సమగ్ర సస్యరక్షణలో పరాన్న జీవుల (పార సైటాయిడ్స్) ప్రాముఖ్యత 


రచయిత సమాచారం

ఈడ్పుగంటి శ్రీలత, జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 9010327879.


పార సైటాయిడ్ అనగా పరాన్నజీవి.  దాని జీవితంలో గణనీయమైన సమయాన్ని ఒక హోస్ట్ తో అనుసంధానించబడి చివరికి ఆ హోస్టు చంపడంతో ఆ సంబంధం ముగుస్తుంది. ప్రతి పరాన్నజీవికి తప్పనిసరిగా ఒక ఆథిద్యాన్ని ఇచ్చే హోస్ట్ అవసరం. హోస్టను చంపిన తరువాత అభివృద్ధి చెందిన అడల్ట్ పరాన్నజీవి స్వేచ్చగా జీవించి దీని యొక్క ఆడపురుగు హోస్ట్ మొక్క గుడ్లు లేదా పిల్ల పురుగుల లేదా కోశస్థ దశ లేదా అడల్ట్ పై వాటి యొక్క గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు ఆయా హోస్టపై పరాన్న జీవితం గడిపి హోస్టు చంపి స్వేచ్చా జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఈ స్వేచ్చా జీవితంలో మొక్కల పువ్వుల్లో ఉండే మకరందాన్ని, పుప్పొడిని ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ పరాన్న జీవికి కూడా ఇతర పురుగుల వలె జీవిత చక్రంలో 4 దశలు ఉంటాయి. 1) గుడ్డ దశ, 2) పిల్ల పురుగు, 3) కోశస్థ దశ మరియు 4) తల్లి పురుగు దశ అనగా రెక్కల పురుగు దశ. 
హోస్ట్ అనగా ఈ పారసైటాయిడకు ఆశ్రయం ఇచ్చి వాటి పిల్లలకు ఆహారంగా ఉపయోగపడే పురుగులు ఈ హోస్టు మనకు శత్రు పురుగులు ఎందుకనగా ఇవి పంటను ఆశించే చీడ పురుగులు చాలా వరకు ఈ పరాన్న జీవుల పిల్ల దశలు హోను అంటి పెట్టుకుని ఉండి హోస్టనుంచి ఆహారాన్ని స్వీకరించి దానిని తుద ముట్టిస్తాయి. వీటియొక్క రెక్కల పురుగు తల్లి పురుగు దశలు స్వేచ్చగా జీవిస్తూ చిన్న చిన్న పూల నుంచి మకరందాన్ని, పుప్పొడిని స్వీకరిస్తూ తగిన హోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వీటికి తగిన హోస్ట్ లభించగానే వాటిలో గ్రుడ్లు పెట్టి వచ్చే పిల్ల పురుగులు ఆ హోస్ట్ నుంచి ఆహారాన్ని స్వీకరించి పెరిగి కోశస్థ దశకు చేరుకుంటాయి.

గ్రుడ్లను ఆశించే పరాన్న జీవులు :
టిలినోమస్ :
ఇవి గ్రుడ్లను ఆశించే పరాన్న జీవులు. ఇవి గొంగలి పురుగుల మరియు అనేక రకాల కీటకాల గ్రుడ్లను ఆశిస్తాయి. వీటిని ప్రయోగశాలలో లద్దె పురుగుల గ్రుడ్లపై తేలికగా పెంచవచ్చు. ఈ విధంగా పెంచి టీలినోమసను ఎకరానికి 4000 చొప్పున మూడు నుంచి నాలుగు సార్లు పొలంలో విడుదల చేసినచో కత్తెర పురుగు వంటి అనేక రకాల గొంగళి పురుగుల గ్రుడ్లను నాశనం చేస్తాయి. 

ట్రైకోగ్రామా :
ఇది భారత దేశ మొత్తం విస్తృతంగా కనిపించే విజయవంతమైన పారసైటాయిడ్. ఇది అనేక రకాలైన గొంగళి పురుగుల, ఈగల మరియు మిడతల గ్రుడ్లను నాశనం చేస్తుంది. చెఱకు, వరి, కొబ్బరి, క్యాబేజి, ప్రత్తి వంటి పంటల్లో కాండం మరియు కాయ తొలుచు పురుగు గ్రుడ్లను నాశనం చేయడానికి విరివిగా ఉపయోగిస్తున్నారు. పంట కాలాన్ని మరియు పంటను ఆశించే పురుగుల ఉధృతిని గమనించి 10 రోజుల వ్యవధిలో మూడు నుండి నాలుగు సార్లు ట్రై కార్డు పొలంలో ఉంచాలి. వరి, చెఱకు మరియు కూరగాయలలో ఎకరానికి 1 సిసి, మొక్కజొన్నలో 2 సిసి బాగా పెరిగిన ప్రత్తి మరియు చెఱకులో 3 సిసి చొప్పున విడుదల చేయాలి. (1 సిసి అనగా 16 నుంచి 18 వేల గ్రుడ్ల పారసైటిస్ చేయబడినవి). ట్రైకోగ్రామాలో మరల వివిద రకాల స్పిసీస్ ఉన్నాయి. పురుగులను అనుసరించి ట్రైకోగ్రామా చిలోనిస్ చెఱకు మరియు వరి పంటకు ట్రైకోగ్రామా జపానికమ్ వరి పంటకు, ట్రైఎంబ్రామోఫాగమ్ టమాటాకు, ట్రైబ్యాక్టే ప్రతి పంటకు ఉపయోగించుకోవాలి. ఇవే కాక ఎన్నో రకాల ట్రైకోగ్రామా స్పిసీడ్స్ పూలు, ఉద్యానవన పంటలు మరియు తోటల్లో ఉపయోగిస్తున్నారు. 

