అందరూ అనుకుంటారు నందమూరి హరికృష్ణకు కేవలం కార్లు డ్రైవింగ్‌ మాత్రమే హాబి అని. 9 నెలల పాటు తండ్రి నందమూరి తారకరామారావు చైతన్య రథాన్ని వేల కిలోమీటర్లు నడిపిన నందమూరి హరికృష్ణకు ఎడ్ల బండిని కూడ తోలడం సరదాగా ఉండేది. స్వగ్రామం నిమ్మకూరులో 19 ఏళ్ల పాటు పెరిగిన నందమూరి హరికృష్ణకు వ్యవసాయంపై కూడా మక్కవ ఎక్కువ సహజంగా వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు కావడం, తాత, తండ్రులు వ్యవసాయ దారులు కావడం, అదే వృత్తి తనకు కూడా ఆసక్తికరమని హరికృష్ణ సన్నిహితుల దగ్గర చెబుతుండేవారు.

ఎన్‌.టి.ఆర్‌ రాష్ట్ర రాజదాని నగరంలో రామకృష్ణ థియేటర్‌, స్టూడియో నిర్మించిన అనంతరం నిమ్మకూరు నుండి హైదరాబాద్‌ తరలివచ్చిన నందమూరి హరికృష్ణ వ్యవసాయ వృత్తికి మాత్రం దూరం కాలేదు మోయినాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన సహజ వ్యవసాయం కోసం అవులను పోషించేవారు ముఖ్యంగా అంతరించి పోతున్న పుంగనూరు రకం పశు జాతి మనుగడను చాటి చెప్పేందుకు కృషి చేశారు దానిలో భాగంగా ఆయన తన క్షేత్రంలో వీలున్నంతసేపు పశువుల మంచి చెడులు చూసేవారు.

చిన్నతనంలో ఎన్‌.టి.ఆర్‌ చదువుకుంటూ, పశుపోషణ చేస్తూ, పాలను అమ్మే వృత్తిలో నిమగ్నమై ఉన్నట్లే హరికృష్ణ కూడా ఒక రైతు బిడ్డగా వ్యవసాయం, పశుపోషణకు విశేష ప్రాధాన్యం ఇవ్వడం చెప్పుకోదగిన అంశం.

తెలుగు భాషపై విశేష అభిమానం ఉన్న హరికృష్ణ తన తండ్రి ఆశాయాలకు విరుద్ధంగా రాష్ట్ర విభజన జరగడాన్పి తట్టుకోలేక పోయారు రాజ్యసభ సభ్యుడిగా ఉండి సభలో దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు కూడా ఈ అంశంపై రాజ్యసభ డిప్యూటి చైర్మెన్‌ పి.జె. కురియన్‌ తనకు అర్థం కావడం లేదని చెప్పినప్పటికీి పట్టు వీడని హరికృష్ణ తెలుగులో తన ఆవేశాన్ని, అసహనాన్ని సుస్పష్టంగా తెలియజేస్తూ... ఏకంగా విభజన చట్టాన్ని నిరసిస్తూ రాజీనామా చేసి తన త్యాగనిరతిని ప్రకటించి , సంచలనం సృష్టించారు అది హరికృష్ణ విలక్షణ శైలి. తండ్రిలాగానే మాట తప్పక, మడమ తిప్పని వీర యోధుడిగా, హరికృష్ణ తెలుగుజాతి చరిత్రలో నిలిచిపోతారు.

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, అన్న నందమూరి తారక రామారావు ప్రియ తనయుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతిపట్ల పర్చూరు శాసన సభ్యులు, అగ్రిక్లినిక్‌ సంపాదకులు ఏలూరి సాంబశివరావు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముమ్మూర్తులా ఎన్టీఆర్‌ను పోలి, కడవరకు ఆయన ఆశయ సిద్ధికై అంకితభావంతో పనిచేసిన నందమూరి హరికృష్ణ మృతి తెలుగుదేశం పార్టీకి, యావత్తు తెలుగు ప్రజలకు తీరని లోటని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు హరికృష్ణ తనయులు జూ. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ఇతర కుటుంబ సభ్యులకు ఆయన తమ ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

- అగి క్లినిక్‌ డెస్క్‌

ఫోటో సౌజన్యం : వల్లభనేని భాను, స్వజాతి పవుపోషకులు, యలమర్రు, కృష్ణా జిల్లా.