ప్రపంచపు పాడి పశువుల రోజుని 1983న జంతువుల హక్కులను కాపాడుతూ, పాడిపశువుల వేదింపులను బహిర్గతం చేయడానికి మరియు అయా పాడిజంతువుల మాంసం కోసం జంతు వధ శాలలకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజును ప్రారంభించారు. ముఖ్యంగా ప్రపంచపు మొట్టమొదటి అహింసావాది అయిన మహాత్మాగాంధీ పుట్టినరోజును అక్టోబర్‌ 2వతేదిన ఎంచుకోవడం జరిగింది. అలాగే వరల్డ్‌ అనిమలే డే (ప్రపంచపు జంతువుల రోజు)ను ముందుగా ఇటలీలో 1931లో అక్టోబర్‌ 4న ప్రారంభించారు. అంతరించిపోతున్న (ఎండెంజెర్డ్లేదాథ్రెటెండ్‌) జీవుల మీద దషి ్టసారించి వాటి మీద శ్రద్ద తీసుకునే దిశగా విస్తరించించింది. అందువల్ల ఈరోజును ఆధారం చేసుకుని మన ఆంధ్రప్రదేశ్‌ గర్వించదగ్గ ఒంగోలు జాతి పశువుల గురించి తెలుసు కుందాం

ఒంగోలుజాతి పశువులు :

బాస్‌ ఇండికస్‌ అనే పశువుల కుటుంబానికి భారత ఉపఖండం నిధి వంటిది. వ్యవసాయపనులకుగాని, పాలు, మాంసానికిగాని ఈ జాతి పశువులు ప్రశస్తమైనవి. నేల, వాతావరణం, దొరికే గ్రాసం వంటి వాటిని బట్టి ఈ కుటుంబంలో 30 వరకు వివిధ జాతుల పశువులు అభివద్ధి చెందాయి. వీటి పేర్లు ఆయా ప్రదేశాల పేర్లను బట్టి వచ్చాయి. ఈజాతుల్లో సింధీ, సహివాల్‌, కంక్రేజ్‌, గిర్‌, ఒంగోలు, మైసూరు, కంగాయం, హిస్సార్‌, కష్ణానది లోయవంటి జాతులు ప్రపంచంలోని అనేక సమశీతోష్ణ దేశాలకు వ్యాపించాయి. ఈ తొమ్మిది జాతుల్లోనూ, ఒంగోలు జాతి అనేక దేశాల్లోను, వివిధ ఖండాల్లోను అత్యధికంగా వ్యాపించింది.

ఒంగోలు జాతి దేశానికి ఖ్యాతి :

తెలుగు రైతుకు ఆత్మ బంధువుగా, తెలుగుజాతి విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన ఒంగోలు జాతి పశువులకే దక్కుతుంది. ఒంగోలు ఆవులు, ఎడ్లను పోలిన పశువులు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. ఆకర్షణీయమైన రూపం, గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన ఒంగోలు పశువులు ఆర్యుల కాలం నుంచే మనుగడ సాగిస్తున్నాయి అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఒంగోలు కేంద్రంగా అభివద్ధి చెందిన ఈ పశువులు నేడు అనేక దేశాలకు విస్తరించాయి.

ఇతర పశు జాతులతో పోలిస్తే ఒంగోలు జాతి పశువులకు శారీరక సామర్థ్యం ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని సైతం తట్టుకుంటాయి. వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంటుంది. యజమానుల పట్ల విధేయత, విశ్వాసాలు కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. ఈ జాతి ఆవులు, దూడల మరణాల శాతం తక్కువగా ఉంటుంది. తొలి సారిగా మన దేశం నుంచి బ్రెజిల్‌ ఒక జత ఒంగోలు జాతి కోడెలను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు ఆ జాతి పశువుల్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అలాగే అమెరికా తాను దిగుమతి చేసుకున్న ఒంగోలు జాతి పశువుల్ని ఇతర జాతులతో సంకరపరచి 'బ్రాహ్మణి' అనే కొత్తరకం పశుసంతతిని వద్ధి చేస్తోంది. మన దేశం నుంచి బ్రిటన్‌, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, ఇండోనేషియా, మలేసియా వంటి దేశాలు ముందుగా ఒంగోలు పశువులను దిగుమతి చేసుకున్నాయి.

