Print this page..

ఎరువుల సద్వినియోగానికి సూత్రాలు

భారత దేశ వ్యవసాయంలో కొన్ని ఆదునిక పద్దతులు సంతరించుకున్నది.కృత్రిమ  వనరులైన ఎరువులు,క్రిమిసం హారక  మందుల వాడకం తప్పనిసరి అయింది .ఇటువంటి సమయంలో అధిక ధరలు పెట్టి కొని వాడుతున్న ఎరువులను సక్రమంగా ఉపయోగించుకోవాలంటే రైతులు ఆచరించాల్సిన పద్దతులు.
భూసార పరీక్ష 
రైతులు భూసార పరీక్ష తప్పనిసరిగా చేయించాలి.ఎందుకంటే రసాయన ఎరువుల సక్రమ వినియోగానికి మరియు పోషకాల సమతుల్యతకు భూసార పరీక్ష తప్పనిసరి.అంతేకాక నేల ఆరోగ్య పరిరక్షణలో భూసార పరీక్ష మొదటిమెట్టు.నేల సారాన్ని తెలుసుకొని ఏ పంటకు ఎంత ఎరువు వేయాలో ,ఎలా వేయాలో అని తెలుసుకోవడంతోపాటు నేల సమస్యలను తెలుసుకొని సవరణ పద్దతులు చేపట్టడమే భూసార పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం.
రైతులు తమ పొలంలోని మట్టిని కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలకొకసారి పరీక్ష చేయించుకొని పోషక అవసరాలు తీర్చినట్లైతే ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చు తగ్గించుకోవడంతోపాటు నేలను రసాయనాల బారి నుండి కాపాడుకోగలము.
సేంద్రీయ ఎరువుల వినియోగం- సమగ్ర పోషక యాజమాన్యం
రసాయనిక ఎరువుల వాడకం వలన పంటల దిగుబడిలో గణనీయమైన పెరుగుదలను గమనించిన రైతులు వాటిని విరివిగా వాడుతున్నారు.అదే సమయంలో సేంద్రీయ ఎరువుల వాడకం గణనీయంగా తగ్గింది.రసాయనిక ఎరువుల వాడకం అధికమవ్వడం వలన సూక్ష్మజీవుల సంఖ్య భూమిలో తగ్గిపోయి భూమి నిస్సారవంతంగా మారిపోతుంది కావున సమగ్ర యాజమాన్యం పాటంచి భూసారాన్ని పెంచుకోవాలి.ఇందులో భాగంగా సేంద్రియ ఎరువులు,జీవన ఎరువులు మొదలైనవి రసాయన ఎరువులతో కలిపి వేయాలి.నేలకు సేంద్రియ పదార్ధం జీవం వంటిది.నేలఓ వున్నటువంటి జీవరాశుల్ని తమ మనుగడకు సేంద్రియ పదార్ధంపై అధారపడతాయి.
సేంద్రీయ పదార్ధం పోషకాల భాండాగారం .సేద్రీయ పదార్ధం లో మొక్కకు కావాలసిన ఉంటాయి.అంతేకాక భూ భౌతిక ,జీవ రసాయనిక లక్షణాలు మెరుగుపడడంలో ముఖ్య పాత్ర వహించి వేసిన రసాయనిక ఎరువుల వినియోగ సామర్ధ్యం మెరుగుపడేలా చేస్తుంది.
ఎరువుల సద్వినియోగానికి ఇతర ముఖ్య పద్దతులు
లోతు దుక్కివలన నేల గుళ్ళ బారి తేమను బాగా నిల్వ ఉంచుకొని వేసిన ఎరువులను ఎక్కువ శాతం తీసుకునే అవకాశం ఉంది.
ఎరువు వేసేటప్పుడు కలుపును నిర్మూలించుకోవటం  ఎంతో అవసరం.అంతేకాక పొలంలో తగిమంత తేమ ఉన్నప్పుడే ఎరువులు వేసుకోవాలి .
సమస్యాత్మక భూములలో ముందుగా సమస్యను సరిదిద్దుకొని తర్వాత ఎరువులు వేస్కున్నట్లైతే ఎరువుల వినియోగ సామర్ధ్యం మెరుగుపడుతుంది.
