నిత్యావసరాలతో అపరాలకు డిమాండ్


రచయిత సమాచారం

డా॥యస్ మధుసూదన్ రెడ్డి, డా॥ వి వెంకన్న, డా|| కె గోపాలకృష్ణమూర్తి, డా. రాంప్రసాద్,  వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట. 


మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడి, ఆదాయం
విత్తనోత్పత్తికి అనుకూలించే అంశాలపై కథనం...

నిత్య అవసరాలలో పప్పుధాన్యాల పాత్ర ఎనలేనిది.. నేటి ఆధునిక కాలంలో వీటికి భలే డిమాండ్ తో పాటు ప్రాముఖ్యత  చాలా పెరిగింది. గతంలో వాణిజ్య పంటల సాగు మీద ఆసక్తితో రైతులు అపరాల పంటల సాగు విస్మరించారు. దీనికి తోడుగా వాతావరణ పరిస్థితులు వానాకాలం సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు , మేలైన  వంగడాల లోపం, పంట గిట్టుబాటు ధరలు నిర్దిష్టంగా లేకపోవడం, ఈ అపరాల దిగుబడి, సాగు విస్తీర్ణము గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఇలా విపత్కర పరిస్తితులలో అపరాల విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తాజాగా ప్రజలు అపరాల కోసం ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. 

ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలంలో వేసుకోదగిన పంటల విషయానికొస్తే ఈ అపరాలనే చెప్పుకోవాలి. పెసర, మినుము, కందిని మూడు కాలాల్లో  వేసుకోవచ్చు. పప్పు శనగ, సోయాబీన్, రబీ,మరియు వేసంగీ  సమయాలలో అధికంగా చేసుకోవచ్చు. వీటితో పాటుగా బొబ్బర్లు, ఉలవలు, బిన్స్ పలు అపరాల జాతులను సాగు చేసుకోవచ్చు.                              

విత్తనోత్పత్తికి అనుకూలించే కీలక అంశాలు :    
వాతావరణం, పంటవేయు ప్రదేశం:
రైతులు ఎంపిక చేసుకునే విత్తన తరగతి , రకం లేదా ఆయా మేలైన రకాలు అక్కడున్న వేయవలసిన  వాతావరణ పరిస్థితులు అనుకూలమైనవిగా చూసుకోవాలి. అధిక వర్షపాతం మంచు, ఉష్ణోగ్రత మరియు అర్ధతలు  విత్తనాభివృద్ధికి అనుకూలించవు. కావున తక్కువ తేమతో కూడిన చల్లని వాతావరణం రబీ సమయంలో ఉంటుంది. కాబట్టి రబీ సమయం అపరాల విత్తనోత్పత్తికి ఆశాజనకంగా ఉంటుంది. మరుగు నీరు సదుపాయం గల మంచి తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి.  విత్తనోత్పత్తికి ఎంపిక  చేసిన పొలం చదునుగా ఉంచుకుని క్రితం పంట నుంచి వచ్చిన కలుపు, ఇతర పంట మొక్కలు లేకుండా చూడాలి. అదే పంట/ రకం ఇంతకు ముందు  సీజన్ లో  విత్తనోత్పత్తికి ప్రస్తుతం చేస్తున్న మడిలో పండించి ఉండకూడదు.

వేర్పాటు దూరము:
అపరాలలో విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఈ వేర్పాటు దూరము ఖచ్చితంగా పాటించుకోవాలి. అపరాలకి చాలా స్వల్ప దూరము అవసరం ఉంటుంది.  పెసర మరియు మినుముల రకల విత్తనోత్పత్తికి రైతు స్థాయిలో 5  మీటర్లు దూరం పాటించుకోవాలి. అదే విధంగా పప్పశనగ రకాల విత్తనోత్పత్తికి రైతు స్థాయిలో  5 మీ పాటించుకోవాలి. అలా కాకుండా పునాది విత్తన రకాలకైతే 10 మీటర్లు " వేర్పాటు దూరము పాలించాలి. ఈ విధంగా చేయడం నాణ్యమైన విత్తనం, కల్తీలు లేకుండా చూసువాలి.        

విత్తన రకాలు:  
పెసర, మినుము, పప్పు శనగ, సోయాబీన్ లాంటి అపరాల రకాలు మేలైనవిగా  రూపొందించబడి ఉన్నాయి. కావున ప్రాంతీయ వ్యవసాయ, పరిశోధన స్థానాలు  కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ సలహా కేంద్రాలు మరియు విత్తన అధికృత సంస్థలలో లభ్యమవుతాయి. సమయాన్ని బట్టి, వాతవరణాన్ని, చీడపీడలు తెగుళ్ళు మరియు అవరొధాకాలను దృష్టిలో ఉంచుకుని రకాలను ఎంపిక చేసుకొని విత్తనోత్పత్తి చేపట్టాల్సిన అవసరం ఉంది.