చిలోనస్ బ్లాక్ బర్ని : 
చిలోనస్ బ్లాక్ బర్ని గ్రుడ్డు దశను ఆశించి హోస్ట్ మొక్క లార్వాలోకి ప్రవేశించి పెరిగే 'ఎగ్ లార్వల్' పార సైటాయిడ్. దీనిని హవాయి నుండి తెప్పించి భారతదేశంలో విడుదల చేశారు. ముఖ్యంగా బంగాళదుంపను ఆశించే గొంగళిపురుగును మరియు ప్రత్తిని ఆశించే గొంగళిపురుగులు, క్యాబేజిని ఆశించే పురుగులను అదుపు చేయడానికి దీనిని వినియోగిస్తున్నారు. 

టెట్రాస్టైకస్ షినోబి : 
ఇది ముఖ్యంగా వరి మరియు చెఱకు పంటను ఆశించే కాండం తొలుచు పురుగులను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇది వరి యొక్క కాండం తొలుచు పురుగుల గ్రుడ్లను సమర్ధవంతంగా నాశనం చేస్తుంది. ఎందుకనగా ఒక్క కాండం తొలుచు పురుగు గ్రుడ్ల సముదాయాన్ని అనేక టెట్రాసైకస్ పురుగులు ఆశిస్తాయి. ఇవి ఒక్కొక్క కాండం తొలుచు పురుగు గ్రుడ్డులో ఒక గ్రుడ్డును పెడతాయి. 
పిల్ల పురుగులు గ్రుడ్డులోని సొన అంతా తిన్న తరువాత ఇంకో గ్రుడ్డును ఆశిస్తాయి. ఈ రకంగా ఇవి 90% గ్రుడ్లను నిర్మూలిస్తాయి. 

ఊనోసిస్టస్ పాపైడిపెస్ : 
ఇవి భారత దేశం మరియు అనేక ఆసియా ఖండ దేశాలలో సమర్ధవంతంగా అరటి స్కిప్పర్ బటర్ ఫ్లని నివారిస్తున్నాయి. ఇవి అరటిని ఆశించే సీతాకోకచిలుక యొక్క గ్రుడ్లలో వాటి గ్రుడ్లను పెట్టి వాటిని నివారిస్తాయి. ఇవి వాటినే కాక పంటను ఆశించే అనేక రకాల పురుగుల గ్రుడ్లను నిర్మూలిస్తాయి.

లార్వల్ స్టేజస్ (పిల్ల పురుగులను) ఆశించే పరాన్నజీవులు : 
ఎసిరో ఫాగస్ పిపియం : 
ఇది మొక్సికో దేశం నుంచి భారతదేశానికి బొప్పాయిని ఆశించే పిండినల్లి నివారించడానికి తెప్పించబడినవి. ఇది పిండినల్లి యొక్క రెండవ పిల్లదశను అతి త్వరగా నాశనం చేస్తుంది. ఎకరానికి 100 విడుదల చేసినచో సరిపోతుంది. భారతదేశంలో ప్రవేశించినప్పటి నుంచి అనగా 2010 జూలై నుంచి ఇది ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తుంది. 

గోనియోజస్ నెపాంటిడస్ : 
ఇది భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కొబ్బరిని ఆశించే నల్ల ముక్కు గొంగళి పురుగును నివారించడానికి వాడతారు. ఈ పురుగు నల్ల ముక్కు పురుగు యొక్క రసాన్ని పీల్చి దానిపై గ్రుడ్లు పెడుతుంది. ఆ గ్రుడ్లు పొదగబడి వచ్చిన పిల్లలు గొంగళి పురుగును తిని వృద్ధిపొందుతాయి. ఒక్కొక్క గొంగళి పురుగు అనేక గోనియోజన్లు పెరుగుతాయి. 

