Print this page..

పౌష్టికాహార సంజీవని - పౌల్ట్రీ రంగం

పౌల్ట్రీ ఇండియా 2019 ఎగ్జిబిషన్‌, విజ్ఞాన సదస్సు నవంబర్‌ 27-29 తేదీలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో జరగనున్నది. ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ రంగానికి సంబందించిన బ్రాయిలర్‌, లేయర్‌, సామాగ్రి సరఫరా కంపెనీలు పెద్ద ఎత్తున దీనిలో పాల్గొననున్నాయి. గత దశాబ్ద కాలంగా చరిత్రాత్మకంగా నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఎగ్జిబిషన్‌ ఈ సారి మరింత శోభాయమానంగా, ఉభయ తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్నాటక రైతులకు విజ్ఞాన వేదికగా దీనిని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగాను, మన దేశంలోను, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను ఉన్న కోళ్ళ పెంపకందారులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు భయంకరమైన వైరస్‌లనుండి కోళ్ళను కాపాడే, పరిశ్రమను రక్షించే కార్యకలాపాలపై చర్చ జరగనున్నది. ఈ సందర్భంగా 'అగ్రిక్లినిక్‌' మాసపత్రిక పరిశ్రమ తీరుతెన్నులపై ఒక ప్రత్యేక వ్యాసాన్ని పాఠకుల ముందు ఉంచుతున్నది.

భారతదేశంలో పౌల్ట్రీ పరిశ్రమ  రైతుల స్వయంక షితో ఇంతింతై, వటుడింతై, దిన దిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్నది. రైతులే శాస్త్రవేత్తలుగా సజనాత్మక శక్తిగా ఎదిగి ఈ పరిశ్రమను స్వయంకషితో పైకి తీసుకు వచ్చారు. పద్మశ్రీ డాక్టర్‌ బి.వి.రావు లాంటి మహనీయుల కషితో, ఆయన సజించిన పరిజ్ఞానంతో అన్నీ తామై, దేశానికి ఆదాయాన్ని, కోట్లాది మందికి ఉపాధిని కల్పించిన ఏకైక వ్యవసాయ అనుబంధ పరిశ్రమ కోళ్ల పరిశ్రమ. 

ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాలలో10-12% సగటు వద్ధి రేటుతో పురోగమనంలో ఉంది. దేశంలో 70 వేల కోట్ల రూపాయలను, తెలంగాణ రాష్ట్రంలో 20 వేల కోట్ల రూపాయల ఆదాయ స్థాయికి కోళ్ల పరిశ్రమ చేరింది. పోషకాహార లోపం తీవ్రంగా ఉన్న మనదేశంలో బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, పిల్లల పౌష్టికాహార భద్రత కొరకు మాంసం, గుడ్ల ఉత్పత్తి ద్వారా, దానితోపాటు పొలాలకు విలువైన ఎరువులను సమకూరుస్తూ, గ్రామీణ అభివద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తున్నది. అప్పటి వరకు కేవలం స్వయంకషితోనే అభివృద్ది చెందుతున్న ఈ రంగం 1960 నుండి కొత్తపుంతలు తొక్కి జాతీయ, అంతర్జాతీయ జాతీయ స్థాయిలో అభివృద్దికి కృషి సారించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న వైట్‌ లెగ్‌ హార్న్‌, రోడ్‌ ఐలాండ్‌ రెడ్‌ అనే సంకరజాతి రకాలను వెలుగులోకి తీసుకు రావడంతో మన దేశం కూడా కోళ్ల పెంపకంలో ఆ దారిన వెళ్లి గణనీయమైన అభివద్ధికి పునాదులు వేసుకుంది. అంతకు ముందు కేవలం పెరటి కోళ్ల పెంపకం ద్వారా ప్రారంభమైన  ఈ పరిశ్రమ ప్రభుత్వ,  ప్రైవేటు సంస్థల సహకారంతో, వారి భాగస్వామ్యంతో అద్భుతమైన ప్రగతిని సాధించింది. కోళ్ల పరిశ్రమ అభివద్ధిలో నాబార్డ్‌, బ్యాంకులు, గ్రామీణ అభివద్ధికి క షి చేసే డి.ఆర్‌.డి.ఎ లాంటి సంస్థలు వివిధ పథకాల కింద రుణాలు, సబ్సిడీలు అందిస్తూ కోళ్ల పరిశ్రమ అభివద్ధిలో తమవంతు కషి చేసి దీని ఉన్నతికి కారకులయ్యారు.

గత కొన్ని సంవత్సరాలుగా మాంసం, గుడ్ల రేట్లు ఆశాజనకంగా ఉండడంతో లేయర్‌, బ్రాయిలర్‌ పరిశ్రమలలో ఎన్నో రెట్ల వద్ధి నమోదైంది.  వ్యవసాయం క్లిష్టమై, రైతుల బ్రతుకు భారమై మిగిలిన పంటలు గిట్టుబాటు ధర లేక, ఆధునిక సాగుకు చిన్న వ్యవసాయ క్షేత్రాలు అనుకూలంగా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితినీ మనం చూస్తున్నాము. ప్రాచీన కాలం నుండి, కోళ్ల పెంపకం రైతుకు అదనపు ఆదరువుగా నిలుస్తూ వెన్నెముకగా నిలిచిన నేపథ్యంలో, ఇది పరిశ్రమగా నిలదొక్కుకొని, జాతీయ ఆదాయం పెంపుతో పాటు రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తూ వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడంలో బహత్తరమైన పాత్ర వహిస్తున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకున్నది. ప్రభుత్వానికి ప్రతి ఏటా చెల్లించే నాలా చార్జీలను రద్దు చేయడంతోపాటు, కోడి మాంసం, గుడ్లపై వసూలు చేస్తున్న సెస్సు ఎత్తివేయడం, కోళ్ల పరిశ్రమకు సరఫరా చేస్తున్న విద్యుత్‌ ధరను సగానికి తగ్గించడం మొదలగు చర్యలన్నీ తెలంగాణ రాష్ట్రంలో కోళ్ళ పరిశ్రమ అభివద్ధికి తోడ్పడుతున్నాయి.

