వివిద పంటలలో సూక్ష్మ పోషకాల లోపాలు నివారణ


రచయిత సమాచారం

యం .జ్యోత్స్న కిరణ్మయి , శాస్త్రవేత్త(అగ్రానమి) యస్ .బాలాజి నాయక్ ,శాస్త్రవేత్త(సాయిల్ సైన్స్) టి .భాగవత ప్రియ శాస్త్రవేత్త(అగ్రానమి) డా:డి సంపత్ కుమార్ ఎ.డి.ఆర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం,నంద్యాల .     ఏ పైరులోనైనా మొక్కలు బాగా పెరగాలంటే గాలి,సూర్యరశ్మి ,నీరు ప్రధానమైనవి. వీటి తర్వాత పోషక పదర్థాలు సమపాళ్ళలో లబించడం ఎంతో అవసరం . భూమిలో పోషక పదర్థాల పరిమాణాన్ని బట్టి మొక్కల పెరుగుదల .దిగుబడి పరిమితమై వుంటాయి,మొక్కల ప్రత్యేక  అవసరాలకు అన్ని పోషక పదర్థాలు సక్రమంగా అందినపుడు మాత్రమే మొక్కలు పూర్తిగా పెరుగుతాయి .
సూక్ష్మ పోషకాల పదర్థాల లోపాలు ఏర్పడటానికి ముఖ్య కారణాలు: 

 • నేలలో తగిన స్థాయిలో పోషక పదర్థాలు లభ్యత ఉండకపోవచ్చు .

 • ఒకోక్కపుడు సూక్ష్మ పోషక పదార్థాలు తగిన స్థాయిలో ఉన్నప్పటికి నేల భౌతిక ,రసాయన లక్షణాలు  వాటిని మొక్క గ్రహించలేని స్థితిని  కలుగజేయవచ్చు .

 • అధిక దిగుబడులనిచ్చే  వంగడాలు సాగులో వుండటం వలన సూక్ష్మ పోషకాల వినియోగశక్తి ఎక్కువగా ఉండటం, నేల నుండి గ్రహించే పరిమాణం వినియోగంలో తేడా ఎక్కువగా ఉండటం వలన లోప లక్షణాలు పంట మీద కనిపిస్తున్నాయి.

 • ప్రధాన పోషక పదార్థాలను అందించే ఎరువులను విరివిగా వాడటం, సేంద్రీయ ఎరువుల వాడకం బాగా తగ్గి పోవడం, పంట గ్రహించిన సూక్ష్మ పోషక పదార్థాలను ఎరువుల రూపంలో మరల నేలకు అందజేయక పోవడం వల్ల నేలలోని సూక్ష్మ పోషక పదార్థాలు విలువలు క్రమంగా తగ్గి మొక్కలపై వాటి లోపాలు ఎర్పడుతున్నాయి .

 • వివిద పొషక పదార్థాల మద్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు కొన్ని పొషక పదార్థాల లభ్యత తగ్గి వాటిలోప లక్షణాలు మొక్కలపై ఏర్పడతాయి. 

జింకు లోప లక్షణాలు: 
     జింకు లోప లక్షణాలు మొదట ముదురు ఆకులపై కనిపించి క్రమేణా లేత ఆకులకు వ్యాపిస్తాయి.కొత్తగా వచ్చే ఆకులు సన్నగా చిన్నవిగా వుంటాయి ,ఆకులు పాలిపోయి పెళుసుగా వుంటాయి. పైరు వేసిన రెండు లేదా ముడు వారాల్లో మొక్క పై నుంచి ముడు లేదా నాలుగో ఆకు ఈనెల మద్యభాగం ఆకు పచ్చ రంగును కొల్పోయి  పసుపు వర్ణంతో  కూడిన తెలుపు రంగుకు  మారుతాయి. తక్కిన భాగమంతా ఆకుపచ్చగా వుంటుంది .ఆకు చివరి నుండి మూడవ భాగంలో ఈనెలకు ఇరువైపులా తుప్పువర్ణం లేదా ముదురు ఇటుక రంగుల మచ్చలు కనిపిస్తాయి .
జింకు లోపానికి కారణాలు:

 • చౌడు పాలు ఎక్కువగా వున్న భూములు,కంకర నేలలో సున్నం అధికమైన నేలల్లో జింకు లోపం ఏర్పడుతుంది.

 • చలికాలం తీవ్రంగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు బాగా పడిపోయిన పరిస్థితులు జికు లోపాన్ని కలుగజేస్తాయి. 

 • సేంద్రీయ పదార్థాలు నేలలో ఎక్కువగా ఉన్నప్పుడు లేదా బాగా మళ్ళిన సేంద్రీయ ఎరువులు పొలంలో వేసినప్పుడు జింకు లోపం ఏర్పడుతుంది. 

 • నీటి ముంపునకు గురయ్యే  భూములు , మురుగునీరు పోయే సౌకర్యం లేని భూములలో జింకు లోపం వస్తుంది. 

 • కొత్తగా వరి పండించే మాగాణి నేలల్లో జింకు లోపం  ఎక్కువగా వుంటుంది.     