బ్రాకాన్ హెబెటర్ /బ్రాకాన్ బ్రెవికార్నిస్ : 
ఇది బంగాళదుంపలను ఆశించే గొంగళి పురుగును, మొక్కజొన్నను ఆశించే కాండం తొలుచు పురుగు, ప్రత్తిని ఆశించే గులాబి రంగు పురుగును మరియు అనేక రకాల గొంగళి పురుగులను సమర్ధవంతంగా నివారిస్తాయి. సాధారణంగా ప్రయోగశాలలో బ్రాకాను వరి తుట్ట పురుగును (కార్పైరా సెఫలానికా) ఉపయోగించి పెంచి బ్రాకాన్ ప్యూపా కాని, రెక్కల పురుగు కాని ఎకరానికి 2000 చొప్పున విడుదల చేయాలి. 

ఎసికాల్షియం ఫార్మోజా:
ఇది తెల్లదోమ మరియు పేనుబంకను నాశనం చేసే పరాన్నజీవి. దీనిని ముఖ్యంగా పోలిహౌస్లో రసం పీల్చే పురుగులను నివారించడానికి ఉపయోగిస్తారు. వీటి యొక్క తల్లి పురుగులు తెల్లదోమ మరియు పేనుబంక శరీరంలోకి వాటి గ్రుడ్లను చొప్పిస్తాయి. ఈ గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఆ హోస్ట్ ని తిని సంహరిస్తాయి. 

కాంపోలిటస్ క్లోరిడ్:
ఇది శనగ పచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు వంటి అనేక గొంగళి పురుగులను ఆశిస్తుంది. ఈ మధ్య కాలంలో విచక్షణారహితంగా పురుగు మందులు వాడటం వలన వీటి సంఖ్య గణనీయంగా క్షీణించింది. ప్రయోగశాలలో పెంచినచో ఎకరానికి 6000 అవసరాన్ని అనుసరించి ఒకటి నుంచి మూడు సార్లు విడుదల చేయాలి. 

కొటేసియా ఫ్లావిషెస్ : 
ఇది సుమారు 2 మి.మీ. పొడవు ఉండి అనేక గొంగళి పురుగులను ముఖ్యంగా మొక్కజొన్న కాండం తొలుచుపురుగు వంటి వాటిని నిర్మూలిస్తుంది. ఒక్కొక్క హోస్ట్ పురుగు వద్ద అనేక కోటిసియం కోశస్థ దశలు తెల్లగా కనిపిస్తాయి. 

అనాగిరిస్ ఇండికస్:
ఇది ముఖ్యంగా పిండినల్లి, పొలుసు పురుగు వంటి వాటిని నిర్మూలిస్తుంది. పిండి నల్లిని అదుపు చేయడానికి ప్రయోగశాలలో పెంచిన అనాగిరసను ఎకరానికి 100 చొప్పున విడుదల చేయాలి. ముఖ్యంగా జామ తోటలు, ప్రత్తి మరియు జట్రోపా వంటి పంటలలో పిండినల్లి మరియు పొలుసు పురుగు వంటి వాటిని అదుపు చేయడానికి ఉపయోగిస్తున్నారు.

టాచినిడ్ ఫై : 
టాచినిడ్స్ పంటను నాశనం చేసే పురుగుల యొక్క అనేక దశలను ఆశిస్తాయి. గొంగళి పురుగులు, ముక్క పురుగులు మరియు రసం పీల్చే పురుగులను ఆహారంగా స్వీకరిస్తాయి. 

బిగ్ హెడ్ ఫ్లైస్ : 
ఇవి వరిలో దోమను సమర్ధవంతంగా అదుపు చేస్తాయి. వీటి తలలు పెద్దవిగా ఉండే ఈగ జాతికి చెందినవి.

ప్యూపల్ (కోశస్థ దశ)లను ఆశించే పరాన్న జీవులు : 
జాంతోపింప్లా స్టెమ్మాటర్ : 
ఇది అనేక ధాన్యాలను చెఱకు పంటను ఆశించే గొంగళి పురుగుల కోశస్థ దశలను నాశనం చేస్తుంది.  ఇది భారతదేశంలో కోశస్థ దశలను నాశనం చేసే పరాన్న జీవులలో ముఖ్యమైనది. 

యూసెటోరియా బ్రయిని :
శనగ పచ్చ పురుగు కోశస్థ దవను ఆశిస్తుంది. ప్రయోగశాలలో వీటిని 4వ ఇన్ స్టార్ లార్వా మీద వదిలినచో ఇవి గ్రుడ్లను లార్వా అనగా పిల్ల పురుగులోకి చొప్పిస్తాయి. శనగ పచ్చ పురుగు యొక్క కోశస్థ దశను నాశనం చేస్తూ ఇవి పెరిగి పెద్దవుతాయి.

సొమ్మాటోవియా బియానా : 
ఇది కొబ్బరిని ఆశించే నల్ల ముక్కుపురుగు యొక్క కోశస్థ దశలను నాశనం చేస్తుంది. 
ఈ విధంగా ఎన్నో రకాల పరాన్నజీవులు పంటను ఆశించే అనేక పురుగు వివిధ దశలను నిరంతరంగా నిర్మూలిస్తూ ఉంటాయి.