పత్తి పంటను ఆశించి నష్టపరిచే కీటకాలు ముఖ్యంగా రెండు రకాలు, రసం పీల్చు పురుగులు మరియు కాయతొలుచు పురుగులు. బి.టి. పత్తి ప్రవేశిరచిన తరువాత కాయతొలుచు పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గినప్పటికీ, ప్రస్తుతం పత్తిలో ప్రధాన పురుగులతో పాటుగా, గతంలో అసలు ప్రాధాన్యత లేని కొన్ని రకాల పురుగులు ఆశించడం గమనించడమైనది. పొలుసుపురుగు, ఆకు చుట్టు పురుగు, బొచ్చు పురుగు, కాండం తొలిచే పురుగు, మిరిడ్‌ బగ్స్‌, కాండం తొలిచే కొమ్ము పురుగు లాంటివి అడపా దడపా ఆశించి కొంత మేర నష్టాన్ని కలగజేస్తాయి. వీటిలో కాండం తొలిచే పురుగు ఉనికిని శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల్లో ఏరువాక కేరద్రర శాస్త్రవేత్తలు గమనించటం జరిగింది.

కొమ్ము తొలుచు పురుగు శాస్త్రీయ నామర ఆల్సిడోడ్స్‌ ఎఫాబర్‌. ఇది ప్రధానంగా బెండను ఆశిస్తుంది. కాని, అక్కడక్కడా పత్తిని కూడ ఆశించటం జరుగుతుంది. కాండం తొలిచే కొమ్ము పురుగును తోలుత వాయువ్య కర్ణాటక మరియు తమిళనాడు లోని కొన్ని ప్రాంతాల్లోను బి.టి పత్తిని ఆశించినట్లుగా పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఖమ్మం, వరంగల్‌, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా అడపాదడపా పత్తిని కాండం తొలిచే కొమ్ము పురుగు ఆశించినట్లుగా చూస్తున్నాం. ఈ నేపధ్యంలో కాండం తొలిచే కొమ్ము పురుగు పత్తిని ఆశించి, నష్టపరిచే విధానం, జీవితదశలు మరియు నివారణ పద్ధతుల గురించి తెలుసుకోవడం ద్వారా దీన్ని తొలిదశలో నివారించి దీని ద్వారా కలిగే నష్టాన్ని తగ్గిరచవచ్చు.

జీవిత చరిత్ర :

ఆడ పురుగు ఆకు తొడిమ మొదలులో కొమ్మ నుండి మొదలయ్యే ప్రాంతంలో ముక్కుతో తొలిచి గుడ్లు నిలవటానికి వీలుగా కంతలను ఏర్పాటు చేసుకొని అందులో 1-3 గుడ్లను పెడుతుంది. సాధారణంగా మధ్య కంతులో గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టిన తర్వాత అవి మొక్క కణజాలం నుండి విడుదలైన పదార్ధంతో కప్పబడతాయి. దీని నుండి విడుదలైన పిల్ల పురుగు ఆకు కాడ, తరువాత పక్క కొమ్మలమీద, చివరగా ప్రధాన కాండం మీద తిని, డొల్ల చేయడం ద్వారా, కాండం విరిగి పోవడం, చిన్న మొక్కలైతే చనిపోవటం జరుగుతుంది. పిల్ల పురుగు తల భాగం కాఫీ పొడి రంగులో, మిగతా భాగం గోధుమ లేక లేత పసుపు రంగులో ఉంటుంది. ఒక పురుగు సాధారణంగా 15-25 సెం.మీ. వరకు కొమ్మ లేదా కాండాన్ని డొల్ల చేస్తుంది. ఆశించిన సమయం మరియు మొక్క పెరుగుదల దశను బట్టి, పత్తి పంట నష్టం ఆధారపడుతుంది. ఇది ఆశించిన మొక్క కణజాలం నుండి విడుదలైన జిగురు పదార్ధం మరియు పురుగు విసర్జించిన పదార్ధం కలిసిపోవడం వల్ల మొక్కపై పగుళ్ళు మరియు చిన్న చిన్న కణితలు ఏర్పడతాయి. ఈ పిల్ల పురుగు బాగా పెరిగిన తరువాత, కాండంలో పురుగు తొలచిన భాగాల్లో అటూ ఇటూ తిరిగి, ఆ తరువాత సన్నని పొరలాంటి జిగురు పదార్ధంతో ముందుగా తల, ఆ తరువాత పురుగు మొత్తం కప్పబడి, ప్యూపా దశకు చేరతాయి. ఆ తరువాత ప్యూపా దశ నుండి కొమ్ము పురుగులుగా అభివృద్ధి చెందుతాయి.

