Print this page..

నువ్వుల సాగులో తీసుకోవలసిన చీడపీడల యజమాన్యం 

తెలంగాణలో నువ్వుల పంట సుమారుగా 25000-30000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది.
ఈ పంట నూనె గింజ పంటలలో ఎగుమతికి  ఎక్కువగా అవకాశం వున్న పంట అలస్యంగా వేసిన ఖరీఫ్ పంటల తరువాత రెండో పంటగా జనవరి -పిభ్రవరి మాసంలో విత్తుకొని అతి తక్కువ సమయంలో ,తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని అర్జించేందుకు ఉపయోగపడుతుంది.
కాని కొన్ని రకాల చీడపీడలు ఈ వేసవి నువ్వుల పంటను ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కావున రైతు సోదరులు తగిన అటువంటి సస్యరక్షణ చర్యలు  చేపట్టి అధిక దిగుబడి సాధించవచ్చును .              

నువ్వులలో ముఖ్యమైన చీడపీడలు 

రసంపీల్చే పురుగులు

పేనుబంక 

పంట వేసిన 25 రోజుల నుండి పంటకి ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. 
పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు ముడుచుకొని పాలిపోతాయి.
ఉదృతి ఎక్కువగా ఉన్నపుడు ఈ పురుగులు ఆశించిన ఆకుల నుండి తేనెలాంటి జిగురు పదార్ధం విడుదల కావడం వల్ల ఈ పరిసరాల్లో చీమలు చేరడం గమనించవచ్చు . 

నివారణ: కిలో విత్తనానికి 5 గ్రా ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ది చేసుకోవాలి . ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా ఎసిపేట్ 1  గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

తామరపురుగు,పచ్చదోమ 

పిల్ల,తల్లి పురుగులు ఆకుల అడుగు భాగన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చి వేస్తాయి
,పురుగులు ఆశించిన ఆకుల ముందుగా పాలిపోయి ,తర్వాత దశలో ఎండిపోతాయి, తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు  పోడవుగా సాగి క్రింది వైపుకు ముడుచుకొనిపోయి దోనె ఆకారంగా మారి పాలిపోతాయి.   

నివారణ :మోనొక్రోటోఫాస్ 1.6 మి .లీ లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మి.లీ లీటరు నిటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుముడత మరియు కాయ తొలుచు పురుగు

తొలి దశలో చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు కట్టి లోపలి నుండి ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గోకి తినుట వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొధి ఎక్కువ ఆకులు తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను కాయల్లోని లేతగింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి.

నివారణ:మొనోక్రోటొఫొస్  1.6 మి.లీ లేదా క్లొరిపైరిఫొస్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి .   

తెగుళ్ళు

వేరుకుళ్ళు ,కాండంకుళ్ళు తెగులు

కాండం మీద నల్లని చార లేర్పడుతాయి .వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తయి. వేర్లు పుర్తిగా లేద పాక్షికంగా కుళ్ళిపోతాయి .ఎండుతెగులు సోకిన కాండం మీద కాయల మీద గులాబిరంగు శిలింధ్ర బీజాల సముదాయం కనిపిస్తుంది .తెగులు కలిగించే   శిలింధ్రం భుమిలోను, విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది .
 పంట మార్పిడి తప్పకుండా చేయాలి . కిలొ విత్తనానికి 3 గ్రా.కాప్టాన్ లేదా కర్బండాజిం కలిపి విత్తన  శుద్ది చేసుకోవాలి .కాపర్ ఆక్సిక్లోరైడె లేద మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవలి .

ఆకుమచ్చ తెగులు

మొక్క ఎదిగే దశలో గాలిలో తేమశాతం ఆధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది ఆకులపై, కాండము మీద గోదుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి.
 ముదురు గోధుమ రంగు కలిగినటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపొతాయి .
కిలో విత్తనాలకు 3 గ్రా కార్బండజిం కలిపి విత్థన శుద్ది చేసుకోవాలి, పంట దశలోకార్బండాజిం 1 గ్రా లేక మాంకోజెబ్ 2.5 గ్రా లిటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలొ 2-3 సార్లు పిచికరి చేసుకోవాలి .

వెర్రి తెగులు (ఫిల్లోడి)

ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగ వస్తుంది .
తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలాన్ని ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు .
మొక్కల ఎదుగుదల తగ్గి పై భగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉంది వెర్రి తల మాదిరిగా ఉంటుంది. 
తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగల బెట్టలి పైరుపై మిథైల్ డెమేటన్  2 మీ .లీ లేదా డైమిథోమేట్ 2 మీ.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి దీపపు పురుగులను అరికట్టాలి. 

బూడిద తెగులు

లేత ఆకుల పై తెల్లని బూడిద పది మచ్చలు ఏర్పడతాయి ,తెగులు ఆశించిన ఆకులు రాలిపోతాయి .
నీటీలో కరిగే గంధకపు పొడి 3 గ్రా. లీటరు నీటిలో  కలిపి పిచికారి చేసుకోవాలి. 

రచయిత సమాచారం

యం.రజేంద్ర ప్రసాద్, శాస్త్రవేత్త (ప్లాంట్ ఫాథాలజి)  బి.మాధవి(సేద్య విభాగ శాస్త్రవేత్త) బి.రాజు(మృత్తిక శాస్త్రవేత్త )  యస్ ఓం ప్రకాష్ (కిటక విభాగ శాస్త్రవేత్త )  యన్ నవత (సేద్య విభాగ శాస్త్రవేత్త)  పద్మజ (జన్యు శాస్త్ర విభాగం )  ఆర్ ఉమా రెడ్డి (సహ పరిశోధక సంచాలకులు)    ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, జగిత్యాల