బానోతు రాంబాబు,టీచింగ్ అసోసియేట్,ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ,జింగుర్తి , వికారాబాద్,ఫోన్-8008866517
కూరగాయలలో కలుపు నివారణకు సేంద్రీయ విధానంలో గరళకంఠ కషాయం తయారీ :
గరళకంఠ కషాయం తయారీ విధానం చాలా తేలిక
పర్యావరణానికి చాలా మేలు
కలుపు మొక్కలు అధిక సంఖ్యలో పెరిగి పంటలకు వేసే ఎరువులను వినియోగించుకుని దిగుబడులను గణనీయంగా తగ్గిస్థాయి.కలుపు మొక్కలను తొలగించేందుకు రైతులు అనేక పద్ధతులను అవలంభిస్తున్నారు.వాటిలో సేంద్రియ పద్ధతిలో కలుపును నివారించేందుకు అనువైనది గరళ కంఠ కషాయం.
గరళకంఠ కషాయం తయారీ విధానం , వినియోగం:
కావాల్సిన పదార్థాలు:
1.దేశియ ఆవుపాలు , 1/2లీటరు
2.చక్కెర,100గ్రాములు
3.కలుపు మొక్కల (వివిధ రకాల కలుపు మొక్కలు)బూడిద 100గ్రాములు
తయారీ విధానం :
ముందుగా పొలంలోని అన్ని రకాల కలుపు మొక్కలను సేకరించుకోవాలి.
వాటిని చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పెన్నంపై వేసి మాగబెట్తాలి.
ఆకులు బూడిదైన తర్వాత,లీటర్ బాటిల్ తీసుకుని అందులో 100గ్రా కలుపు బూడిద,అర లీటర్ పాలు,100గ్రా చక్కెర వేసి బాగా కలపాలి.బాటిల్ కు మూతను బిగించి మూడూ రోజులు నిల్వ ఉంచాలి.
ఈ మూడూ రోజులు ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఉండాలి.అలా చేయడం వలన కషాయం తయారవుతుంది.
వాడే విధానం :
తయారైన ద్రావణాన్ని వడగట్టుకోవాలి.
అధికంగా కలుపు ఉన్న చోట అర లీటర్ ద్రావణాన్ని 50-100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కలుపు మొక్కలు సేకరించేటప్పుదు ఏలాంటి ప్రధాన పంట మొక్కలు,ఆకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పొలంలోని అన్ని రకాల కలుపు మొక్కలను సేకరించుకోవాలి.ఎందుకంటే తుంగ గడ్దితో తయారు చేసిన ద్రావణంతో వయ్యారీ భామ చావదు.ఏ గడ్దితో ద్రావణం తయారు చేస్తామో ఆ గడ్దిని మాత్రమే చంపగలుగుతాయి.అందువల్ల పొలంలోని అన్ని రకాల కలుపు మొక్కలను సేకరించుకోవాలి.
కషాయం తయారీ చాలా తేలిక :
గరళ కంఠ కషాయాన్ని రైతులు తయారు చేసుకోవడం చాలా తేలిక.ఎటువంటి పరిఙ్నానం అవసరం లేదు.రైతులు పంట పొలాల్లోని అన్నీ రకాల కలుపు మొక్కలను తీసుకువచ్చి బూడిద చేసి మోతాదులో కలుపుకొని ఆ ద్రావణాన్ని కలుపు మొక్కలపై పిచికారీ చేయాలి.ఇలా చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.ఇందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువ కాబట్టి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.