విత్తన నాణ్యతకు మెరుగైన మేలైన నిల్వ పద్దతులు


రచయిత సమాచారం

స్వప్న నాగూరి,డా.జి ఈశ్వర రెడ్డి,జి.రాకేష్,బి.ప్రవీణ్ కుమార్,శ్రీ దినేశ్ కుమార్,వై.స్వాతి.ప్రాంతీయ చెఱకు మరియు వరి పరిశోధన స్థానం-రుద్రూరు.


విత్తు కొద్దీ పంట అన్న నానుడి వ్యవసాయంలో మంచి నాణ్యత కలిగిన విత్తనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది.విత్తనోత్పత్తి తర్వాత తయారైన విత్తనాన్ని మనము తదుపరి పంట కాలం వరకు నిల్వ చేసుకోవలసి ఉంటుంది.అంతేకాదు మనము తయారు చేసుకున్న విత్తనానికి గిట్టుబాటు ధర లెనప్పుడు లేదా అదే సీజనులో అమ్మలేకపొయినప్పుడు దాన్ని తదుపరి సీజను వరకు నాణ్యతా ప్రమణాలు చెడకుండా నిలువ ఉంచాలంటే మంచి నిల్వ పద్దతులను ఆచరించాలి.కాబట్టి విత్తనాన్ని సమర్ధవంతంగా నిల్వ ఉంచాలంటే ఈ క్రింది సూచలను అనుసరించాలి.

  • నిల్వ ఉంచే ప్రదేశం చల్లగా,పొడిగా ఉండాలి.

  • నిలువ గోదాములలో చీడపీడలు ఆశించకుండా సస్యరక్షణ ఆచరించాలి.

  • నిలువ చేసే ముందు విత్తనాన్ని పంటను బట్టి అమోదయోగ్యమైన తేమశాతానికి తీసుకురావాలి.

  • నిల్వ చేసే విత్తనాన్ని బాగా శుభ్రం చేసి విత్తన శుద్ది చేసుకోవాలి.

