కూరగాయల చెత్త వృధా కాదిక


రచయిత సమాచారం

రుద్ర వినాయక్ (ఎం.ఎస్ సి హార్టి) డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ డి దివ్య భారతి (ఎం.ఎస్ సి హార్టి)ఎన్ జాన్సన్ (ఎం.ఎస్ సి హార్టి) శ్రీ కొండా లక్ష్మన్ తెలంగాణ స్టేట్ హార్టికల్చురల్ విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట్ జిల్లా


ప్రస్తుత కాలంలో అనేక పట్టణ పరిసరాలలో కూరగాయలను వినియోగించిన తర్వా ఏర్పడే వ్యర్ధాల పరిమాణం రోజురోజుకు పెరుగుతూ ఉంది.

పట్టణాల్లో నివసించే ఒక వ్యక్తి సగటున రోజుకు 700 గ్రా అంటె ఏడాదికి 250 కేజిల కూరగాయలు వ్యర్ధాలను ఉత్పత్తి చేస్తున్నాడు. వ్యర్ధాలు పర్యావరణంలో కలవడం  వల్ల పర్యావరణ కాలుష్యం జరిగి మనుష్యుల ఆరోగ్యం  దెబ్బతింటుంది. ఇటువంటి వ్యర్దాలను సరైన రీతిలో ఉపయోగించి, మన పరిసరాలలో పెంచుకునే మొక్కలకు కావలసిన ఎరువులను సులభమైన పద్దతిలో మనమే తయారు చేసుకొవచ్చు.

ఎరువు తయరీకి కావల్సిన ముడి పదార్ధాలు 

1.కార్బన్ : ఇది ఎండిపోయిన కూరగాయలు, పేపర్ మరియు రంపపు పొట్టు నుండి లభిస్తుంది.

2.నత్రజని :పండ్లు మరియు కూరగాయలు వ్యర్ధాల నుండి లభిస్తుంది.

3.ఆక్సిజన్ : గాలి నుండి లభిస్తుంది.

4.నీరు 

5.1/3  వంతు తడి వ్యర్దాలు మరియు 2/3 వంతు పొడి వ్యర్ధాలు .

తర్వాత కూరగయాలు వ్యర్దాలు మరియు పండ్ల తొక్కలను సేకరించాలి.

 ర్వా  పొడి వ్యర్ధాలు అంటె ఎండిన ఆకులు,రంపపు పొట్టు

ఎండుగడ్డిని సేకరించి పెట్టుకోవాలి .

మొదట  తొట్టి లేదా బకెట్లో అడుగు భాగంలొ కొంత మట్టిని వేయాలి .

 ర్వా  కూరగాయలు వ్యర్దాలు మరుయు పొడి వ్యర్దాలను ఒక దాని తర్వాత ఒకటి పొరలుగా నింపుకోవాలి

 తొట్టిని అలా నింపిన తర్వాత దానిని ప్లాస్టిక్ కవర్ తో లేదా అట్టతో మూసివేయాలి .మూసివేసే ముందు  తొట్టిలో నీటిని పిచికారి చేయాలి . అలా తొట్టిని మూసివెయడం వలన తేమ తగినంత ఉంటుంది మరియు తొట్టిలొ వేడిగా ఉంటుంది.

 

ప్రతి ఒకటి , రెండు రోజులకు ఒకసారి తొట్టిలో ఉన్న మిశ్రమాన్ని తిరిగవేయాలి. తేమ తక్కువగ ఉన్నట్లయితే కొంత నీటిని పిచికారి చేయాలి

సుమారుగా 50 నుండి 80 రోజూల్లో మనకి కావలసిన నల్లని మట్టివాసనతో కూడిన పొడిగా ఉండే కంపోస్ట్ ఎరువు తయారవుతుంది

 

కంపొస్ట్ ఎరువు తయారీలో వాడకూడని పదార్ధాలు :

కంపొస్ట్ ఎరువు తయారీలో మాంసం ,ఎముకలు , చేప వ్యర్ధాలు వాడకూడదు .దీనివల్ల చీడలు ఆశించి కంపొస్ట్ ఎరువు తయారవకుండా చేస్తాయి.

బహువార్షిక కలుపు మొక్కలను మరియు వ్యాధి సోకిన మొక్కల వ్యర్థాలను వాడకూడదు.
 పెంపుడు జంతువుల వ్యర్దాలను వాడకూడదు

సిట్రస్ (నిమ్మ ) జాతి పండ్ల తొక్కలను కంపొస్ట్ ఎరువు తయారీలో వాడకూడదు.