అపరాల విత్తనోత్పత్తికి అనుకూలించే అంశాలు 


రచయిత సమాచారం

డా. యస్. మదుసూదన్ రెడ్డి, డా. వి వెంకన్న, డా. కె. గోపాలక్రిష్ణమూర్తి, డా. సి. నరేంద్రరెడ్డి, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట 


నిత్య అవసరాలలో పప్పుధానాలు ఎంతో అవసరము. అంతే కాకుండా ఆర్థిక ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య పంటల సాగు మీద ఆసక్తితో రైతులు అపరాల పంటల సాగునే విస్మరించారు. దీనికి తోడుగా వాతావరణ పరిస్థితులు, వానాకాలం సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు, మేలైన వంగడాల లోపము, పంట గిట్టుబాటు ధరలు నిర్దిష్టంగా లేకపోవడం, పంట కోతల తదనంతరం నిల్వ చేయు ప్రమాణాలు పాటించకపోవడం ఈ అపరాల దిగుబడిని, అలాగే సాగు విస్తీర్ణము గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో అపరాల విత్తనోత్పత్తిపై రైతులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఖరీఫ్, రబీ మరియు వేసవి కాలాల్లో వేసుకోదగిన పంటల విషయానికొస్తే ఈ అపరాలనే చెప్పుకోవాలి. పెసర, మినుము, కందిని మూడు కాలాల్లో వేసుకోవచ్చు. పప్పుశనగ, సోయాబీన్, రబీ మరియు వేసంగి సమయాలలో అధికంగా వేసుకోవచ్చు. వీటితోపాటుగా బొబ్బర్లు, ఉలవలు, బీన్స్ పలు అపరాల జాతులను సాగుచేసుకోవచ్చు. 

విత్తనోత్పత్తికి అనుకూలించే కీలక అంశాలు : 
వాతావరణం మరియు పంట వేయు ప్రదేశం :
రైతులు ఎంపిక చేసుకునే విత్తన తరగతి లేదా రకము లేదా ఆయా మేలైన రకాలు అక్కడున్న, వేయదలచిన వాతావరణ పరిస్థితులు అనుకూలమైనవిగా చూసుకోవాలి. అధిక వర్షపాతం, మంచు, ఉష్ణోగ్రత మరియు ఆర్హతలు విత్తనాభివృద్ధికి అనుకూలించవు. కావున తక్కువ తేమతో కూడిన చల్లని వాతావరణం రబీ సమయంలో ఉంటుంది కాబట్టి రబీ సమయంలో అపరాల విత్తనోత్పత్తికి ఆశాజనకంగా ఉంటుంది. మురుగునీరు సదుపాయం గల మంచి తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. విత్తనోత్పతికి ఎంపిక చేసిన పొలం చదునుగా ఉంచుకొని క్రితం పంట నుండి వచ్చిన కలుపు, ఇతర పంట మొక్కలు లేకుండా చూడాలి. అదే పంట రకం ఇంతకు ముందు సీజన్లో విత్తనోత్పత్తికి ప్రస్తుతం చేస్తున్న మడిలో పండించి ఉండకూడదు.

వేర్పాటు దూరము :
అపరాలలో వితనోతతి చేసేటప్పుడు ఈ వేర్పాటు దూరము ఖచ్చితంగా పాటించుకోవాలి. అపరాలకి చాలా స్వల్ప దూరము అవసరము ఉంటుంది. పెసర మరియు మినముల రకాల విత్తనోత్పతికి రైతు స్తాయిలో 5 మీ. పాటించుకోవాలి. అలా కాకుండా పునాది విత్తన రకాలైతే 10 మీ.లు వేర్పాటు దూరం పాటించాలి. ఈ పద్ధతులను పాటించి నాణ్యమైన విత్తనం, కల్తీలు లేకుండా చూసుకోవాలి. 

విత్తన రకాలు :
పెసర, మినుము, పప్పువనగ, సోయాబీన్ లాంటి అపరాల రకాలు మేలైనవిగా రూపొందించబడి ఉన్నాయి. కావున ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాణ కేంద్రాలు, వ్యవసాయ సలహా కేంద్రాలు మరియు విత్తన అధీకృత సంస్థలలో లభ్యమవుతాయి. సమయాన్ని, వాతావరణాన్ని, చీడపీడలు, తెగుళ్ళు మరిఅయు అవరోధకాలను దృష్టిలో ఉంచుకొని విత్తన రకాలను ఎంపిక చేసుకొని విత్తనోత్పత్తి చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విత్తే సమయం :
ఈ అపరాలను ప్రత్యేకించి రబీ సమయంలో లేదా చలి తీవ్రతల తగ్గుముఖం పట్టాక వేసవి కాలానికి ముందుగా జనవరి చివరి వారము లేదా ఫిబ్రవరి పూర్తి మాసాలలో వేసుకొని సాగు చేపట్టినల్లయితే నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. నీటి యాజమాన్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వేసవి పగటి ఉష్ణోగ్రతల తీవ్రతలు ఎక్కువగా ఉండి విత్తనాన్ని గట్టిపరచకుండా తాలుగా లేదా పీలగా మారతాయి. కావున ఆయా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. 