ప్రపంచంలోనూ, దేశంలోనూ, మన తెలుగు రాష్ట్రాల్లోనూ కోళ్ల పెంపకం దారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఆశించడానికి, శాస్త్రీయ పరమైన మెళుకువలను ఆచరించాలి. గుడ్ల ఉత్పత్తి వ్యయం తగ్గించు కోవడం, బర్డ్‌ఫ్లూ, నిఫా లాంటి ప్రమాదకరమైన వ్యాధులను జీవ నియంత్రణ పద్ధతులను ఆచరిస్తూ నివారించుకోవడం జరగాలి. ఆధునిక పరికరాలు వాడుతూ సమయం, శ్రమ, కూలీల వ్యయం తగ్గించుకోవడం మొదలగు విషయాల్లో శ్రద్ధ చూపించాలి. బ్రాయిలర్‌, లేయర్‌ కోళ్ల పెంపకం విధానాలు, ఆహారం, వ్యాధుల నివారణ, ఆధునిక యంత్రాలు, వ్యవస్థలు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఈ కోళ్ల పరిశ్రమ భారతీయ జీవన విధానానికి మూల స్తంభంగా నిలబడి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు రైతుల, పరిశ్రమ ప్రగతి బాటకు ప్రాతిపదిక కావాలి. నవంబర్‌ 27 నుండి 29 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే ప్రపంచ స్థాయి, విజ్ఞాన సదస్సు జయప్రదం కావాలని కోరుతూ పరిశ్రమ అభివద్ధికి 'అగ్రిక్లినిక్‌' మాసపత్రిక ఈ క్రింద వివరించిన అంశాలతో ముందుకు వస్తున్నది.

దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ - తీరుతెన్నులు :

దేశంలో సుమారు ఐదు వేల సంవత్సరాల నుండి కోళ్ల పరిశ్రమ ప్రాచుర్యంలో ఉంది. పెరటి కోళ్ల పెంపకంతో ప్రారంభమైన కోళ్ల పెంపకం నేడు అనేక దశల అనంతరం ఒక పరిశ్రమ స్థాయికి ఈ నాటికి చేరుకున్నది. 50 ఏళ్ల క్రితమే ఈ రంగాన్ని నిలదొక్కుకున్న పరిశ్రమగా, వర్తమానంలో  ఒక  బహత్తర ఆదాయ, ఉద్యోగ వనరుగా గుర్తించడం జరిగింది. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పెద్దగా లేకుండానే రైతు స్థాయిలో ప్రారంభమైన కోళ్ల పెంపకం నేడు విశ్వజనీనమైన, విశ్వవ్యాప్త పరిశ్రమగా ఎదగడంలో భారత్‌తో పాటు ప్రపంచ రైతుల గొప్ప శ్రమకు, తెలివి తేటలకు, సజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది.  దేశ విమోచన అనంతరం 1959లో  సెంట్రల్‌ పౌల్ట్రీ బ్రీడింగ్‌ ఫోరంకు పునాది పడింది. 1971 సంవత్సరంలో  శ్రీ వెంకటేశ్వర హేచరీస్‌ గ్రూపు స్థాపనతో పౌల్ట్రీ రంగంలో నిజమైన అభివద్ధి ప్రారంభమైంది. ఆ తరువాత పౌల్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఐ.సి.ఎ.ఆర్‌ కషి ప్రముఖంగా పేర్కొనవచ్చు. శ్రీ వేంకటేశ్వర హేచరీస్‌ సంస్థ డాక్టర్‌ బి.వి.రావు ఆధ్వర్యంలో భారతీయ పౌల్ట్రీ పరిశ్రమకు చుక్కానిలా మార్గదర్శకత్వం వహించింది. దీని అధినేత డాక్టర్‌ బి.వి.రావు పౌల్ట్రీ రంగ పితామహుడు అయ్యారు. భారత ప్రభుత్వం ఆయన సేవలకు మెచ్చి పద్మశ్రీ బిరుదాంకితుడను చేసింది.

ఎన్నో కష్ట, నష్టాలకోర్చి రేయనకా, పగలనకా కష్టపడి దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న వ్యవసాయం ఇంతా చేసి ప్రతి ఏటా సగటున 2% వద్ధి మాత్రమే సాధిస్తూ ఉండగా, కోళ్ల పరిశ్రమ మాత్రం 12% వద్ధిని నమోదు చేసుకోవడం విశేషం. సాలీనా ఒక్క బ్రాయిలర్‌ పరిశ్రమలోనే  10% వద్ధి రేటు నమోదు కావడం జరుగుతున్నది. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం అభివద్ధి 70 వేల కోట్ల స్థాయికి చేరడం సంచలనం సష్టిస్తున్నది. గ్రుడ్ల ఉత్పత్తిలో మన దేశం నాలుగవ స్థానంలో ఉండగా, మాంసం ఉత్పత్తిలో ఐదవ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మొత్తం కోళ్ల పరిశ్రమలో మనం 17వ స్థానంలో ఉండడం గర్వకారణం.