ఒంగోలు జాతి పశువులకు ఓప్రత్యేకత ఉంది. అందం, చందం, లావు, ఒడ్డు, పొడుగు అన్నీ కలబోసిన పశువులే ఒంగోలు జాతివి. ఈ జాతి పశువులను కనుపర్తిపాడు కేంద్రంగా పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పెంచుతున్నారు. ఒంగోలు జాతి పశువులంటే కొంతమంది రైతులు సొంత బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటారు. పశువుల ప్రేమికులు పెంచిన ఒంగోలు జాతి పశువులకే కనుపర్తిపాడులో అందాల పోటీలు జరుగుతాయి. ఒక లేగదూడ ఒకరకంగా ఉంటే మరో రెండేళ్ల దూడ మరో రకంగా కనువిందు చేస్తున్నది. ఇక్కడ ఒంగోలు గిత్తలు చెంగుచెంగున ఎగురుతూ కనువిందు చేస్తాయి.

కొందరు పశు ప్రేమికులు వీటికి ప్రత్యేక శ్రద్ధతో వివిధ ఆహారాలను పెడుతున్నారు. గిత్తకు ప్రతిరోజు రెండు లీటర్ల పాలు, నాలుగు గుడ్లు, ఉలవలు, అలసందలు, సజ్జలు ఆహారంగా పెడుతున్నారు. పోషణ కోసం ప్రతి జత పశువులకు ఓ ఇద్దరు మనుషులు ప్రత్యేకించి పని చేయాల్సి ఉంటుంది. వీటికి అనారోగ్యం కలగకుండా దోమతెర ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా ఫ్యాన్లు బిగించడం వంటివి చేస్తున్నారు.

బ్రెజిల్‌లో ఇటీవల జరిగిన పాల పోటీల్లో మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్న ఆవులు మన దేశానికి చెందిన గిర్‌ (48, 45 కిలోలు), ఒంగోలు (42 కిలోలు) జాతులకు చెందినవే కావడం విశేషం. శాస్త్రీయ పోషణ పద్ధతుల్ని అవలంబిస్తే మన జాతి పశువుల పాల దిగుబడి సామర్థ్యం మరే ఇతర విదేశీ జాతి కంటే తక్కువ కాదని నిరూపితమైంది.

రైతుల ఆత్మ బంధువు :

రైతులకు ఒంగోలు జాతి పశువులు ఆత్మ బంధువులుగా ఉన్నాయి. దుక్కి దున్నడం, విత్తనం నాటడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. పొలం పనులన్నీ ఈ జాతి పశువులే చేస్తాయి. ఈ జాతి గిత్తలు రూ.లక్ష నుండి రూ.20 లక్షల వరకు విలువ చేస్తాయి. ఇదే రైతుకు వ్యవసాయం తరువాత పెద్ద ఆస్తి. ఒంగోలు జాతి ఆవులకు అధిక పాలధార ఉంటుంది. ఇంటి ముందు ఆవు ఉంటే గోమాత ఉన్నట్లు, గిత్త ఉంటే నందీశ్వరుడు ఉన్నట్లు రైతులు పరవశించిపోతారు.

రాష్ట్రానికే కాదు ఉప ఖండానికి కీర్తిప్రతిష్టలు సంపాదించి పెట్టిన ఒంగోలు జాతి పశువుల సంతతిని సంరక్షించి, అభివద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పలు చర్యలు చేపట్టాయి. గుంటూరుతో పాటు చదలవాడ (ప్రకాశం), చింతలదీవి (శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరుజిల్లా), మహానంది (కర్నూలు)లోఉన్న పశు పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు, అధికారులు ఒంగోలు జాతి పశుసంతతిని అభివద్ధి చేసేందుకు కషిచేస్తున్నారు. చెన్నైలోని జాతీయ జీవ వైవిధ్యమండలి (ఎన్బీఏ) నుంచి అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్ల నుంచి 40 కోట్లు విలువ ఉన్న ఒంగోలు జాతి పశువుల జీవద్రవ్యం (జెర్మ్‌ ప్లాసం) తీసుకోవడానికి బ్రెజీలియన్‌ అనుమతులు కోరుతున్నారు. జీవద్రవ్య సదుపాయం, లాభాల భాగస్వామ్యంపై ఎన్బీఏ నిపుణల కమిటీని 2005లో ఏర్పాటు చేసింది.

