వేసవిలో చెఱకు సంరక్షణ


రచయిత సమాచారం

యమ్.స్వప్న.డా.ఈశ్వర రెడ్డి,జి.రాకేశ్,శ్రీమతి వై స్వాతి,శ్రీమతి సహన,పి.జలంధర్ నాయక్,వరి పరిశోధన స్థానం-రుద్రూరు.


చెఱకులో పిలకలు వేసే దశ (4 నెలల వరకు)నీటి వినియోగపు విషయంలో అత్యంత సున్నిత దశ.ఈ సమయంలో నీటి ఎద్దడి(బెట్ట)ఏర్పడితే పిలకల సంఖ్య తగ్గి దిగుబడి తగ్గుతుంది.బెట్టకు గురైన తోటలలో లక్క(మైట్స్)మరియుపీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.కావున చెఱకు తోటలలో మొదటి నాలుగు నెలలో(ముఖ్యంగా వేసవిలో)నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలి.
చెఱకు చెత్త వినియోగం:
ఎకరాకు 1.25 టన్నుల చెఱకు చెత్తను సాళ్ళ మధ్య కప్పాలి.దీని వలన నేలలో తేమ తొందరగా ఆవిరి కాదు.కావున నీటి తడుల మధ్య వ్యవధి పెంచుకోవచ్చును చెత్త కప్పుట వలన కలుపు మరియు పీకపురుగు ఉధృతి తగ్గుతుంది.చెఱకు చెత్త కుళ్ళిన తర్వాత మంచి సేంద్రీయ ఎరువుగా మారి,భూ భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది.తద్వారా భూమికి నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది.
యూరియా మరియు పొటాష్ పిచికారి :
వేసవిలో చెత్త వినియోగం వలన మొక్కలు ఆశించినంత మోతాదులో నీటిని,పెషకాలను వేర్ల ద్వారా పీల్చుకోలేవు.కావున పోషకాలను ముఖ్యంగా యూరియా,పొటాష్ లను ఆకుల ద్వారా అందించాలి.లీటరు నీటికి 25గ్రాముల యూరియా,25గ్రా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి రెండు వారాల వ్యవధిలో అవ్సరన్ని బట్టి రెండు మూడు సార్లు పిచికారి చేయాలి.తద్వారా ఆకులు యూరియా మరియు పొటాష్ లను పీల్చుకొని బెట్ట నుండి రక్షణ పొందుతాయి.ఈ ఎరువులూ ధ్రావణాన్ని చల్లని వేళల్లో(ఉదయం/సాయంత్రం)పంటమీద పిచికారి చేయాలి.
సమర్ధ నీటి వినియోగం:
నీటి వనరులు తక్కువగా ఉంటే.తక్కువ నీటితో ఎక్కువ పొలం పారించే పద్దతులను ఆచరించాలి.బోఅద విడిచి బోదెకు నీళ్ళు పెట్టాలి.జంట సాళ్ళ పద్దతిలో జంటల మధ్య మాత్రమే నీరు పారించాలి.బిందు సేధ్య పద్దతి పాటిస్తే,తక్కువ నీటితో ఎక్కువ పొలం తడపవచ్చును.ఎరువులను సమర్ధవంతంగా వినియోగించవచ్చును.కలుపు సమస్య ఉండదు.తద్వార పంటపై వేసవి ప్రభావం ఉండదు.
కలుపు నివారణ:
చెఱకు మొక్కలకన్నా,కలుపు మొక్కల నీటి వినియోగం అధికంగా ఉంటుంది.కలుపు అధికంగా ఉనంట్లైతే చెఱకు పంటకు నీరు అందకుండా,బెట్టకు గిరి అవుతుంది.పెరుగుదలకుంటు పడుతుంది.కావున వేసవి వచ్చేసరికి కలుపు నివారణ చేపట్టాలి.40-50రోజుల వ్యవధిలో అవ్సరాన్ని బట్టి 2-3సార్లు గొర్రుతో లేదా దంతతో అంతరకృషి చేయాలి లేదా ఎకరానికి 1500మి.లీ ,2,4డి ఇథైల్ ఎస్టర్ 38%ఇ.సి పిచికారి చేసుకోవాలి.తోట నాటిన 60రోజుల వ్యవధిలో వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 1300గ్రా.ల 2,4 డి సోడియం సాల్ట్ 80%డబ్ల్యూ.పి లేదా 12గ్రా మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ 20%మందును చెఱకు ఆకులపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారి చేయాలి.
చీడపీడల నివారణ:
ఎండాకాలంలో చెఱకు పొలంలో ప్రధానంగా పీకపురుగు,ఎర్రనల్లి ఆశిస్తాయి.
వాటి నివారణ తక్షణమే చేపట్టాలి.పీకపురుగు నివారణకు ఆశించిన మొక్కలను వాడిపోయిన పి9ఇకను తీసివేయాలి.మోనోక్రొటోఫాస్ 1.6మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
చెఱకు  సాగులో ఈ క్రింది ముందు జాగ్రత్త చర్యల వలన,వేసవిలో చెఱకు పంట బెట్టకు గురికాకుండా చూసుకోవచ్చును.

  • సేంద్రీయ ఎరువులు(10ట/ఎ)వాడటం.

  • లోతు దుక్కి చేయుట.

  • సకాలంలో చెఱకు మొక్కల నాట్లు పూర్తి చేయుట.

  • బెట్టను తట్టుకునే రకాలను సాగు చేయుట.

  • ముచ్చెలను 10శాతం నీటిలో అరగంట సేపు ముంచి నాటుట .

  • భాస్వరం ఎరువులను సిఫారసు చేసిన మోతాదులో దుక్కిలో వేయుట.

  • వేసవి ముందు ఇచ్చే తడిలో పోటాష్ ఎరువులు వేయుట.

  • బిందు సేద్యం పాటించుట.

  • మోడెం పంటకై,దుబ్బులను నేల మట్టానికి నరకటం.

  • చీడపీడలు రాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం.

ఈ విధంగా జాగ్రత్తలు పాటించినట్లైతే వేసవిని అధిగమించి మంచి దిగిబడులు పొందవచ్చును.