కందిలో మారుకా మచ్చల పురుగు - సస్యరక్షణ 


రచయిత సమాచారం

శ్రీమతి ఫాతిమా, డా జి. పద్మజ, శ్రీమతి సి.హెచ్. పల్లవి, డా. సంధ్యకిశోర్ మరియు డా. పి. జగన్ మోహాన్ రావు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము - వరంగల్.


తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పంటలలో ముఖ్యమైనది కంది. ఈ పంటను సుమారు 2.75 ల.హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పంటను మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పంట మొగ్గ దశ నుండి పూత దశలలో ఉంది. అయితే తేమ సున్నిత దశలలో కంది పంటను చీడపీడలు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. 
ముఖ్యంగా పూతదశలలో మేఘావృతమైనపుడు .పొగమంచు మరియు చిరుజల్లులు కురిసినప్పుడు వీటి ఉధృతి అధికమయ్యే అవకాశం కలదు. కావున మారుకా మచ్చల పురుగు ఆశించినప్పుడు లక్షణాలను గమనిచినట్లైయితే  తల్లి రెక్కల పురుగు కోడి గుడ్డు ఆకారంలో పసుపు పచ్చని గుడ్లని పూమొగ్గలు, లేత ఆకులు, పిందెలపై పెడుతుంది. గుడ్ల నుండి బయటకు వచ్చిన లార్వాలు ఆకుల్ని, పువ్వుల్ని, కాయల్ని, గూడుగా చేసి లోపల ఉండి , మొగ్గలు, పూలు, కాయల్ని తొలచి తింటుంది. తొలచిన కాయ రంధ్రం వద్ద లార్వా విసర్జితములు కనిపిస్తాయి.

మారుకా మచ్చల పురుగు నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు:
1) మారుకా మచ్చల పురుగు గుడ్ల తొలిదశ లార్వాలను గమనించిన వెంటనే వేపనూనె 5 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
2) క్లోరిఫైరిఫాస్ మి.లీ. + డైక్లొరోఫాస్ 1 మి.లీ. లేదా ప్రోపినోఫాస్ 20 మి.లీ. లేదా నొవాల్యురాన్ 0.75 మి.లీ. +డైక్లొరోఫాస్ 1 మి.లీ.ను గాని లీటరునీటికి కలిపి పిచికారి చేయాలి.
3) పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోలొ 0.3 మి.లీ. లేదా ఫ్లుబెండమైడ్ 0.2 మి.లీ. గాని లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి .
4) పురుగు మందులను ఉదయం గానీ, సాయంత్రం గానీ పిచికారి చేస్తే వాటి వినియోగ సామర్ధ్యం అధికంగా ఉండును. 
ఈ విధంగా కందిలో సస్యరక్షణ చర్యలు పాటిస్తే మారుకా మచ్చల పురుగును సమర్ధవంతంగా నిర్మూలించవచ్చు.