ఒంగోలు ఎద్దు :

ఒంగోలు ఎద్దు శివాలయంలోని నందీశ్వరుడువలె ఉంటుంది. ఒంగోలుజాతి పశువులు ఆకారంలో చాలా పెద్దవిగాను, బలిష్టంగాను ఉంటాయి. చక్కగా మచ్చిక అయ్యేగుణం కలిగి, బండిలాగుడుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఒంగోలు ఎద్దులు ఆకారంలోను, కొమ్ములలోను విలక్షణంగా ఉండి చూడగానే గుర్తించేలా ఉంటాయి. కొమ్ములు కురచగా 3, 6 అంగుళాలు ఉండి బయటివైపుకు పొడుచుకువచ్చి ఉంటాయి. తల కాఫిన్‌ పెట్టె ఆకారంలో ఉండును మరియు కళ్ళు బాదం కాయ ఆకారంలో ఉండి కాళ్ళ చుట్టూ ఒక సెంటీ మీటరు వరకు నలుపు వలయం ఉంటుంది. విశాలమైన కాళ్ళు, చిన్నమొహం, వెడల్పాటి నుదురు, పెద్దచెవులు, పెద్దగంగడోలు కలిగి ఉంటాయి. ఒంగోలు ఎద్దులో మరో ప్రముఖమైన అంశం దానిఅందమైన మూపురం. మూపురంపెద్దదిగాఉండి, నడిచేటప్పుడు అటూఇటూ ఒరిగిపోతూ ఉంటుంది. చక్కటి మచ్చిక గుణం కలిగి ఉండడంచేత ఒంగోలు ఎద్దులకు ముక్కు తాడువెయ్యడం అరుదు. వాటి లాగుడు శక్తి అమోఘం, ఇతర జాతి పశువుల కంటే చాలా ఎక్కువ 1500-2000 పౌండ్ల వరకు అవలీలగా లాగగలవు.

ఒంగోలు ఆవు :

ఒంగోలు ఆవుగోమాత స్వరూపం. ఒంగోలు జాతి ఆవులు పాలదిగుబడికి ప్రసిద్ధం. ఒక్కరోజులో దాదాపు10-15 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఒక్కో ఈతకు ఒకదూడనుకంటాయి. ఒంగోలుజాతి ఆవులనుండి వచ్చే అన్నీ ఉత్పత్తులు ఔషధ గుణాలను కలిగి ఉండడం విశేషం. అలాగే పాలలో ఉండేపచ్చనిరంగు వచ్చే కెరోటిన్‌ పదార్థం క్యాన్సర్‌ నిరోధకంగా ఉండును. కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండడం, వ్యాధి నిరోధకశక్తిని పెంచే ఇమ్మునో గ్లోబులిన్స్మరియు విటమిన్స్‌ ఉండడం వల్ల తల్లిపాలు లేని పిల్లలకు ముఖ్యంగా ఒంగోలు జాతి ఆవుపాలు పట్టడం విశేషం.

సాధారణంగా ఒంగోలు జాతి పశువు సాలీనా 980 కిలోల పాల దిగుబడి ఇస్తుంది. సరైన పోషణ ఉంటే కనిష్టంగా 1882 కిలోలు, గరిష్టంగా 4917 కిలోల పాల దిగుబడి (సగటున రోజుకు 6-15 లీటర్లు) వస్తుంది. రెండున్నర సంవత్సరాల వయసులో మొదటి ఈత ఇస్తుంది. ఈనిన తరువాత రెండు మూడు నెలల్లో మళ్లీ చూలు కడుతుంది. సాహివాల్‌, హెచ్‌ఎఫ్‌, సంకర జాతి ఆవుల కంటే వీటిలో ఈతల వ్యవధి తక్కువగా ఉంటుంది.

ఒంగోలు జాతి పశువుల దష్టిలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు :

3 పొడవులు ఏమిటంటే కాలుబారు,జబ్బ బారు, నడుము బారు.

7 కురచలు ఏమిటంటే ముట్టే, చెవులు, మెడ, బొడ్డు,తోక, గంగడోలు, డొక్కు.

9 నలుపులు ముట్టే,కళ్ళు,చెవులు, మోకాళ్లు, బొడ్డు తిత్తి, తోక కుచ్చు, మది చార, వషణముల చివర, గిట్టలు.