మన దేశంలో పౌల్ట్రీ పురోగతి - దోహదపడే అంశాలు :

ప్రభుత్వ ప్రోత్సాహం, ఎటువంటి విస్తరణ వ్యవస్థ లేని పౌల్ట్రీ రంగం అభివద్ధికి, ఆకాశమే హద్దుగా దూసుకొని పోవడానికి కారణాలను అనేకంగా పేర్కొనవచ్చు. పురోగమనపథంలో ఆలోచించే రైతుల ముందుచూపు, పద్మశ్రీ డాక్టర్‌ బి.వి. రావు లాంటి మహనీయుల సేవలు, వినూత్నమైన అనుభవాలు, రైతుల, శాస్త్రవేత్తల కషి ఈ రంగంలో అనితరసాధ్యమైన ప్రగతికి దోహదపడినాయి. వీటితోపాటు మరికొన్ని వివరాలను ఇక్కడ క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాము. అవి.

 • దేశ ఆహార భద్రతకు కావలసిన మాంసము, గుడ్ల ఉత్పాదనలు, వాటి ప్రామాణికత, మిగిలిన ఆహారాలకు ప్రత్యామ్నాయంగా నిలిచి దేశ వినియోగదారుల మార్కెట్‌లో పరిశ్రమపై విశ్వసనీయత పెంచుకోవడం.
 • ఏ పంట, ఉత్పాదనకైనా మూలవిరాట్టు విత్తనమే. కోళ్ల పెరుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, మూలమైనది శోధన మాత్రమే. అటువంటి బ్రీడ్‌లను తయారుచేసి శ్రేష్టమైన వాటిని అందుబాటులో ఉంచడం ఈ పరిశ్రమ ఘనవిజయ రహస్యం.
 • పంటలకైనా, పశుపక్షాదులకైనా ఎదుగుదలకు ప్రధానంగా కావలసింది పోషకాలు. కోళ్లకు కావలసిన  ఆహారాన్ని పెల్లెట్స్‌ రూపంలో అందిస్తున్న ఘనత మన కోళ్ల పరిశ్రమ అధిపతులదే కావడం విశేషం.
 • సున్నితమైన కోళ్ల పెంపకం అనేక వ్యాధులు, వైరస్లను అధిగమించి, దిగుబడులు అధికంగా సాధించుకోవలసిన కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు తగిన వైద్య చికిత్సలు భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచస్థాయి కోళ్ల టీకాలు, మందుల లభ్యత ఉండడంతో అనేక సార్లు విజృంభించిన గన్బోరా లాంటి వైరస్‌ల నుండి విముక్తి లభించింది.
 • స్పెసిఫిక్‌ పాధోజన్‌ ఫ్రీ గుడ్ల ఉత్పత్తి ప్రత్యేకత.
 • కోళ్ల ఫారంలో, హేచరీలలో ఆటోమేషన్‌ సిస్టం అమలు.
 • పరిశ్రమ నిర్వహణలో ఆధునిక సాంకేతికత అమలులో ఉండటం.
 • ఎగ్‌ ప్రాసెసింగ్‌, పౌల్ట్రీ ప్రాసెసింగ్‌ రంగం విస్తరణ.
 • వర్ధమాన పారిశ్రామికవేత్తలకు తగిన సాంకేతిక వనరులు శిక్షణ కార్యక్రమాల అమలు, ప్రైవేటు ప్రభుత్వ రంగాలలో అమలు కావడం మొదలగునవి విజయవంతంగా పౌల్ట్రీ రంగ అభివృద్దికి తోడ్పడినవి. దేశంలోని బాయిలర్‌, లేయర్స్‌లలో 30% మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పౌల్ట్రీ రంగ వ్యాపార విలువ 20 వేల కోట్ల రూపాయలు.

ఏ దేశం అయినా దాని అభివద్ధి సూచిక నిర్ణయించేది పౌష్టికాహార లభ్యత, ఉపాది కల్పన, గ్రామీణ అభివద్ధి అనే అంశాల ఆధారంగానే పరిగణిస్తారు. ఈ మూడు అంశాలు సమానంగా కలిగిన, ప్రాధాన్యమున్నది పౌల్ట్రీ రంగానికి మాత్రమే. కల్తీకి వీలులేని, సులభంగా జీర్ణమై, వినియోగానికి మతపరమైన అవరోధాలు లేని, మాంసకత్తులు అధికంగా కలిగిన కోడి మాంసం ఎన్నో కుటుంబాల పౌష్టికాహార అవసరాన్ని తీర్చుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ, ఆర్థిక రంగ అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతుంది.

