విత్తన నాణ్యత - గుణగణాలు


రచయిత సమాచారం

ఎ .శ్రీరాం శాస్త్రవేత్త రిసేర్చ్ స్టేషన్ -మధిర


విత్తనం వ్యవసాయ రంగానికి మూలధారం పంట యొక్క దిగుబడి విత్తనం యొక్క నాణ్యత మీదే ఆదారపడుతుంది. విత్తనం అనునది లైంగిక ప్రత్యుత్పత్తి లో  ఫలదీకరణం చెందిన పరిపక్వ అండం. ఒక విత్తనంలో పిండము , నిల్వ ఆహరపదార్థాలు మరియు వాటిని సం రక్షించే విత్తన కవచాలు ఉంటాయి. 
 
విత్తన చట్టం (1966) ప్రకారం 
ఆహరధాన్యాల విత్తనాలు (నూనెగింజలు ,ఫలాలు మరియు కూరగాయలు )
1) ప్రత్తి విత్తనాలు 
2)పశుగ్రాస విత్తనాలు 
3) జనుమ విత్తనాలు 
4) నారు ,దుంపలు ,కొమ్ము వేర్లు ,చేధనాలు ,శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడేది ఏదైనా విత్తనంగానే  పరిగణించడం జరుగుతుంది 
విత్తన నాణ్యత ప్రాధాన్యత :
1)విత్తన నాణ్యత పంట యొక్క జన్యు మరియు బాహ్య స్వచ్చతను కాపాడుతుంది.
2)విత్తనం యొక్క నాణ్యత అధికంగా ఉండే మొలక శాతం అధికంగా ఉండి ,సాంద్రత పెరుగుతుంది 
3) నాణ్యమైన విత్తనం అననుకూల పరిస్థితులలో కూడా మొలకెత్తుతుంది 
4) నాణ్యమైన విత్తనం మొలకెత్తి తేజోవంతమైన దృడమైన ,తర్వాత వృద్ది చెంది మొలకలను ఇస్తాయి 
5)నాణ్యమైన విత్తనం ద్వారా ఏకారీతి వృద్ది మరియు పక్వతను పొందవచ్చు.
6)నాణ్యత అధికమగా ఉండే వేరు వ్యవస్థ వృద్ది చెంది పోషకాలశోషణ సామర్థ్యాన్ని పెంచి అధీక దిగుబడి ఇస్తాయి .
7)నాణ్యమైన విత్తనం ఎరువులను .రసాయనాలను అనుకూలంగా స్పందించి అధిక దిగుబడి దోహదపడుతుంది


విత్తన నాణ్యత - లక్షణాలు :

 బాహ్య స్వచ్చత :విత్తనాలలో ఎటువంటి చెత్త పదార్థం,దుమ్ము ,మొక్క ,అవశేషాలు ,లెకుండా ఉండాలి.
అధిక బాహ్య స్వచ్చతను కలిగిన విత్తనం ,రంగు,రూపు పరిమణం ఓకే రకంగా ఉంటాయి. అన్ని పంటలకు బాహ్య స్వచ్చత 98 % గా ఉంటుంది .
జన్యు స్వచ్చత :
నాణ్యమైన విత్తనంకు జన్యు స్వచ్చత అధికంగా ఉండాలి ప్రజనన కారుని విత్తనం -100 % 
                    పునాది విత్తనం -99.5 %
                    దృవికరింపబడిన విత్తనం - 99.5 % 
శరీర ధర్మ లక్షణాలు :
విత్తన నాణ్యతను శరీర ధర్మ లక్షణాలు కుడా ప్రభావితం చేస్తాయి . మొలక శాతం . విత్తన జీవం మరియు విత్తన సామర్థ్యం అధికంగా ఉన్నటువంటి విత్తనాలను నాణ్యమైన విత్తనాలుగా పరిగణిస్తారు 
సరియైన  మొలక శాతం ,విత్తనం జీవం మరియు సామర్త్యం ఉన్నపుడు విత్తనం అననుకూల పరిస్థితులలో కుడా మొలకెత్తుతుంది 
విత్తన ఆరోగ్యం :

విత్తనం పై ఎటువంటి నష్టం కీటకాల చేత గాని తెగుళ్ళు చేత కాని లేనపుడు విత్తనం తన జీవక్రియలను సరిగా జరుపుకొని . మొలకెత్తి వృద్ది చెందుతుంది విత్తన ఆరోగ్యం నాణ్యతను పెంచుతుంది .
ఇతర పంటల రకాలు లేకుండా చుడాలి :
విడదీయుటకు కష్టంగా ఉన్న పంట విత్తనాలు విత్తిన పంటతో కలిసి ఉండటం ,ఒకేసారి పక్వానికి రావడం వల్ల వాటిని యాంత్రికంగా వేరు చేయుట లాభధాయకం అధ్యంతరకం కలుపు విత్తనాలు లేకుండా చూడాలి :

1)కలుపు విత్తనాలు ఉన్నట్లయితే వేరు చేయుట కష్టం .అన్ని విషయాలలో ప్రధాన పంటతో పోటి పడి , దిగుబడిని తగ్గిస్తాయి .
2)తెగుళ్ళు కి మరియు కీటకాలకు ప్రధాన పంట అందుబాటులో లేనపుడు కలుపు మొక్కలు ప్రత్యామ్నాయ  ఆవాసాలుగా ఉంటాయి .
ఉదా: బెర్సిం లో చికోరి 
       వరిలో (వన్యజాతి వరి)
      గోదుమ (కన్వాబ్వలస్ అరవెనిస్)
 గుర్తించబడిన తెగుళ్ళు లేకుండా ఉండాలి 
    ఉదా : గోదుమలో -వదులు కాటుక తెగుళ్ళు  
           జొన్న-గింజ కాటుక తెగుళ్ళు  
          ఆవాలు -ఆల్టర్ నెరియా ఆకుమచ్చ తెగుళ్ళు  
ఎక్కువకాలం నిల్వ ఉండే గుణం ,విత్తన బరువు ,నిండుతనం,  మంచి రంగు , ఆకారం ,పరిమాణం ,మొదలగు లక్షణాలు కూడా విత్తన నాణ్యాతను ప్రభావితం చేస్తాయి .