Print this page..

జొన్న పైరు పెరిగే దశలో కలుపు నివారణకు కలుపు మందులు

జొన్న పైరులో విత్తిన 45 రోజుల వరకు కలుపు వలన సమస్య ఉంటుంది.విత్తిన 45 రోజులకు పైరు పెరిగి సాళ్ళమధ్య దూరం పూర్తిగా పైరుతో కమ్ముకుంటుంది కాబట్టి  ఆ తర్వాత జొన్న పైరుకు కలుపువలన సమస్య ఉండదు.
జొన్నలో విత్తిన 20-30 రోజులకు చెంచలాకు,గలిజేరు చిట్టి చామంతి,వయ్యారి భామ ,చిలక తోటకూర ,నానబాలు,అటిక మామిడి ,గునుగు,లింగ మిరియాలు,ఆమడ కామ,వామంట వంటి వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటాయి.ఈ వెడల్పాకు కలుపు నివారణకు 2,4డి సోడియం సాల్టు 80శాతం (పెర్నాక్సోన్,సాలిక్స్ వంటివి) ఎకరానికి 400 గ్రాములు (లేకా) 2,4డి అమోనియం సాల్టు (వీడ్ మార్ సూపర్,డ్యూర వంటివి)ఎకరానికి 400మి.లీ పిచికారి చేసి నివారించవచ్చును.ఈ మందులు వెడల్పాకు కలుపును నివారించడంతో పాటుగా ,జొన్నలో పెరిగే తుంగ కలుపు మొక్కలు పెరగకుండా ఆపుతాయి.
జొన్నలో పెరిగే గరిక ,ఊద .ఉద్రంకి ,చిప్పెర,పుల్ల విరుపు  వంటి కలుపును ఈ కలుపు మందులు నివారించలేవు.జొన్న పైరు పెరిగే దశలో ఆశించే గడ్డి జాతికి చెందిన కలుపును నివారించడానికి ప్రస్థుతం ఎటువంటి కలుపుమందులు అందుబాటులో లేవు.

రచయిత సమాచారం

ఈదర వెంకటేశ్వర్లు శాస్త్రవేత్త (సేధ్యశాస్త్రం) ఏరువాక,లాంఫారం -గుంటూరు 9849865759.