Print this page..

చెఱకులో వేసవి కాలంలో నీటి ఎద్దడి పరిస్థితులలో తీసుకోవలసిన జాగ్రత్తలు

చెఱకు  ముఖ్యమైన వాణిజ్య పంట .చెఱకు నుండి బెల్లం,చక్కెర,కండసారి కాకుండా ఉప ఉత్పత్తులైన మొలాసిస్,ఇథనాల్,చెఱకు పిప్పి నుండి విధ్యుత్తు ఉత్పత్తి తయారు చేస్తున్నారు.ఇన్ని ఉపయోగాలున్న చెఱకు పంటలొ నీటి ఎద్దడి వేసవి కాలంలో ఎదురయ్యే సమస్య .నీటి ఎద్దడి వలన దిగుబడులు తగ్గుతాయి. 
చెఱకు పంట పక్వతను బట్టి స్వల్ప కాలిక రకాలైతే 10 నెలలకే పక్వానికి వస్తాయి.మధ్యకాలిక రకాలు 12 నెలలకు పక్వానికి వస్తాయి. ధీర్ఘకాలిక రకాలు 14 నెలల తర్వాత పక్వానికి వస్తాయి.ఇల పక్వతను బట్టి చెఱుకును డిసెంబర్ నుండి మార్చిలోపు నాటుకోవాలి. నీటి ఎద్దడి ప్రాంతాల్లో నాటుకునే వారు నీటి ఎద్దడికి తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని నాటుకోవాలి.
నీటి ఎద్దడికి తట్టుకోలేని దశలు :
పిలకలు పెట్టే దశలు,పెరుగుదల దశ,పెరుగుదల దశ చాలా వరకు వర్షాకాలంలోనే వస్తుంది.వర్షాలు బాగా పడితే వర్షంతో పెరుగుతాయి.పిలకలు పెట్టే దశల్లో నీటి ఎద్దడి వలన పులకల సంఖ్య తగ్గి దిగుబడి తగ్గుతుంది.అదే పెరుగుదల దశలో అయితే పెరుగుదల తగ్గిపోయి మొక్కలు గిడసబారిపోయి కణుపుల మధ్య దూరం తగ్గి దిగుబడి తగ్గుతుంది.
     అలాంటి పరిస్థితులలో చెఱకు పంటలో  రెండవ  దఫాగా నత్రజనితోపాటు సగభాగం పొటాష్ ను పైపాటుగా  పంటకు అందించినట్లైతే వేసవిలో నీటి ఎద్దడికి కొంతవరకు తట్టుకుంటుంది.పొటాష్ ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో సిఫార్సు చేసిన మోతాదును రెండు భాగాలుగా చేసి సగ భాగం అఖరి దుక్కిలో మిగిలిన సగం ను పై పాటుగా అందించాలి.
ఎరువుల పిచికారి:
నీటి ఎద్దడి పరిస్థితులలో నేలలోని పోషకాలను గ్రహించే శక్తి ఉండదు .కావున పంట దశను బట్టి పెరుగుదలను బట్టి 2.5 శాతం యూరియా మరియు  2.5 శాతం పొటాష్ లను కలిపిన ధ్రావణం ను ఉదయం 11 గంటలలోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత పిచికారి చేయడం వలన పంట బెట్టకు గురికాకుండా మేలైన చెఱుకు దిగుబడులు వస్తాయి.
చెఱకు చెత్తను కప్పడం:
చెఱకు నాటిన 3-5 రోజుల తర్వాత చెత్తను కప్పడం ద్వారా చెఱకు పంట నేలలోని తేమను నిలుపుకొని కలుపును తగ్గించి,పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది.
డ్రిప్ పద్ధతి ద్వారా నీటి తడులు:

చెఱకును జంట చాళ్ళ పద్దతిలో నాటుకునే డ్రిప్ పద్దతి ద్వారా నీరు అందించిన ఎడల అందించిన నీరు సక్రమంగా వినియోగించబడుతుంది.కరెంటు రాత్రి సమయంలో ఇచ్చినను నీరు అందించే సౌకర్యం కలుగుతుంది.పంటకు నీటి ఎద్దడి సమస్య తగ్గుతుంది.
జీవ తడులు:
నీటి వసతి తక్కువ ఉన్నప్పుడు, డ్రిప్ సౌకర్యం లేనప్పుడు తడి ఇచ్చేటప్పుడు బోదె విడిచి బోదెకు నీరు పెట్టడం ద్వారా పంట బెట్టకు గురికాకుండా మేలైన దిగుబడులను పొందవచ్చును.

రచయిత సమాచారం

ఎన్.వి సరళ శాస్త్రవేత్త డా యం.హేమంత్ కుమార్ .ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి వ్యవసాయ పరిశోధనా స్థానం -పెరుమాళ్ళపల్లె -517505.