ఒంగోలుజాతి పశువుల ప్రత్యేక లక్షణాలు :

వంశ పారపర్య అవ లక్షణాలు అరుదుగా కనిపిస్తాయి.

గర్భ సంబంద, పొదుగు సంబంద వ్యాధులు అసలు కనిపించవు

ఖనిజ లవణ మరియు ధాతువు లోపాలు వల్ల వచ్చే వ్యాధులు చాలా అరుదు.

కొవ్వు పదార్థం కండరంలో ఉంటుంది. మిగతా పశువుల్లో మాదిరిగా చర్మం కింద పేరుకోదు.

వీటి చర్మం మీద ఉండే వెంట్రుకలు అతి నీలలోహిత కిరణాలు శరీరంలోకి ప్రసరించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పశువులు అధిక వేడిని, క్రిముల దాడిని తట్టుకోగలుగుతాయి. అదిక నిరోధక శక్తి ఉంటుంది.

ఈ పశువుల్లో మనం చర్మం తాకినప్పుడు కదులుతుంది దీనికి కారణం కావర్నోసాస్‌ కండరాలు ఉండడం. చర్మం కింద ఉండే పెనిక్యుల స్కార్నోసిస్‌ అనే ప్రత్యేక కండరం అమరిక వల్ల పశువు తన ఇష్టానుసారం శరీరాన్ని జలదరిస్తుంది. దీనివల్ల దోమలు జోరీగల ద్వార వచ్చే వ్యాధులు నివారించబడతాయి.

ఈ జాతి పశువులకు తిన్న మేతను ఉత్పాదక శక్తిగా మలచుకునే సామర్థ్యం ఎక్కువ.

ఈ ఆవుల నుంచి వచ్చే పాలల్లో ఒమేగా ఆమ్లాలు, సంయుక్త లినోలెనిక్‌ ఆమ్లాలు మరియు కెరోటినాయిడ్స్‌ ఉండడం వల్ల, పాలు తాగిన వారిలో మనిషి మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది మరియు క్యాన్సర్‌ వ్యతిరేక గుణాలు ఉంటాయి.

ఒంగోలు జాతి పశువులు అనుకూల, ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా తమ జీర్ణక్రియ వేగాన్ని నియంత్రించుకోగలవు. దీనివల్ల వీటికి జీర్ణ సంబంధమైన వ్యాధుల బెడద తక్కువ.

ఆవుల్లో మాతత్వపు భావనలు ఎక్కువగా ఉండడం వల్ల దూడల పోషణ తేలిక.

స్వేద గ్రంధుల వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పని చేస్తుంది కనుక తక్కువ శ్వాసక్రియతో ఉష్ణతాపాన్ని తట్టుకోగలుగుతుంది. అంతేగాక చర్మంలో ఉండే చెమట గ్రంధుల నుండి వచ్చే స్వేదం మైనమువలే ఉండి క్రిమి కీటకాలు వచ్చి వాలినపుడు పట్టు చిక్కక జారిపోతాయి మరియు గజ్జి వంటి చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది.

విదేశీ, సంకర జాతి ఆవు పాలలో ఉన్న కాన్సర్‌, అల్జీమర్స్‌, గర్భస్థ మధుమేహ వ్యాధి ప్రేరకాలు ఒంగోలు జాతి ఆవు పాలలో ఉండవు. దీనివల్ల బాహ్య పరాన్నజీవులు వాటి దగ్గరికి రావు. ఈ లక్షణం విదేశీ, సంకర జాతి పశువులకు లేదు.

ఒంగోలు జాతి పశువుల లక్షణాలు :

1960లో భారత వ్యవసాయ పరిశోధనా మండలి నిర్ధారించిన ఒంగోలు జాతి పశువుల ప్రామాణిక లక్షణాలు. ఒంగోలు ఎద్దులు హుందాగా రాజసం ఉట్టిపడేలా, ఆవులు సున్నితంగా ఉంటాయి.

శరీరం పెద్దదిగా, ఎత్తుగా, పొడవుగా ఉంటుంది. మగ పశువులు తెలుపు బూడిద రంగులోనూ, ఆడ పశువులు మల్లెపూవు రంగులోనూ ఉంటాయి.

నుదురు విషయానికి వస్తే కళ్ల మధ్య వెడల్పుగా, కొంచెం ఉబ్బెత్తుగా, పొడవుగా ఉంటుంది.