ఎఫ్‌.ఎ.ఒ 2010 అంచనా ప్రకారం మొత్తం కోళ్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా-19,570,618,000, చైనా-4,802,720,000, యుఎస్‌ఏ-2,100,000,000, ఇండోనేషియా-1,622,750,000, బ్రెజిల్‌-1,238,910,000, భారతదేశం-773,852,000. ప్రపంచ వ్యాప్తంగా కోడి మాంసం ఉత్పత్తి (టన్నుల్లో)-85,860953, భారతదేశం-2193110, ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తి -63782277, భారతదేశం-3378100

ప్రస్తుత స్థితి గతులు:

 • దేశంలో 27 కోట్ల లేయర్స్‌ నుండి  ప్రతిరోజు 22 కోట్ల గ్రుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.
 • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదికోట్ల లేయర్స్‌ నుండి 7.5 కోట్ల గ్రుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.
 • 50 వేల మంది లేయర్‌ కోళ్ల రైతులు దేశవ్యాప్తంగా ఉన్నారు.
 • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు వేల మంది కోళ్ల రైతులు ఉన్నారు. వీరు ఐదు వేల నుండి ఒక లక్ష 50 వేల లేయర్స్‌ను పెంచుతున్నారు.
 • మనదేశంలో బాయిలర్‌ కోళ్ల రైతులు ఒక కోటి యాభై లక్షల మంది, ఇరు తెలుగు రాష్ట్రాల్లో 20 వేల మంది రైతులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది ఇంటిగ్రేటెడ్‌ సిస్టంలో కోళ్లను పెంచుతున్నారు.
 • ఉమ్మడి రాష్ట్రంలో ప్రతియేటా 30 కోట్ల బ్రాయిలర్‌ల వినియోగం ఉంది. రాష్ట్రంలో బాయిలర్‌  పేరెంట్స్‌ నుండి నెలకు 65 కోట్ల హేచింగ్‌  గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో సగానికిపైగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కోళ్ల ఉత్పత్తికి వినియోగించి, మిగిలిన వాటిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తారు.

కోళ్ల పరిశ్రమ - కొన్ని ముఖ్య గణాంకాలు:

ఐదువేల సంవత్సరాల కింద ప్రారంభమైన కోళ్ల పరిశ్రమ 'ఇంతింతై వటుడింతై' అన్నట్లు క్రమేణా ఒక భారీ పరిశ్రమగా రూపుదిద్దుకున్న నేపద్యంలో  అనేక గణాంకాలు ప్రగతి తీరుతెన్నులను తెలియజేస్తున్నాయి. మన దేశంలో1950-1951 సంవత్సరంలో1832 మిలియన్ల గుడ్ల ఉత్పత్తి జరిగింది. 2010-2011 సంవత్సరానికి 63,024 మిలియన్లకు చేరుకుంది. 2020 సంవత్సరం కల్లా గుడ్ల ఉత్పత్తి 101,800 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే గుడ్లలో 65% గుడ్లు 15 దేశాలలో ఉత్పత్తి అవుతున్నాయి. చైనా, అమెరికా, భారత్‌, జపాన్‌, మెక్సికో, రష్యా, ఇండోనేషియా, ఫ్రాన్స్‌, ఉక్రెయిన్‌, టర్కీ ,స్పెయిన్‌, ఇరాన్‌, ఇటలీ, జర్మనీ దేశాలలో గుడ్ల దిగుబడి అధికంగా ఉంటూ వస్తున్నది. గుడ్ల సగటు వద్ధి రేటు ఏడాదికి 5-8% నమోదవుతున్నది. భారతదేశంలో ప్రతిరోజు గుడ్ల ఉత్పత్తి 22 కోట్లుగా ఉంది. ప్రపంచంలోనే మన దేశంలో గుడ్ల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది. దేశంలోని రైతులు, పౌల్ట్రీ కంపెనీలు, శాస్త్రవేత్తల కషి వలన గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం రోజురోజుకు పెరుగుతున్నది. 1970 నుండి ఇప్పటివరకు ఉత్పత్తి సామర్థ్యం 220 నుండి 330కి పెరగడం గమనార్హం. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్ర నుండి ఉత్పత్తి అవుతున్న గుడ్ల సంఖ్య ప్రపంచంలోనే గుడ్ల ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో ఉండడం విశేషం.

దేశం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే గుడ్లలో70% ఉత్పత్తి ఈ నాలుగు రాష్ట్రాల నుండి జరుగుతున్నది. 2012-2013 సంవత్సరాలలో తమిళనాడులో అత్యధిక గుడ్ల ఉత్పత్తి ఉండగా 2011-2012లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌, వైజాగ్‌, చిత్తూరు జిల్లాలో గుడ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. దేశంలో సగటున రోజువారి ఉత్పత్తి అయ్యే 17.50 కోట్ల గుడ్లలో, మూడవ వంతు ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోళ్ల ఫారాల నుండి వచ్చే వ్యర్థాలు వ్యవసాయ పంటలకు ఆదరువుగా నిలుస్తున్నాయి. పంటల్లో దిగుబడులు పెంచేందుకు కోళ్ల ఎరువులను విరివిగా వినియోగిస్తున్నారు. మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యే ఎరువులలో10% కోడి ఎరువే. ఎరువుల వినియోగం వల్ల రసాయనిక పదార్థాల వినియోగం తగ్గి ప్రభుత్వం ఇచ్చే 20 వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఆదా అవుతుంది.

 కోడి మాంసం - ఆసక్తికర గణాంకాలు :

బ్రాయిలర్‌ కోళ్ల మాంసం ఉత్పత్తిలో 15 దేశాలు ముందంజలో ఉన్నాయి. అమెరికా, చైనా ముందు వరుసలోను, బ్రెజిల్‌, ఇండియా, మెక్సికో, యూరప్‌ తరువాత స్థానాల్లోనూ ప్రాధాన్యత వహిస్తున్నాయి. రష్యా, అర్జెంటినా, టర్కీ, థాయిలాండ్‌, ఇండోనేషియా, సౌత్‌ ఆఫ్రికా, జపాన్‌, కొలంబియా, కెనడా దేశాలలో కోడి మాంసం విరివిగా ఉత్పత్తి అవుతున్నది. మన దేశంలోని పరిశ్రమలలో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. మొత్తం ఉత్పత్తిలో 70% బ్రాయిలర్‌ మాంసం ఉత్పత్తి ఈ నాలుగు రాష్ట్రాల్లోనే జరుగుతున్నది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కోడిమాంసం విలువ - 12,23,00,942 వేల డాలర్ల విలువ ఉంది. 2010లో 4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఉన్నబ్రాయిలర్‌ మాంసం ఉత్పత్తి 2020 సంవత్సరాలకు 8.6 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెరుగుతుంది అని అంచనా.