ఈ పురుగు గుడ్డు దశనుండి పిల్ల పురుగు రావడానికి 4-5 రోజులు పడుతుంది. పిల్ల పురుగు నుండి ప్యూపాదశకు మారడానికి 65-75 రోజులు పడుతుంది. ప్యూపా నుండి కొమ్ము పురుగు ఏర్పడటానికి 10-20 రోజులు పడుతుంది. గుడ్డు నుండి కొమ్ము పురుగు ఏర్పడటానికి దాదాపుగా 81-92 రోజులు పడుతుంది. ఇది మిగతా పురుగులతో పోలిస్తే అంత ప్రమాదకరమైనది కాదు.

నష్ట పరిచే విధానం :

పత్తి మొక్కను 30-100 రోజుల మధ్య ఎప్పుడైనా ఆశించవచ్చు. కొమ్ము పురుగు, పిల్ల పురుగు దశలో ఉన్నప్పుడు మాత్రమే పత్తిని అధికంగా నష్ట పరుస్తుంది. ఎందుకంటే పురుగు పిల్ల పురుగు దశ 65 నుండి 75 రోజులు ఉంటుంది. అంతేకాక, కొమ్మ లోపల, కాండం లోపల చేరి, కణజాలాన్ని తిని మొత్తం డొల్లగా జేస్తాయి. లేత మొక్క దశలో ఆశించినట్లయితే, మొక్క మొదటగా వాడిపోవడం, ఆ తరువాత చనిపోవడానికి ఆస్కారముంది. ముదురు పైరులో ప్రధాన కాండానికి మరియు కొమ్మలకి ఆశించటం వల్ల కాండం లేక కొమ్మలు వాడి, విరిగిపోవటం జరుగుతుంది. తల్లి కొమ్ము పురుగులు మొగ్గలు, లేత చిగుళ్ళను తింటుంది, కాని దీని వల్ల నష్టం కలగదు.

నివారణ :

తరచూ ఆశించే ప్రాంతాల్లో దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేపపిండి వేసుకోవడం ద్వారా, ఈ పురుగును తొలి దశలోనే నివారించటానికి అవకాశముంటుంది.

పత్తి పరటలో అక్కడక్కడా బెండను వేసుకోవడం ద్వారా ఈ పురుగును తగ్గిరచవచ్చు.

మొక్క లేత దశలో 30-40 రోజుల వయసులో ఆశించినట్లయితే కార్బోఫ్యురాన్‌ 10జి గుళికలను ఎకరానికి 10 కిలోలు, మొక్క మొదళ్ళలో, తేమ ఉన్న సమయంలో వేయాలి.

పురుగు ఉధృతి తగ్గిరచడానికి, మోనోక్రోటోఫాస్‌ 36 ఇ.సి 1.6 మి.లీ / లీ చొప్పున కలిపి మొక్క మొదళ్ళ తడిచేటట్టు పిచికారీ చేయాలి.

తరువాత దశలలో ఆశించినట్లైతే ప్రొఫినోఫాస్‌ 50ఇ.సి 2 మి.లీ./లీ. + నువాన్‌ 76 ఇ.సి 1 మి.లీ./ లీ. లేదా ధయోడికార్బ్‌ 70 డబ్ల్యూ.పి 1గ్రా + నువాన్‌ 76 ఇ.సి 1 మిలీ ను 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయటం ద్వారా దీన్ని నివారించవచ్చు.

మిగతా పురుగులతో పోలిస్తే, ఇది అంత ప్రమాదకరమైనది కాదు. ఎందుకంటే ఒక పురుగు 1 నుండి 3 గుడ్లు మాత్రమే పెట్టటం, గుడ్డు దశ నుండి మరలా కొమ్ము పురుగు ఏర్పడటానికి 80-90 రోజుల పట్టడంతో ఇది వ్యాపించటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఉధృతి ఎక్కువగా ఉంటే తగు సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టటం ద్వారా నివారించుకోవచ్చు.

డా|| జి. చిట్టిబాబు, శాస్త్రవేత్త (సస్యరక్షణ), ఏరువాక కేరద్రర, డా|| ఎస్‌. రాజ కుమార్‌, శాస్త్రవేత్త (సస్యరక్షణ),

డా|| పి. వెరకట్రావు, శాస్త్రవేత్త (విస్తరణ), డా|| డి. చిన్నర నాయుడు, పోగ్రార కోర్డినేటర్‌,

కృషీ విజ్ఞాన కేరద్రర, ఆమదాలవలస, ఫోన్‌ : 9849035068