Print this page..

రాగి పంటలో అధిక దిగుబడికి యాజమాన్య పద్ధతులు

రాగిలో అధిక కాల్షియం,ఇతర పోషక  విలువలను గుర్తించి రైతులు చిరుధాన్యాలలో రాగిని ముఖ్యపంటగా సాగుచేస్తున్నారు.
నేలలు:ఇసుక,బరువు నేలలు
విత్తన మోతాదు:నారుమడికి-2కిలోల్,వెదజల్లడానికి-4కిలోలు
విత్తన శుద్ధి:1కేజి విత్తనానికి -2గ్రా కార్బండజిం లేదా 3గ్రా కాప్టాన్
ఎరువులు, పొలం తయారి:2-4 టన్నుల పశువుల ఎరువు.
12కిలోల భాస్వరం,8కిలోల పొటాషియం,2కిలోల సూపర్ ఫాస్ఫేట్.
విత్తడం:
మట్టిలో పలచగా క లిసేలా కలపాలి.4-5రోజులకు నీటితడులివ్వాలి.వెదజల్లే పద్దతిలో పొలాన్ని సమానంగా కర్రతో ,బల్లతో గాని తయారుచేయాలి.
నాట్లు వేయడం:
స్వల్పకాలిక రకాలకు (85-90రోజులు)21రోజుల వయస్సు గల  నారును వరుసల మధ్య 30సెం.మీ,వరుసలలో 10సెం.మీ దూరంగా నాటాలి. 
ధీర్ఘ కాలిక రకాలకు (105-125)30రోజులు -నారు  వరుసల మధ్య -30సెం.మీ ,వరుసల్లో -10సెం.మీ నాట్ల సమయంలో 12కిలోల నత్రజని నిచ్చు ఎరువులు వేసుకోవాలి.25రోజుల తర్వాత కలుపు తీసి మరళ 12కిలోల నత్రజని ఎరువులు వేసుకోవాలి.
కలుపు నివారణ:
నారు నాటటానికి ముందు:పెండిమిథాలిన్ (30%) -600మి.లీ 200లీటర్ల నీటికి లేదా 3మి.లీ ఒక లీటరు నీటికి 
వెడల్పాకు కలుపుకు -2,4 డి సోడియం సాల్ట్(80%)-2గ్రా ఒక లీటర్ నీటికి  కలిపి పిచికారి చేయలి.
నీటి యాజమాన్యం
వేర్లు తొడిగేదాక ,నాటిన 5-7 రోజుల వరకు నీరు పెట్టరాదు.
చిరుపొట్ట, పూతా,గింజ కట్టే దశలు ముఖ్యం.
అంతర పొంటలు
రాగి-కంది=8:2
రాగి-చిక్కుడు=8:1.
సస్యరక్షణ 
అగ్గితెగులు:
నారుమడి ఎండిపోతుంది.నలుపు రంగు మచ్చలు మెడవిరుపులో ఆశించును.గింజలు తాలుగా మారుతాయి.అధిక నత్రజనికి ఈ తెగులు ఎక్కువగా ఆశించును.
నివారణ:
తెగులు తట్టుకునే శ్రీ చైతన్య ,సప్తగిరి,గోధావరి,రత్నగిరి రకాలను వాడాలి. ఒక కిలో విత్తనానికి 3గ్రా థైరం లేదా కాప్టాన్ తో విత్తన శుద్ది చేయాలి.
మొక్కలపై మచ్చలు ఏర్పడితే -1గ్రా కార్బండజిం/1లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఆకుమాడు తెగులు:
వేర్ల మొదళ్ళు కుళ్ళి చనిపోతాయి.ఆకులపై అండాకార గోదుమరంగు మచ్చలు ఏర్పడును.కంకుల మొదళ్ళు గోదుమ రంగుకు మారి రాలిపోతాయి.
నివారణ:
3గ్రా థైరం లేదా కాప్టాన్ తో విత్తన శుద్ది చేయాలి.
2.5గ్రా మాంకోజెబ్ 1లీటరు నీటిలో క్జలిపి పిచికారి చేయాలి.
వెర్రి తలబూజు:
మొక్కలు గిడసబారి గుబురుగా కనిపిస్తాయి.