విత్తన మోతాదు :
పెసలు 5 కిలోలు/ఎకరానికి, వరి మాగానుల్లో చేపట్టినట్లయితే 12-15 కిలోలు / ఎకరానికి అవసరమవుతాయి. 
మినుములు 6 కిలోలు/ఎకరానికి, వరి మాగాణుల్లో చేపట్టినట్లయితే 15-18 కిలోలు / ఎకరానికి అవసరమవుతాయి. 
పప్పు శనగలలో విత్తన మోతాదు రకము, గింజ బరువు మరియు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. చిన్న విత్తనాలైతే ఎకరానికి 20-24 కిలోలు మధ్యస్థ విత్తనాలైతే ఎకరానికి 24-35 కిలోలు పెద్ద విత్తనాలైతే ఎకరానికి 36-48 కిలోలు అవసరమవుతాయి.

కల్తీల ఏరివేత : అపరాల పంట కాలపరిమితి చాలా తక్కువగా ఉంటుంది. కావున త్వరితగతిన క్షేత్రాన్ని పరిశీలించుకోవాలి. మొదటగా శాఖీయ దశ, ప్రత్యుత్పత్తి దశలలో కలీలు ఏరివేయాలి. ఆకుల రంగు, మొక్క పరిమాణం, ఆకు ఆకారం, కాయ రంగు, కాయపై నూగు, విత్తన రంగు ఆధారంగా కలీలను ఏరివేయాలి. ప్రస్తుత సమయాల్లో చలి తీవ్రత వల్ల శిలీంధ్రాలు, వైరస్ తెగుళ్ళు అధికంగా కనిపిస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు తీసివేయాలి. దీని వలన విత్తనాల నాణ్యతతో పాటుగా స్వచ్చతను కూడా కాపాడుకోవచ్చును. 

పొలం ప్రమాణాలు (%) (పెసర, మినుము మురియు పప్పుశనగ) : 

ప్రమాణాలు పునాది విత్తనం ధృవీకరణ విత్తనం
ఆఫ్ టైప్ 0.10 0.20
విత్తనం ద్వారా సక్రమించు తెగులు మొక్కలు 0.10 0.20క్షేత్ర తనిఖీలు విత్తన అధికారులు లేదా రైతు స్వయంగా పండిస్తే రైతులు పంట కాలాన్ని బట్టి తప్పనిసరిగా మూడు సార్లు కల్లీ ఏరివేతని చేపట్టాల్సి ఉంది. శాఖీయ దశ, పూత దశ మరియు కోత దశ అవసరాన్ని బట్టి కోతల అనంతరం అపరాల విత్తనోత చేస్తున్నప్పుడు ఇబ్బందికరమైన అంశం పంట క్షేత్రంలో ఉన్నప్పుడే కాయలు విచ్చుకొని విత్తనాలు రాలిపోతాయి దాని వలన దిగుబడులు తగ్గుతాయి. విధంగా ఒకేసారి పూతకి రాకపోవడం వలన కోతలు ఆలస్యమవుతుంటాయి. కావున ప్రత్యేకంగా పరిస్థితులను అవగాహన చేసుకొని సాగు యాజమాన్యం చేపట్టాలి. 

వీటితో పాటుగా సాంకేతిక పరిజ్ఞానం కూడా రైతులు తెలుసుకోవాలి. అంటే యాజమాన్య పద్ధతులు, కలుపు, ఎరువులు, సూక్ష్మ పోషకాలు, నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వలన క్షేత్ర ప్రమాణాలు అదుపులో ఉంటాయి. పరిమితికి తగ్గట్టుగా ఉంటాయి. దీనివలన కోతల తరువాత విత్తన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. 

ఈ విధంగా సాగు, యాజమాన్య పద్ధతులతో పాటుగా సాంకేతిక సలహాలు, సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడులతో పాటుగా నాణ్యమైన విత్తనాలను రూపొందించవచ్చును. తద్వారా ఆదాయంతో పాటు విత్తన కొరత సమస్యను అధిగమించవచ్చు.