కళ్లు పెద్దవిగా, తేజోవంతంగా ఉంటాయి.

చెవులు పొడవుగా ఉండి చివరలు కొద్దిగా వాలి ఉంటాయి.

దవడలు బలిష్టమైన కండరాలతో పటిష్టంగా, వెడల్పుగా ఉంటాయి.

కొమ్ములు కురచగా, బలంగా ఉంటాయి. వాటి చివరలు సన్నగా ఉంటాయి. పగుళ్లు ఉండవు. కొమ్ముల మధ్య బొడిపె ఉండదు.

మెడ కురచగా, బలంగా ఉంటుంది. దూల నుంచి గూళ్ల వరకూ ముక్కు సరళరేఖ మాదిరిగా సమానంగా ఉంటుంది. ముట్టి పై భాగం పూర్తిగా నల్లగా ఉంటుంది.

చెవులు పొడవుగా, కొంచెం వాలి ఉంటాయి. వాటి చివరలు నల్లగా ఉంటాయి.

గంగడోలు పెద్దదిగా, కొంచెం కండ కలిగి, ముడతలతో వేలాడుతూ ఉంటుంది. అది విసనకర్ర ఆకారంలో గొంతు నుంచి రొమ్ము వరకూ విస్తరించి ఉంటుంది.

ఛాతి భాగం దఢంగా, విశాలంగా, పటిష్టంగా ఉంటుంది.

ఒంగోలు జాతి పశువుల కాళ్లు బలిష్టంగా, శరీరానికి తగినట్లు ఉండి శరీరం కింద చక్కగా అమరి ఉంటాయి.

ఉదరం పొడవుగా, లోతుగా ఉంటుంది.

కటివలయం వెడల్పుగా, విశాలంగా ఉంటుంది.

పిరుదులు బలమైన కండరాలతో నిలువుగా ఉంటాయి. ఆవుల్లో తొడలు పలచగా ఉంటాయి.

తోక పొడవుగా పిల్లడెక్కల వరకూ విస్తరించి, కుచ్చు నల్లగా ఉంటుంది. తోక మొదలు ఎద్దుల్లో ఆసనాన్ని, ఆవుల్లో ఆసనాన్ని-మర్మాంగాన్ని పూర్తిగా కప్పుతున్నట్లు అమరి ఉంటుంది.

మగ పశువుల్లో శేరు సమానమైన అమరికతో ఉంటుంది. దాని చుట్టూ నల్లని వెంట్రుకలు ఉంటాయి. వషణాలపై చర్మం మదువుగా ఉంటుంది.

ఆవుల్లో పొదుగు చతురస్రంగా, సమతలంగా ఉండి, చనుల అమరిక చక్కగా ఉంటుంది.

ఒంగోలు జాతి పశువు చర్మం మదువుగా ఉంటుంది. దానిపై మెత్తని వెంట్రుకలు ఉంటాయి. గిత్తల శరీరంపై తెలుపు, నలుపు రంగులు కలగలిసిన రంగున్న వెంట్రుకలు ఉంటాయి.

ఒకప్పుడు ఒంగోలు జాతి ఆవు, ఎద్దులు అంటే రైతులకు ఉండే వ్యసనం మాటల్లో చెప్పలేనిది. అంతేకాదు ఒంగోలు పేరు దేశ నలుమూలల వ్యాపించేలా కీర్తి ప్రతిష్టలు ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు తెచ్చినవే. తెల్లవారి జాము నుండి సూర్యుడు అస్తమించే లోగా వ్యవసాయ పనులు చేస్తుండేవి. అలసటను సైతం జయిస్తూ రైతుకు వెన్నుదన్నుగా నిలిచాయి. అలాంటి ఒంగోలు జాతికి వ్యవసాయం రంగంలో వచ్చిన యాంత్రీకరణతో రైతుల్లో పూర్తిగా ఆశక్తి తగ్గిపోయింది. భావితరాలు ఒంగోలు జాతి అంటే తెలియక పుస్తకాల్లో చదువుకోవడం తప్ప ఒంగోలు జాతి విశిష్టతను చూడలేరు. కాబట్టి రైతులందరూ మన ఒంగోలు జాతి ఆవులను కాపాడు కోవాలని ఆశిస్తూ...

- డాక్టర్‌.జి.రాంబాబు, పశు వైద్యాధికారి, కడప, ఫోన్‌ : 9618499184, 9494588885