్ ను 200-500కిలోల బాగా మాగిన పశువుల పేడ లేదా వర్మి  కంపోస్ట్ తో కలిపి 20 నుంచి 30 రోజుల వరకు గోనే సంచిలో ఉంచి మాగ బెట్టి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి.

పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున 5 రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారి చేయాలి.
జింక్ సల్ఫేట్ ధ్రావణం లో పురుగు /తెగుళ్ళ మందులను కలుపరాదు.చౌడు నేలల్లో జింక్ సల్ఫేట్ పిచికారి తప్పకుండా చేయాలి.

రచయిత సమాచారం

డా.యు.నాగ భూషణం ,డా.ఆర్ శ్రవణ్ కుమార్ ,డా .కె.రాజేంద్ర ప్రసాద్,డా.బి సతీష్ చంద్ర,డా.కె రుక్మిణి దేవి,డా.ఎస్ మాలతి,డా.పి.జగన్మోహన్ రావు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం -వరంగల్.