Print this page..

పత్తిలో ఉధృతి తగ్గని గులాబిరంగు పురుగు , నోవా వినూత్న సూచనలు


ప్రపంచవ్యాప్తంగా పత్తి పంటను వణికిస్తున్న గులాబిరంగు పురుగు తగ్గుముఖం పట్టడం లేదు. బి.టి. రకాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రప్రథమంగా ఈ పురుగు బయటపడి కళ్ళోలాన్ని సృష్టిస్తున్నది. కాయతొలుచు పురుగులు పురుగు మందులను తట్టుకొని సస్యరక్షణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి,  దిగుబడి గణనీయంగా తగ్గిపోయే విధంగా చేస్తున్నాయి.  100-120 రోజుల తరువాత కాయతొలుచు పురుగుల్లో గులాబి రంగు పురుగు గత కొంతకాలంగా ఎక్కువగా ఆశించడంతో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గి రైతు ఆందోళనలో ఉన్నాడు. ఉధృతి పెరిగే అవకాశం  ఉన్నందున ఈ గులాబిరంగు పురుగును నివారించేందుకు నోవా అగ్రి గ్రూప్‌ సంస్థలు పలు రకాలైన సస్యయాజమాన్య పద్ధతులను సూచిస్తుంది. ఈ క్రింది విదంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతు సోదరులు తెలుసుకుని దీని నివారణకు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

పత్తిలో గులాబి రంగు పురుగు వల్ల 20-30 శాతం దిగుబడులు తగ్గడమే కాకుండా పత్తి నాణ్యత బాగా దెబ్బ తింటుంది. ఈ గులాబి రంగు పురుగు పత్తి పంట మీదే ఆశిస్తుంది. మరి ఏ పైరుపై ఈ పురుగు మనకు కనిపించదు. ఈ పురుగు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. గులాబిరంగు తల్లి రెక్కల పురుగు ముదురు గోధుమ రంగులో ఉండి ఒకటిన్నర అంగుళాల పొడవు ఉంటుంది. కోశస్త దశ నుండి వెలువడిన 2-3 రోజులకు గుడ్లు పెట్టడం మొదలుపెడుతుంది. వర్షాకాలం చివరి నుండి చలికాలం ప్రారంభం వరకు పత్తి పైరుపై దీని పురుగు ఒక్కొక్కటి గాని, సామూహికంగా గాని 0.5 మి.మీ. పొడవుతో 0.25 మి.మీ. వెడల్పుతో ఉంటాయి. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు మొదట తెల్లగా ఉండి, తరువాత దశలో గులాబిరంగుకు మారతాయి.

పంటలో కలుగ చేసే నష్టం :

గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే 10 రోజుల కంటే తక్కువ ఉన్న మొగ్గ మీద ఎక్కువ నష్టం కలుగ జేస్తుంది. ఈ పూ మొగ్గలోనికి వెళ్ళే ప్రదేశంలో పసుప్పచ్చని చుక్క గమనించవచ్చు. 

  • ఈ పిల్ల పురుగులు ఏర్పడుతున్న కాయల్లోకి కూడా ప్రవేశించి లోపల ఉన్న విత్తనాలను, ఏర్పడుతున్న పత్తిని తినేస్తుంది. దీనివల్ల పొలంలో కూడా పత్తి ఎక్కువగా రాలిపోతుంది. 
  • బాగా ఎదిగిన పురుగులు, పత్తి కాయల మీద ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. కానీ ఈ దశలో పత్తి పంటలో కాయలు రాలిపోవు. ఈ దశలో వందశాతం గులాబి రంగు పురుగును మనం చూడవచ్చు. ఈ దశలో పురుగు ఆశించిన పత్తికాయలు కింద పడిపోకుండా చెట్టు మీదే ఎండిపోవడం జరుగుతుంది. 
  • ఈ పిల్ల పురుగులు పూత మీద, పువ్వు విచ్చుకునే దశలో ఆశించడం వల్ల  పువ్వు సరిగా విచ్చుకోకుండా ఉంటుంది. దీనినే గుడ్డి పువ్వులు అని కూడా అంటారు.

పొలంలో గుర్తించడం ఎలా : 

పువ్వు సరిగా విచ్చుకోకపోవడం అంటే గుడ్డి పువ్వులు ఏర్పడడం,కాయల మీద చాలా చిన్న రంధ్రం ఏర్పడడం, కాయ సరిగా పగలకపోవడం, గూడ, కాయలు ఎక్కువగా రాలిపోవడం వంటి లక్షణాల ద్వారా ఈ పురుగును గుర్తించవచ్చు.

సస్య రక్షణ చర్యలు : 

పంట అయిపోయిన తరువాత పొలంలో గేదెలు గానీ, మేకలను గానీ వదలాలి. దీనివల్ల గులాబి రంగు పురుగు కోశస్థదశకు సంబంధించిన అవశేషాలు ఉండవు. పంటకు సంబంధించిన అవశేషాలు (పత్తి కట్టె) పత్తి తీసిన వెంటనే తగుల బెట్టడం మంచిది. పంట వేయడానికి ముందు వేసవి దుక్కులు చేయడం మంచిది. బి.టి పంటతో పాటు నాన్‌ బి.టి రకాలను కూడా పొలం చుట్టూ సాగు చేయించాలి. పొలంలో అక్కడక్కడ గులాబి రంగు పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా వీటి ఉధృతిని తగ్గించవచ్చు. పొలంలో గూడ ఎక్కువగా రాలిపోతుంటే పురుగు ఉధృతిని గమనించిపుడు నోవా అగ్రిటెక్‌ వారి నోవా డాజ్లర్‌ 2.5 మి.లీ./లీటరు నీటికి లేదా నోవా అగ్రి సైన్సైస్‌ వారి నోవా పాంథర్‌ (లామ్డాసైహలోథ్రిన్‌ 25% ఇ.సి.) 1.5 మి.లీ./ లీటరు నీటికి మరియు నోవా అగ్రిటెక్‌ వారి టెర్మినేటర్‌ గోల్డ్‌ 5డి యాక్షన్‌ 2.5 మి.లీ./లీటరు నీటికి లేదా నోవా అగ్రిసైన్సెస్‌ వారి డబుల్‌ పవర్‌ (ప్రొఫినోపాస్‌ 40% ఇ.సి.+సైపర్‌మెథ్రిన్‌ 4% ఇ.సి.) 2 మి.లీ./లీటరు నీటికి మరియు నోవా అగ్రిటెక్‌ వారి నోమోర్‌ 0.75 మి.లీ./లీ. నీటికి లేదా నోవా అగ్రిసైన్సెస్‌ వారి సింగం (లామ్డాసైహలోథ్రిన్‌ 5% ఇ.సి) 1 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతిని గమనిస్తూ మరలా పైన సిఫార్సు చేసిన మోతాదులో వారం రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారి చేస్తుండాలి.
 

రచయిత సమాచారం

- నోవా కిసాన్‌ సేవా కేంద్రం, హైదరాబాద్‌,  ఫోన్‌ : 040-46789789, 9100933354