విత్తనం మొలకెత్తే శక్తిని నిలుపుకోగల కాలాన్ని(జీవిత కాలాన్ని)విత్తనం లోని తేమ శాతం,గాలిలోని తేమ శాతం,వాతావరణ ఉష్ణోగ్రత,విత్తనాన్ని ఆశించు క్రిమి కీటకాలు ప్రభావితం చేస్తాయి.
విత్తనం యొక్క జీవీత కాలానికి,వాతావరణలోని తేమ శాతానికి సంబందం ఉంది.అధిక తేమ శాతం ఉన్న విత్తనాలలో జీవ ప్రక్రియ బాగా జరగడం మూలాన అధిక వేడి జనించి విత్తనం చనిపెవడమే కాకుండా శిలీంద్రాలు,కీటకాలు వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉంది.కాబట్టి విత్తనాలలో 8-9 శాతం వరకు తేమ ఉండేఅలా ఆరబెట్టి నిల్వ చేసుకుంటే విత్తనం యొక్క నిల్వ కాలం ఎక్కువగా ఉంటుంది.
విత్తనం ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే విత్తనం నిలువ చేసే ప్రాంతాల ఉష్ణోగ్రత,గాలిలో తేమశాతం అనువుగా ఉండాలి.నిల్వ గోదాముల్లో ఉష్ణోగ్రతలను,గాలిలోని తేమ శాతన్ని నియంత్రించి విత్తనం ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూడవచ్చు.సాధారణ నిల్వ గోదాముల్లో ఉష్ణోగ్రతలు 
 65 ఫారన్ హీట్స్ మించకుండా జగ్రతవహిస్తూ గాలిలోని తేమను 50-55 శాతం దగ్గర నియంత్రించినప్పుడు విత్తనం యొక్క నిలవ కాలాన్ని 19-21 మాసాల వరకు పొడిగించవచ్చును.అదే విత్తన కాలాన్ని మూడు సంవత్సరాల వరకు పొడిగించాలంటే గోదాముల ఉష్ణోగ్రత 40ఫారన్ హీట్స్ మరియు గాలిలోని తేమ 60 శాతం ఉండేలా చూడాలి.
విత్తన గోదముల్లో విత్తనాలను ఆశించే వివిధ కీటకాలు,శిలీంద్రాలు,బాక్టీరియా,ఎలుకలు మరియు పక్షులు ముఖ్య అవరోధాలు.ఈ చీడపీడల ఉధృతి విత్తనాల గోదాముల్లో ఉండే ఉష్ణోగ్రత వాతావరణంలో తేమ శాతంపై అదారపడి ఉంటుంది.గోదాముల్లో తేమ శాతం 30-95%,27-37 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కీటకాలు బాగా వృద్ది చెంది నష్టం కలుగజేస్తాయి.గొదాముల్లో ఉష్ణోగ్రత 26-28 సెంటీగ్రేడ్,గాలిలో తేమ 91-100% ఉన్నప్పుడు బాక్టీరియా త్వరగా వ్యాప్తి చెంది నష్టం చేకూరుస్తాయి. శిలీంధ్ర వ్యాప్తికి ఉష్ణోగ్రత 25-40 సెంటీగ్రేడ్,గాలిలో తేమ 60-100% అనుకూలం.కాబట్టి విత్తనాన్ని నిలువ చేసే  గోదాముల్లో ఉష్ణోగ్రత తక్కువగా(20 సెంటీగ్రేడ్ ల కంటే తక్కువ)ఉంచడం ద్వారా విత్తనాలను చీడపీడల బారిన పడకుండా కాపాడవచ్చును.వీటిని నివారించుటకు గోదాముల్లో కాంక్రీటు చష్టా ఉండ్నట్లు చూసుకోవడం,నిల్వ ఉంచే సంచులను చెక్క బల్లలపై ఉంచడం ద్వారా క్రింద వరుసలలోని విత్తనాలు త్వరగా చెడిపోకుండా కాపాడగలము.
విత్తన నిల్వలో పాటించవలసిన జాగ్రత్తలు:
విత్తన నిల్వ గోదాముల్లో విత్తనాలతో పాటు,క్రిమి సం హారక మందులు,ఎరువులు నిల్వచేయకూడదు.
నిల్వ గోదాముల్లో ఎల్లప్పుడు పొడి,చల్లని వాతావరణం ఉండునట్లు జాగ్రత్త పాటించాలి.
విత్తనాన్ని నిల్వ చేసే ముందు గోదామును శుభ్రపరచి మందుసీజను విత్తనాన్ని ఊడ్చి,గోడలపై,నేలపై ఉండే నెర్రెలను పూడ్చివేయాలి.విత్తన సంచులపై గోదాముల గోడలపై మలాథియాన్ 50%ఇ.సి ప్రతి 100 చ.మీ స్థలానికి 3 మీటర్లు చొప్పున పిచికారి చేయాలి.
పాత గోనే సంచులను ఉపయోగిస్తే వాటిని ముందుగా అల్యూమినియం పాస్ఫైడ్ తో ఊదర పెట్టాలి.
కీటకాలు ఎక్కువగా ఆశించే అపరాల విత్తనాలను వేరుగా నిల్వచేయాలి.
ఎల్లప్పుడు విత్తన సంచులను చెక్కలపై వరుస మార్చి వరుస అటు ఇటు పేర్చాలి.ఇందువలన అన్ని సంచులకు గాలి బాగా తగులుతుంది.ఎట్టి పరిస్థితులలోను సంచులు 6-8 మించి ఉండరాదు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి సంచులను గోదాముల్లో అటూ ఇటూ వాటి వరుస క్రమం మార్చాలి.
సంచులను పేర్చే క్రమంలో సంచుల వరుస పొడవు,వెడల్పు 30 మరియు 20అడుగులు మించకుండా జాగ్రత్త వహిస్తే ఊదర పెట్టుటకు మంచి సౌలభ్యం.మంచి ఫలితం ఉంటుంది.
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గోదాములను నిశితంగా పరిశీలించి అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలి.