డిజిటల్ వేదికగా "నోవా" సూపర్ మిత్ర్ ఆవిష్కరణ


రచయిత సమాచారం


▪️నూతన ఒరవడికి "నోవా" శ్రీకారం
▪️రైతులు, డీలర్ల సమక్షంలో మార్కెట్లోకి ప్రోడక్ట్
▪️నోవా ఉత్పత్తులకు _రైతన్నల ప్రశంసల జల్లు

నోవా అగ్రిటెక్ గ్రూప్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సూపర్ మిత్ర్  డిజిటల్ వేదికగా జూమ్ లో ఆవిష్కరణ కన్నుల పండుగగా జరిగింది. గురువారం సాయంత్రం నోవా అగ్రి టెక్ ప్రధాన కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ లో చైర్మన్ ఏలూరి సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్ ఏటుకూరి కిరణ్ కుమార్, మార్కెటింగ్ డైరెక్టర్ యెనిగళ్ళ శ్రీకాంత్ , డైరెక్టర్ బసంత్ , ఫైనాన్స్ హెచ్ ఓ డి కందుల భార్గవి ల చేతుల మీదుగా డీలర్లు, వేలాది మంది  రైతులు సమక్షంలో ఈ నూతన ప్రొడక్ట్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సాంబశివరావు మాట్లాడుతూ రైతును రాజు ను  చేయడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. మిత్ర్ ప్రోడక్ట్ ఆవిష్కరణ రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం నోవా అగ్రి టెక్ అనునిత్యం పనిచేస్తుందన్నారు. రైతులు ఇంట అధిక దిగుబడులు , సిరులు కురిపించేందుకు నోవా నూతన ఉత్పత్తులను రైతులకు అందుబాటులో ఉంచుతుందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ ఏటుకూరు కిరణ్ కుమార్  మాట్లాడుతూ మిత్ర్ లేనిది  వ్యవసాయం లేదనే  మాటను రైతుల నుంచి విన్నానని,ఇది నోవా కు ఎంతో గర్వకారణమన్నారు.రైతన్నల సేవలో నోవా అను నిత్యం పని చేస్తుందన్నారు. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు సూపర్ మిత్ర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అన్ని రకాల పంటలలో అధిక దిగుబడులు పెంచేందుకు నోవా పనిచేస్తుందన్నారు. ఇటీవల రైతుల కోసం అనేక ఉత్పత్తులను అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రూపొందించి మెరుగైన దిగుబడులు సాధించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. పత్తి, వరి ,మిర్చి పంటలో తెగుళ్లు చీడపీడలను నివారణకు ఇటీవల మార్కెట్లోకి తీసుకు వచ్చిన నోవా సూపర్ లావా కాటన్,నోవా సూపర్ లావా చిల్లీ, నోవా సూపర్ ప్యాడి అద్భుత ఫలితాలు సాధించాయన్నారు. నోవా మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీకాంత్  మాట్లాడుతూ నోవా అంటే రైతులకు, డీలర్లకు ఓ నమ్మకం అన్నారు.  నోవా గత 14 ఏళ్లుగా రైతుల కోసం నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. 2009లో నోవా ఆధ్వర్యంలో రూపొందించిన మిత్ర్ రైతన్నలకు వరం లాంటిదన్నారు. మిత్ర్ ను లక్షలాది మంది రైతులు వాడి అధిక దిగుబడులు, లాభాలు పొందారని గుర్తు చేశారు. ఆధునిక పద్ధతులతో సూపర్ మిత్ర్ ను రైతుల కోసం తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో మిత్ర్ కు అందించిన సహకారాన్ని, ప్రోత్సహాన్నిచేతుల కు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కు చెందిన రైతులు,డీలర్లు పాల్గొన్నారు.