వేసవిలో ఆరుతడి పంటల సాగు చేపట్టు - అధిక ఆధాయాన్ని రాబట్టు


రచయిత సమాచారం

బి .మాధవి (సేద్య విభాగ శాస్త్రవేత్త),ఎన్.నవత (సేద్య విభాగ శాస్త్రవేత్త) బి.రాజు (మృత్తిక శాస్త్రవేత్త) పి.మధుకర్ రావు(సేద్య విభాగ శాస్త్రవేత్త), రజినీదేవి (ఆర్థిక శాస్త్రవేత్త), పి.సాద్వి (విస్తరణ శాస్త్రవేత్త) మరియు ఆర్.ఉమా రెడ్డి(సహా పరిశోధన సంచాలకులు )


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న తరుణంలో వేసవిలో లాభధాయకంగా సాగుచేసుకోదగ్గ ఆరుతడి పంటలుమరియు వాటి యాజమాన్య  పద్దతుల గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో  సాగు చేసుకోదగ్గ ఆరుతడి పంటలు నువ్వులు,జొన్న,సజ్జ,రాగి,మరియు కొర్ర .
నువ్వులు: నువ్వు పంట జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చు ,శ్వేత,హిమ,రాజేశ్వరి అనే తెల్లగింజ రకాలు,చందన,ఎలమంచిలి,గౌరి అనే గోధుమ రంగు,గింజ రకాలు సాగుకు అనుకూలం. పైరకాలు సుమారుగా 80 నుండి 90 రోజులలో పంట పూర్తిగా అవుతుంది. ఎకరానికి 2.5 కిలోల విత్తనంతో వరుసల మధ్య 30 సెం.మీ మరియు మొక్కల మధ్య 10 సెం.మీ ఉండేలా చూసుకోవాలి.    
1 కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్ మరియు 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ తో విత్తనశుద్ది చేసుకోవాలి .విత్తిన వెంటనే గాని లేదా 48 గంటలలో ఎకరానికి 1 లీటరు పెండిమిథాలిన్ కలుపు మందును పిచికారి చేసుకోవాలి.ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ,15 కిలోల పోటాష్ మరియు 25 కిలోల యూరియాపై పాటుగా వేసుకోవాలి .చీడపీడల ఉదృతిని బట్టి సరైన సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే ఎకరానికి 3 కిలోల నుండి 4 క్వింటాళ్ళ దిగుబడితో లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు. 
జొన్న : జొన్న పంట జనవరి 1 నుండి 30 వరకు విత్తుకొవచ్చు. ఎకరానికి 3 నుండి 4 కిలోల విత్తనంతో వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 15 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి 1 కిలో విత్తనానికి 3గ్రాముల థయోమిథాక్సాం 70% డబ్ల్యు .ఎస్ లేదా 12మి.లీ ఇమిడాక్లోప్రిడ్ తో విత్తనశుద్ది చేసుకోవాలి. విత్తిన వెంటనే గాని లేదా 48 గంటల లోపు ఎకరానికి 800 గ్రాముల అట్రజిన్  50% పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి ఎకరానికి 50 కిలోల డి.ఎ.పి ,100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 25 కిలోల పొటాష్ ను దుక్కిలో వేసుకోవాలి. విత్తిన 30 రోజులకు ఎకరానికి 40 కిలోల యూరియా పై పాటుగా వేసుకోవాలి అవసరాన్ని బట్టి సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. 
సజ్జ : ఈ పంట జనవరి 1 నుండి 30 వరకు విత్తుకోవచ్చు. పి.హెచ్.బి-3 అనె రకం 80 నుండి 85 రోజులలో పంటకాలం పూర్తి చేసుకొని ఎకరానికి 10 నుండి  12 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది ఎకరా నికి 2 కిలోల విత్తనంతో వరుసల మధ్య 45 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి విత్తిన వెంటనే గాని 48 గంటలలోపు ఎకరానికి 600గ్రాముల అట్రజిన్ 50% పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారి చేసుకోవాలి ఎకరానికి 30 కిలోల యూరియా ,100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్,20 కిలోల పోటాష్ లు దుక్కిలో వేసుకొవాలి. విత్తిన 30 రోజులకు ఎకరానికి  40 కిలోల యూరియా పై పాటుగా వేసుకోవాలి 
రాగి : రాగి పంట జనవరి 15 నుండి ఫిబ్రవరి 5 లోపు విత్తుకోవాలి. భారతి .శ్రీచైతన్య,వకుళ .మారుతి అనువైన రకాలు ఎకరానికి 2 కిలోల  విత్తనం నారు పోసి కాని లేదా నేరుగా గాని వరుసల మధ్య 30 సెం,మీ మరియు మొక్కల మధ్య 10 సెం,మీ ఉండేలా చూసుకోవాలి. విత్తనాన్ని 2 గ్రాముల కార్బండిజం తో విత్తనశుద్ది చేసుకోవాలి ,విత్తే ముందు ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు 25 కిలోల డి.ఎ.పి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్  పొటాష్ మరియు విత్తిన నెలకు 25 కిలోల యూరియా వేసుకోవాలి, నారు నాటే ముందు.లేదా విత్తనం వేసే ముందు పెండిమిథాలిన్ మందును 3 మి.లీ/లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. పిలకలు వేసే దశ,పూతదశ,గింజలు పాలు పోసుకునే దశలో నీటితడులు తప్పని సరిగా ఇవ్వాలి. గులాబిరంగు పురుగు నివారణకు క్లోరోఫైరిఫాస్. 2.5మి.లీ/లీ మరియు అగ్గితెగుళ్ళ నివారణకు 1గ్రాం. కార్బండిజం లేదా 1గ్రాం ఏథిఫెన్ ఫాస్ 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి 
కొర్ర: కొర్ర పంట జనవరి 1 నుండి 30 లోపు విత్తుకోవాలి. 
అనువైన రకాలు:  సూర్యనంది,81ఎ,3156 ,81ఎ 3085 ఎకరానికి 2 కిలోల విత్తనాన్ని వరుసల మధ్య 22.5 సెం.మీ మరియు మొక్కల మధ్య 7.5 సెం.మీ ఉండేలా విత్తుకోవాలి ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 20 కిలోల యూరియా వేసుకోవాలి.విత్తిన 30 రోజులకు ఎకరానికి 20 కిలోల యూరియా పై పాటుగా వేసుకోవాలి.