అన్నీ పోషకాలలో నత్రజని పోషకం వృదా ఎక్కువ ఉంటుంది.కాబట్టి యూరియాను వేపపిండితో కలిపిగాని యూరియా ఎరువు పలకలపై వేపనూనే కలుపుకొని  వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలై వృదా తగ్గుతుంది.
అదేవిదంగా కోల్ తార్ తో కలుపుకొని యూరియాను ఉపయోగించుకున్నట్లైతే మంచి ఫలితాలు ఉంటాయి.ఒక కిలో కోల్ తార్ ను రెండు లీటర్ల కిరోసిన్ కలుపుకొని దానిని రెండు బస్తాల యూరియాను పట్టించుకొని వాడుకున్నట్లైతే మంచి ఫలితాలు ఉంటాయి.
అర బస్తా యూరియాను ఒక బస్తా తడి,పొడి మట్టితో కలిపి 24గంటలు నీడలో ఉంచి తర్వాత నేలకు అందించినట్లైతే వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది.
సిఫార్సు మేరకు ఎరువులు వాడటం ఎంత ముఖ్యమో సరైన పద్దతిలో వేయడం కూడా అంతే ముఖ్యం.
వెదజల్లే పద్దతి 
మొక్కలు పొలం నిండా దగ్గర దగ్గరగా ఉండి వరుసలలో సక్రమగా లేని మొక్కలకు వేళ్ళు భూమిలో అళ్ళుకొని ఉండే పైర్లకు ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది .
మొక్క మొదళ్ళ దగ్గర ఎరువులు వేయడం
ఈ పద్దతి ద్వారా ఎరువు వేయడం వల్ల పోషక వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది.వృదా చాలా వరకు తగ్గుతుంది.నిర్ణీత వరుసలలో మొక్కలు ఉన్నప్పుడు గొర్రుతో కానీ గుంటుకతో కానీ చేతితో కానీ నేలలో తగినంత తేమ ఉన్నఫ్ఫుడు రెండు అంగుళాలు లోతుగా పడేటట్లుగా మొక్కల మొదళ్ళ దగ్గ్ర ఎరువులు వేయాలి.
చేతితో చిన్న చిన్న గుంతలు తీసి వేసుకునేటప్పుడు ఎరువు వేసిన వెంటనే గుంతలు మట్టితో కప్పివేయాలి.
వరుసలలో వేయడం
మొక్క మొక్కకు దూరం తక్కువైనఫ్పుడు వరుసలలో ఒక పక్క గానీ రెండు పక్కల గానీ నాగలితో చాలు తీసి ఎరువు వేసుకోవచ్చు.ఆరుతడి పంటలకు ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఈ పద్దతిలో ఎరువు వేయవచ్చును.
పైరుపై పోషకాల పిచికారి
ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు సమస్యాత్మక నేలల్లో పోషకాలు అందించడానికి మరియు పోషక లొపం కనిపించిన పైర్లలో ఈ పద్దతి ద్వారా పోషకాలు అందించవచ్చును.సాదారణంగా యూరియా 2శాతం మూరేట్ ఆఫ్ పొటాష్ 2.5శాతం ,పొటాషియం నైట్రేట్ 1శాతం,జింక్ సల్ఫేట్ 0.2శాతం మరియు ఫెర్రస్ సల్ఫేట్ 0.2శాతం ధ్రావణాన్ని పిచ్బికారి చేయాలి.

రచయిత సమాచారం

ఎన్.నవత సేధ్య విభాగ శాస్త్రవేత్త,డి.ఎ రజనీదేవి,(ఆర్ధిక శాస్త్రవేత్త)బి.రాజు(మృత్తిక శాస్త్రవేత్త) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం,పొలాస -జగిత్యాల.