కోడి మాంసం, కోడిగుడ్ల ఉత్పతి - వినియోగం సరళి :

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి డొక్కల కరువు, ఆకలి కేకలతో దేశ ప్రజలు వేలాది సంఖ్యలో చనిపోయే స్థితిలోకి వచ్చారు. ముఖ్యంగా బెంగాల్‌ లో ఏర్పడిన క్షామ పరిస్థితులు దక్షిణాది వరకు విస్తరించి ప్రజలను భయంకరమైన చావులకు గురిచేసింది. స్వాతంత్య్రానంతరం కరువు వలన ఆ దేశ ప్రజలు సుఖశాంతులతో మన లేరని, మనుగడ సాగించడం కష్టం. ఇతర దేశాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు హేళన చేస్తున్న సమయంలో మొదటి సస్య విప్లవానికి మన జాతీయ ప్రభుత్వం బాటలు వేసింది. ముఖ్యంగా బియ్యం, గోధుమలు వంటి ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోయి సంక్షోభ స్థితిలో ఉన్నా దేశ ప్రజలకు అసలు ఆహారమే లభించని స్థితిలో పౌష్టికాహారం గురించి ఆలోచించే సమయం లేదు. మొదటి సస్యవిప్లవం ద్వారా చాలినన్ని ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి త్వరలోనే మన దేశ ఆహార భద్రతకు ఇక్కడి ప్రభుత్వం, రైతులు, శాస్త్రవేత్తలు కషి చేశారు. దాని ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ గౌరవం, ఆత్మగౌరవం సర్వసత్తాక, గణతంత్ర రాజ్య మనుగడకు ప్రాతిపదికను ఏర్పాటు చేసిన నెహ్రూ ప్రభుత్వం ఆ తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి హయాంలో ఇచ్చిన 'జై జవాన్‌ - జై కిసాన్‌' నినాదం రైతులలో, ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ సందర్భంలోనే బాధ్యతాయుత ప్రభుత్వం పోషకాహార అవసరాన్ని గుర్తించి పౌల్ట్రీ రంగం అభివద్ధికి, దేశంలోనే ప్రతి పౌరుడికి పోషకాహార లభ్యత గురించి కషి చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నది. దీని ప్రాతి పదికగానే ఏర్పాటు చేసిన జాతీయ పోషకాహార సంస్థను నియమించింది. దీని నివేదిక ప్రకారం మన దేశంలో సగటు వార్షిక వినియోగం మాంస రంగంలో 11.50 కిలోలు, గుడ్లు 180 ఉండాలి, కానీ 2011-2012లో తలసరి లభ్యత అంతర్జాతీయంగా 280 ఉండగా, మనదేశంలో సంవత్సరానికి 55 మాత్రమే ఉంది.

 కొంచెం చైతన్యం గల పెద్ద పట్టణాల్లో తలసరి వినియోగం 170 ఉండగా, చిన్న పట్టణాల్లో 40, గ్రామీణ ప్రాంతాల్లో అభివద్ధి దశను బట్టి 20, కొన్ని చోట్ల కేవలం 5 గుడ్లు మాత్రమే ఉంది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే గుడ్లలో 75% వాటిని పట్టణాల్లోనూ, 25% గుడ్లను సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో సంగ్రహిస్తున్నారు. గుడ్ల వినియోగం 2010 లో 34 మిలియన్ల నుండి 2020 సంవత్సరానికి 106 మిలియన్లు అంటే 200% పెరుగుతుంది అని అంచనా. ఇదేవిధంగా కోడిమాంసం లభ్యత 1.6 కిలోలు. మాంసం వినియోగం 0.7 మిలియన్‌ టన్నులు. 2000 సంవత్సరానికి మాంసం వినియోగం 1.67 మిలియన్‌ టన్నులకు పెరుగుతుందని అంచనా. అభివద్ధి చెందిన దేశాల్లో సగటు వినియోగం 21 కిలోలు ఉండగా, ప్రస్తుతం మన దేశంలో గుడ్ల సగటు వార్షిక వినియోగం 60, రాష్ట్రంలో 90గా ఉన్నాయి. దేశంలో మాంసం సగటు వార్షిక వినియోగం 3.5 కిలోలు, రాష్ట్రంలో నాలుగు కిలోలు, చైనాలో11.98 కిలోలు, అమెరికా 44.25 కిలోలుగా ఉంది.