విత్తే సమయం :
ఈ అపరాలను ప్రత్యేకించి రబీ  సమయంలో లేదా చలి తీవ్రత తగ్గుముఖం పట్టాక  వేసవి కాలానికి ముందు జనవరి చివరి వారం, ఫిబ్రవరి  పూర్తి మాసాలలో వేసుకుని సాగు చేసినట్లయితే నాణ్యత విత్తనాన్ని 'పొందవచ్చు. నీటియాజమాన్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వేసవి పగటి ఉష్ణోగ్రతల తీవ్రతలు ఎక్కువగా ఉండి విత్తనాన్ని గట్టిపరచకుండా తాలుగా లేదా పీలగా మారుతాయి. కావున ఆయా సమయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలి.                      

విత్తన మోతాదు :
పెసలు 5కి /ఎకరాకు ,వరి మాగాణాల్లో చేపట్టినట్లయితే 12-15 కిలోలు ఎకరానికి అవసరమవుతాయి. మినుములు 6కి/ ఎకరాకు వరి మాగాణాల్లో  చేపట్టినట్లయితే 15-18 కిలోలు ఎకరానికి అవసరం అవుతుంది. పప్పుశనగలలో  విత్తన మోతాదు రకం ,గింజ బరువు, మరియు పరిమణంపై  ఆధారపడి ఉంటుంది. చిన్న విత్తనాలైతే ఎకరానికి 20-24 కిలోలు, మధ్యస్థం విత్తనాలైతే ఎకరానికి 24-36 కిలోలు, పెద్ద విత్తనాలైతే ఎకరానికి 36- 48కిలోలు అవసరమవుతాయి. 

ప్రమాణాలు.   పునాది విత్తనం ధ్రువీకరణ విత్తనం
ఆఫ్  టైప్స్ 0.10 0.20
విత్తనం ద్వారా సంక్రమించు తెగులు మొక్కలు 0.10 0.20

కల్తీల ఏరివేత:
అపరాల పంటకాలం పరిమితి  చాలా తక్కువగా ఉంటుంది. కావునా త్వరితగతిన క్షేత్రాన్ని పరిశీలించుకోవాలి. మొదటగా శాఖీయదశ, ప్రత్యుత్పత్తి  దశలలో కల్తీలు ఏరివేయాలి. ఆకులరంగు, మొక్క పరిమాణం, కాయ రంగు, కాయపై నూగు, విత్తన రంగు ఆధారంగా కల్తీలను ఏరివేయాలి. ప్రస్తుత సమయాల్లో చలి తీవ్రత వల్ల శీలింధ్రాలు మరియు వెరస్ తెగలు అధికంగా కనిపిస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తీసివేయాలి. దీని వలన విత్తనాల నాణ్యతతో పాటుగా స్వచ్ఛతను కూడా కాపాడుకోవచ్చు. 

పొలం  ప్రమాణాలు (విరప, మినుము మరియు పప్పు శనగ) :
 క్షేత్ర తనిఖీలు విత్తన " అధికారులు లేదా రైతు స్వయంగా పండిస్తే రైతులు పంట కాలాన్ని బట్టి తప్పని సరిగా మూడు సార్లు కల్తీలు ఏరివేతని  చేపట్టాల్సిఉంది. శాఖియ దశ, పూత దశ, మరియు కోత దశ అవసరాన్ని బట్టి కోతల అనంతరం అపరాల విత్తనోత్పత్తి చేస్తునప్పుడు ఇబ్బందికరమైన అంశం  పంట క్షేత్రంలో ఉన్నప్పుడే కాయలు విచ్చుకొని విత్తనాలు రాలి పోతాయి. దాని వలన దిగుబడి తగ్గుతాయి. అదే విధంగా  ఒక సారి పూతకు రాకపోవడం వలన  కోతలు  ఆలస్యమవుతుంటాయి. కావున ప్రత్యేకంగా పరిస్థితులు అవగాహన " చేసుకొని సాగు యాజమాన్యం చేపట్టాలి. వీటితో పాటుగా సాంకేతిక పరిజ్ఞానం కూడ రైతులు తెలుసుకోవాలి. అంటే యాజమాన్య పద్ధతులు, కలుపు, ఎరువులు, సూక్ష్మ పోషకాలు, నీటి యాజమాన్య పద్ధతులు, పాటిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వలన క్షేత్ర ప్రమాణాలు అదుపులో ఉంటాయి. పరిమితికి తగ్గట్టుగా ఉంటాయి. దీనివల్ల కోతల తరువాత విత్తన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి.ఈ విధంగా సాగు యాజమాన్య  పద్ధతులతో పాటుగా సాంకేతిక సలహాలు, సూచనలు పాటించినట్లతే  అధిక దిగుబడులతో పాటుగా నాణ్యమైన విత్తనాలు రూపొందించవచ్చు.  తద్వారా ఆదాయంతో పాటు విత్తన కొరత సమస్యను అధిగమించవచ్చు.