కంకుల్లో గింజలు ఏర్పడకుండా ఆకుపచ్చని ఆకుల సముదాయాలుగా మారుతాయి.
నివారణ:
అవశేషాలు నాశనం చేయాలి.
3గ్రా.థైరం/కాప్తాన్/మెటలాక్సిల్ ఒక కిలో విత్తనానికి విత్తనశుద్ది చెయాలి.
పురుగులు
గులాబి రంగు పురుగు:
కాండాన్ని తొలిచి సొరంగాలు చేసి మొవ్వును నాశణం చేస్తుంది.
వెన్నులు తెల్లకంకులుగా మారును.
నివారణ:
2.5మి.లీ క్లోరిఫైరిఫాస్ పిచికారి చేయాలి 
శనగ పచ్చ పురుగు:
కంకి దశలో ఆశించి పూత,గింజలను నష్టపరుస్తాయి.
కార్బరిల్-3గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఎకరానికి 8 కిలోల మెలాథియాన్ 5% పొడి మందును కంకులపై చల్లుకోవాలి.
పేనుబంక:
కంకుల నుంచి రసం పీలుస్తాయి.
పైరు చిన్న దశలో ఆశిస్తే కంకులు రాక ,గింజలు సరిగ్గా పట్టవు.
నివారణ:
డైమిథోయేట్ -2మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ -1.5మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
గింజ గోధుమ రంగుకు రాగానే పంత కోయాలి.
కోసిన కంకులు ఒక రాత్రంతా పోగుచేసి కప్పాలి.
ఎండిన తర్వాత .పశువులు లేదా ట్రాక్టరుతో నూర్పించాలి.
జీవన ఎరువుల వాడకం:
విత్తనాలకు అజోస్పైరిల్లం విత్తడం ద్వారా నత్రజని ఎరువుల వాడకం తగ్గించి అధిక దిగుబడులు పొందవచ్చును.
రకాలు:
1.గోధావరి -ఈ రకం ఖరీఫ్ మరియు రబీ లో పండించవచ్చును. ,120-125 రోజుల పంత,ఎకరానికి 12-16 క్వింటళ్ళ దిగుబడి.అన్నీ ఋతువులకు అనుకూలం.
2.శ్రీ చైతన్య -ఈ రకం ఖరీఫ్  లో పండించవచ్చును. ,110-115 రోజుల పంట ,ఎకరానికి 12-16 క్వింటళ్ళ దిగుబడి.అగ్గితెగులును తట్టుకొనును.
3.రత్నగిరి-ఈ రకం ఖరీఫ్ మరియు రబీ లో పండించవచ్చును. ,100-105 రోజుల పంట ,ఎకరానికి 12-16 క్వింటళ్ళ దిగుబడి.బెట్టను తట్టుకొనును.
4.మారుతి-ఈ రకం ఖరీఫ్ మరియు వేసవి లో పండించవచ్చును. ,85-90 రోజుల పంట ,ఎకరానికి 10-12 తెగులును అన్నీ దశలలో తట్టుకుంటుంది.
5.సప్తగిరి-ఈ రకం ఖరీఫ్ మరియు రబీ లో పండించవచ్చును. ,110-115 రోజుల పంట ,ఎకరానికి 12-16 క్వింటళ్ళ దిగుబడి.రాయలసీమకు అనుకూలం .అగ్గితెగులు తట్టుకొనును.
6.హిమ-ఈ రకం  రబీ లో పండించవచ్చును. ,110-115 రోజుల పంట ,ఎకరానికి 10-12 క్వింటళ్ళ దిగుబడి.రాయలసీమకు అనుకూలం .తెల్ల కంకి మరియు అగ్గితెగులు తట్టుకొనును.

రచయిత సమాచారం

డా.శశిభూషన్,డా సి.వి సమీర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిధ్యాలయం