ఉపాధి కల్పనలో భేషైన తీరు :

ఏ దేశమైనా ఎందు కాలిడినా భూమిపై సర్వత్ర ఆందోళన నెలకొన్నది ఉపాధి లభ్యత గురించే, వ్యవసాయిక దేశమైన భారతదేశంలో ఇప్పటికి 65% మంది ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలలోనే ఉపాధి పొందగలుగుతున్నారు. వాటిలో పౌల్ట్రీ రంగంలో అత్యధిక మంది ప్రజలకు ఉపాధి లభిస్తున్నది. 62 మిలియన్ల ప్రజానీకానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఈ రంగంలో ఉపాధి కల్పిస్తున్నది. పౌల్ట్రీ రంగంలో మాంసము, గుడ్ల వినియోగం ఇంకా ప్రాచుర్యం పొంది పరిశ్రమ విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఇంకా మెరుగైన ఉపాధికి అవకాశాలున్నట్లు సుమారుగా వేలాది మందికి ఉపాధి లభించే వనరుగా ఇది అభివద్ధి దశలో పయనిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఒక గుడ్డు లేదా 50 గ్రాముల మాంసం తలసరి వినియోగం పెరిగితే సుమారు 30 వేల మందికి పైగా అదనంగా భవిష్యత్తులో ఉపాధి లభించే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు పౌల్ట్రీ రంగంలో 20 లక్షల మంది ఉపాధిలో ఉన్నట్టు అంచనా.

కోళ్ల మేత- పౌష్టికాహార పరిస్థితి :

నాణ్యమైన పోషకాహారంగా కోడి మాంసం, కోడి గుడ్ల దిగుబడులను సాధించేందుకు ప్రధానమైన వనరు కోళ్లదాణా. కోళ్ల పరిశ్రమలు మాంసం, గుడ్ల ఉత్పత్తి వ్యయాన్ని, లాభ నష్టాలను ప్రధానంగా నిర్ణయించేది దాణా. ఉత్పత్తి వ్యయంలో దాణా వాటా మన దేశంలోని వివిధ ప్రాంతాలను బట్టి మారుతుంది. బ్రాయిలర్‌ కోళ్ల దాణా ఖర్చు దక్షిణాది రాష్ట్రాల్లో 64%, ఉత్తరాది రాష్ట్రాల్లో 55%, పశ్చిమ ప్రాంతాల్లో 58% ఉంది. భవిష్యత్తులో 2020 నాటికి దాణా అవసరం అనేక వేల మిలియన్‌ టన్నులకు చేరుతుందని అంచనా. పరిస్థితి పరిశీలిస్తే ప్రస్తుత దాణా ఉత్పత్తి, లభ్యతలో మన దేశం చాలా వెనుకబడి ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

మారుతున్న ఆహార అలవాట్లు - విలువ ఆధారిత పదార్థాలు :

ప్రస్తుతం భారతదేశంలో సగటు పౌరునికి విస్తరిలో కోడిమాంసం, కోడిగుడ్లకు ఉన్నంత విలువ మరే పదార్థాలకు లేదు. ముఖ్యంగా భారతీయ ఆహార శైలిలో, నిత్య జీవనంలో చికెన్‌ దాని విలువ ఆధారిత ఉత్పత్తులు ఒక భాగమైపోయాయి. ఈ నేపథ్యంలో బ్రాండెడ్‌ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ కూడా పెరిగింది.  భారతీయ చికెన్‌ ఉత్పత్తులతో పాటు కెంటకి ఫ్రైడ్‌ చికెన్‌ (కె.ఎఫ్‌.సి), మెక్‌డోనాల్డ్‌, వింపి, పిజ్జాహట్‌ మొదలగు విదేశీ బహుళజాతి కంపెనీలు రంగ ప్రవేశం చేసి మార్కెట్లను కొల్లగొడుతున్నాయి. కోడి మాంసం, కోడి గుడ్ల నుండి రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఇప్పుడు అనేక కంపెనీలు, రెస్టారెంట్లు ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా గహ వినియోగం కొరకు, గహిణులు పౌష్టికాహారాన్ని అనేక రకాలుగా తయారుచేసుకుని సమాజానికి ఒక పటిష్టమైన, శక్తివంతమైన మానవ వనరును తీర్చిదిద్దే కార్యక్రమం ఎల్లెడలా పౌల్ట్రీ పరిశ్రమ అభివ ద్ధికి దోహదపడుతుంది.

వివిధ రకాల విలువ ఆధారిత పదార్థాలు :

చికెన్‌ బిర్యాని, చికెన్‌ యుమిస్‌, చికెన్‌ నగ్గెట్స్‌, కోల్డ్‌ కట్స్‌, క్యాండీ చికెన్‌ కర్రి, ఫ్రీజ్‌ డ్రైడ్‌ చికెన్‌ పలావ్‌, మీట్‌ సూప్‌, పౌడర్‌ ఆమ్లెట్‌, సాండ్‌విచ్‌,  స్క్రాంబ్ల్‌డ్‌ ఎగ్‌ మిక్చర్‌, పిజ్జా, బర్గర్‌ మొదలగునవి ఈ విలువ ఆధారిత పదార్ధాల్లో ముఖ్యమైనవి. ఇంకా చికెన్‌ కీమా, లాలీపాప్‌, డ్రమ్‌స్టిక్‌, బోన్‌లెస్‌ లెగ్స్‌ ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నాయి.

పౌల్ట్రీ ఉత్పత్తులు - ప్రాసెసింగ్‌ రంగం :

కోళ్ల పరిశ్రమ అభివద్ధికి ప్రాసెసింగ్‌ రంగం కూడా అధికంగా సహకరిస్తున్నది. ఇంతకాలం కోడి మాంసాన్ని మానవ వనరు ద్వారానే తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. ఇప్పుడు సులభంగా కోడి మాంసాన్ని పరిశుభ్రంగా తయారుచేసి వినియోగదారులకు అందించేందుకు యంత్రాలు రంగ ప్రవేశం చేశాయి. దీనితో డ్రెస్సు చికెన్‌గా వ్యవహరింపబడే కోడి మాంసం వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 

మన దేశంలో పౌల్ట్రీ ప్రాసెసింగ్‌ కంపెనీలు చాలా ఉన్నాయి. వీటితోపాటు ఐదు ఆధునిక ఇంటిగ్రేటెడ్‌ పౌల్ట్రీ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. గుడ్డు నుండి పౌడర్‌ను తయారు చేయడం, ఎగ్‌ ప్రోజెన్‌, ఎగ్‌ యోక్‌ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలలోని ఎగ్‌ పౌడర్‌  ప్రాసెసింగ్‌ ప్లాంట్లు వేల టన్నుల పౌడర్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా ఎగ్‌ పౌడర్‌, అల్బుమిన్‌ పౌడర్‌ మొదలగు  ప్రామాణిక ఉత్పత్తులు ప్రాసెస్‌ అవుతున్నాయి. శీతలీకరణ చేసిన మాంసం అమ్మకాలు కేవలం 5% మాత్రమే విక్రయించబడుతున్నాయి.

మార్కెటింగ్‌ వ్యవస్థ నెక్‌ పాత్ర :

ఒకప్పుడు కోళ్ల పరిశ్రమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడానికి రైతులు అనేక విధమైన కష్టాలు అనుభవించేవారు. జాతీయ గుడ్ల సమన్వయ సమితి (చీవషష) ఏర్పడిన తర్వాత ఈ సమన్వయం రైతులకు ఎంతో మేలు చేసింది. స్వర్గీయ డాక్టర్‌ బి.వి. రావు లాంటి మ¬న్నతులు ఈ సమన్వయ వ్యవస్థ ఏర్పాటుచేసి రైతులకు, పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు. బ్రోమార్క్‌ అనే సమన్వయ సంస్థ ద్వారా కోడి మాంసం విక్రయాలను కూడా జాతీయ నెట్‌వర్క్‌లో భాగం చేశారు. రోజువారి గుడ్లు, మాంసం ధరలను ఉత్పత్తికి అనుగుణంగా నిర్ణయించి ఈ సంస్థలు ప్రకటించి ఏకీకత మార్కెట్‌ విధానానికి బాటలు వేశాయి. దీని వలన మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా గుడ్లు నేరుగా వినియోగదారుడికి చేరేసరికి 25% మాత్రమే రేటు ఎక్కువ అవుతున్నది. ఇక మాంసం విషయానికి వస్తే వినియోగదారులు తాజా కోడిమాంసాన్ని కోరుకోవడం వల్ల మార్కెటింగ్‌ వ్యవస్థలో వ్యత్యాసాలు ఉంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా గుడ్లు, మాంసం ధరలు నిలకడగా ఆశాజనకంగా ఉండటం వల్ల లేయర్‌, బ్రాయిలర్‌ పరిశ్రమలో అత్యధికంగా వద్ధి నమోదైంది.

ఆశాజనకంగా ఎగుమతులు :

2012-2013సంవత్సరాలలో మన దేశం 557.80 వేల మెట్రిక్‌ టన్నుల పౌల్ట్రీ ఉత్పాదనలను ఎగుమతి చేసింది. వాటి విలువ రూ. 494.5 కోట్లు. ఎగుమతులు అన్నీ ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్‌, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జర్మనీ, నెదర్లాండ్‌ దేశాలకు చేయబడ్డాయి. మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఎగ్‌ పౌడర్‌కు ఆఫ్రికా, మధ్య తూర్పు ఆసియాలో మంచి డిమాండ్‌ ఉంది. అలాగే ఎగ్‌ పౌడర్‌ జపాన్‌, జర్మనీ లాంటి దేశాలకు ఎగుమతి అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌ నుండి మహారాష్ట్ర, బెంగాల్‌, ఒరిస్సా, అస్సాం, బీహార్‌ రాష్ట్రాలకు గుడ్లు ఎగుమతి అవుతున్నాయి.

కీలకంగా మారిన ఉపకరణాల తయారీ రంగం :

పౌల్ట్రీ పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ రంగంలో ఆధునిక సాగు రైతులకు తోడ్పడేందుకు ఉపకరణాలు, ఆధునిక యంత్రాలు రంగం లోకి వచ్చాయి. సాలీనా 500 కోట్ల రూపాయల పౌల్ట్రీ ఉపకరణాల వాణిజ్యం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరం 10 శాతం పెరిగి, పౌల్ట్రీ పరిశ్రమ లక్ష్యాలను నెరవేరుస్తుంది. మన దేశంలో ఇప్పటివరకు వందకు పైగా పౌల్ట్రీ ఉపకరణాల పరిశ్రమలు తమ వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం  ద్వారా మెరుగైన రీతిలో పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుబడి చేయడానికి దోహదపడుతూ వంద కోట్ల విలువైన ఉపకరణాలు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి వాటర్‌ నిప్పల్స్‌, చైన్‌ లింక్‌, పైపులు, ఫీడింగ్‌, కూలింగ్‌ మరియు హీటింగ్‌ సిస్టంలు, ఎగ్‌ ట్రేలు మొదలగునవి ఎగుమతుల జాబితాలో ఉన్నాయి. అదే సందర్భంలో విదేశాల నుండి దిగుమతి చేసుకునే పరికరాల విలువ సుమారు రూ. 150 కోట్ల విలువ ఉంది. 1980లో కేజ్‌ సిస్టం 1990లో నిప్పల్స్‌ వాడకం అమలులోకి రాగా 2000-2001లో ఆటోమేటిక్‌ డేటా సిస్టం వంటి ఆధునిక యాంత్రిక పద్ధతులు పౌల్ట్రీ రంగంలో ప్రవేశపెట్టడం జరిగింది.

కోళ్ల పరిశ్రమ అభివృద్ది - అవరోధాలు :

భారతీయ వ్యవసాయ వ్యవస్థలో తనదంటూ అద్వితీయ పాత్ర పోషిస్తున్న కోళ్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన అవరోధాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

స్వయంకృషితో ఎదిగిన పౌల్ట్రీ రంగం ప్రభుత్వాల నుండి అంతగా సహకారం పొందడం లేదు. ఉత్పత్తి, మార్కెటింగ్‌, విస్తరణ రంగాలలో ప్రభుత్వ వ్యవస్థల తోడ్పాటు లేకుండా తన కాళ్ళపై తాను నిలబడి కోళ్ల  రైతులు అజేయంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంలో పౌష్టికాహార సరఫరాతో పాటు, జాతీయ ఆహార భద్రతకు తోడ్పడుతున్న ఈ రంగాన్ని అభివద్ధి చేసేందుకు జాతీయ పౌర సరఫరా వ్యవస్థలో కోడిగుడ్లను భాగస్వామ్యం చేయవలసి ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు నడుచుకుంటున్న దాఖలాలు ఇప్పటివరకు లేవు. రేషన్‌ బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, నూనెలతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి కోడిగుడ్లు లేక కోడిమాంసాన్ని అందించాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. కానీ అది నెరవేరే ఆశలు కనబడటం లేదు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లను చేర్చారు. ఇప్పటివరకు తమిళనాడులో 5గుడ్లను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు గుడ్లను విద్యార్థులకు అందిస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ ఇదే స్థాయిలో ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో కూడా కోడిగుడ్డును భాగస్వామ్యం చేసి జాతీయ స్థాయిలో పౌష్టికాహారానికి తద్వారా పౌల్ట్రీ పరిశ్రమ అభివద్ధికి బాటలు వేయాలి. దేశంలోని కొన్ని జిల్లాల్లో నెక్‌ సంస్థ అంగన్వాడీ కేంద్రాలకు లక్షల సంఖ్యలో కోడిగుడ్లను పంపిణీ చేస్తున్నది.

చైతన్యం గల పట్టణ ప్రాంతాల్లోనే గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంది. గుడ్డు దాని ప్రయోజనాలను దేశంలోని ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యతను ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, మీడియా తీసుకోవాలి. ఇప్పటి  నెక్‌ సంస్థ ఆ ప్రయత్నంలో ఉంది. దానిని దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించే బాధ్యతలను పై సంస్థలు తీసుకోవాలి. కోళ్ల పరిశ్రమకు మరో అవరోధంగా మారిన ప్రధాన సమస్య కోళ్ల దాణా. దాణాగా వాడే మొక్కజొన్న, సోయా, వరి నూక, సజ్జలు, జొన్నలు, రాగులు ఖరీదు ఎక్కువగా ఉండడం వలన మేత ఖర్చు అధికమవుతున్నది. కోళ్ల రంగాన్ని వ్యవసాయ అనుబంధ పరిశ్రమగానే గుర్తించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత విద్యుత్‌ పథకం పరిధిలోకి తీసుకొనిరావాలి. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం కోళ్లఫారాలకు 50 శాతం రాయితీ ప్రకటించి కొంత మార్గదర్శకంగా ఉంది. వ్యవసాయ యోగ్యమైన భూములను అన్యాక్రాంతం చేయడం, వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ చర్యల వలన కోళ్ల రంగం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. కోళ్ల ఫారాలు నెలకొల్పుతున్న భూములపై మూల్యాన్ని రద్దు చేసి 1953 కౌలుదారీ చట్టం కింద వాటిని పరిగణించి రైతులకు వెసులుబాటు కలిగించాలి. వ్యవసాయ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్టుగానే గుడ్లు, మాంసంపై కూడా మద్దతు ధరను నిర్ణయించి రైతులను ఆదుకోవాలి. పౌల్ట్రీలు నిర్వహించే భూముల స్థిరాస్తి ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కార్మికుల కూలీల ఖర్చు అధికం కావడం రైతుల నెత్తిన పిడుగు పడినట్లుగా భావన ఉంది. ఇతర పంటలకు ఉన్నట్లు  కోళ్ల పరిశ్రమకు నిల్వ సౌకర్యం లేకపోవడం విచారకరం. ఎగుమతి అవకాశాలు క్షీణించడం, దానితో పాటు భయంకరమైన వైరస్‌లు తరచుగా సంభవించడం పరిశ్రమ ప్రగతికి అవరోధంగా ఉంది.

పరిశ్రమ అభివృద్ధికి కి తోడ్పడుతున్న సంస్థలు:

 1.  జాతీయ గుడ్ల సమన్వయ సంఘం (NECC).
 2. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్లు.
 3. ఔషధ, టీకాల తయారీ కంపెనీలు.
 4. ప్రైవేటు హేచరీలు
 5. పశు దాణా ఉత్పత్తిదారుల సంఘం.
 6. కోళ్ల పరిశ్రమ సామాగ్రి ఉత్పత్తిదారుల సంఘం.
 7. సెంట్రల్‌ పౌల్ట్రీ డెవలప్మె

  రచయిత సమాచారం

  వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