జింకు లోపం నివారణ చర్యలు :

 • భూసార పరీక్షల ద్వారా పొలం పోషక విలువలు తెలుసుకొని స్థూల పొషకాలలో పాటు సిఫార్సు మేరకుజింకు సల్ఫట్  వేసుకోవాలి.

 • జింకు లోప నివారణాకు హెక్టారుకు 50 కిలోల జింకు సల్ఫట్ ప్రతి మూడు పంటలకు ఒకసారి గాని, రెండేళ్ళకొకసారి గానీ మడిలో వేసి బాగా దున్నాలి అయితే తేలిక భూములకు 25 కీలోలు, బంకమన్ను ఎక్కువగా వున్న భూములకు 50 కిలోల జింకు సల్ఫటే అవసరం. 

 • ఈ లోపం పైరులో కనిపిస్తే రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ఒక లీటరు నీటికి కలిపి ఎకరానికి 250 లీటర్ల జింకు ద్రావణాన్ని (అరకిలో జింకు సల్ఫేట్ 250 లీటర్ల నీటిలో) వారం రోజులకు ఒకసారి చొప్పున 2 లేదా 3 దఫాలుగా  పిచికారి చేయాలి. 

 •   చాలా మంది రైతులు జింకు లోపాన్ని నత్రజని లోపంగా లేదా ఏదో ఒక రోగంగా భావించి నత్రజని ఎరువులు లేదా పురుగు మందులు శిలీంద్రనాశకాలు వాడుతారు.అలకాకుండా జింకు సల్ఫేటెను ఏ ఇతర మందులతో కలపకుండా సాదారణ స్ప్రేయర్ తో పిచికారి చేయాలి.  

 • ఉప్పు ,చౌడు నేలల్లో  పైన వివరించిన మోతాదుకంటే రెండింతలు జింకు సల్ఫేటేను వేసుకోవాలి .అంటే హెక్టారుకు 100 కిలోల వరకు వేసుకోవచ్చు. 

 • భాస్వరపు ఎరువులను జింకు సల్ఫేటేను కలిపి వేయకూడదు. భాస్వరం ఎరువు వేసిన మూడు రోజుల తర్వాత జింకు వేసి భూములలో ప్రతి సంవత్సరం రబీలో జింకు వేయాలి.     

ఇనుము : 
   ఇనుముతో పాటు వరి,జొన్న .సజ్జ,వేరుశనగ,చెరకులో మూఖ్యంగా  కనిపిస్తాయి. 
 ఇనుము లోప లక్షణాలు: 
          ఇనుము లక్షణాలు మొక్కల పై భాగం లేత ఆకులపైన కనిపిస్తాయి.ఆకులు ఈనెలు మాత్రం లేత ఆకుపచ్చగా వుండి,ఈనెల మధ్య భాగాలు క్రమేణా  పసుపు రంగుకి మారుతుంది .ఆ తర్వాత ఆకులు పత్రహారితాన్ని కోల్పోయి తెలుపు రంగుకి మారుతాయి. 
ఇనుము లోప నివారణకు సిఫార్సులు: 0.5% ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 3లేక 4 సార్లు పిచికారి చేయాలి.   
2% అన్నభేది,నిమ్మ ఉప్పు (0.3%)ద్రావణాన్ని 45 నుండి 60 రోజులకు లీటరు నీటిలో కలిపి పిచికారి చేస్తే ఇనుపదాతు లోపం త్వరగా నివారణ అవుతుంది 
బోరాన్ :

మొక్కలలోని తీపి పదార్థాలను ఒక చోట నుండి మరో చోటుకు మార్చటంలోని, మొక్కలలోని సున్నిత భాగాలలోని  పదార్థాలను కరడు కట్టకుండా చెయడంలోను, మొక్కలలో సున్నిత పోటాషియం రసాయన మార్పులకు లోనవడంలొ బోరాన్ ముఖ్య పాత్ర వహిస్తుంది.  
 బోరాన్ లోప లక్షణాలు:  
     మొక్కపై భాగం చివరి మొగ్గలపై కనిపిస్తుంది లేత ఆకులపై తెల్లని చారలు కనిపిస్తాయి.క్రమంగా ఈ చారలన్ని కలిసిపోయి తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అకులు ముదురుగా వంకర్లు తిరిగి పెళుసుగా ఉంటాయి. ప్రత్తి వంటి పంటలలో ఈ లోపం ఎక్కువగా ఉన్నపుడు పూత మొగ్గ దశ లో ఎండిపోవడం. చిన్న కాయలు రాలిపోవడంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధన కాండంపై పగుళ్ళు కూడా ఏర్పడతాయి. కాయలు సరిగా అబివృద్ది    చెందక కాయలపై పగుళ్ళు ఏర్పడతాయి.
 బోరాన్ లోప నివారణకు సిఫార్సులు :దుక్కిలో 25 కిలోల బోరాక్స్ వేసి దున్నాలి.పంటలపై ఈ లోపం కనిపిస్తే 0.1 నుండి 0.2% బోరాక్స్  గాని బోరిక్ యాసిడ్ ద్రావణాన్ని వారం వ్యవదిలో పిచికారి చేయాలి. 
మాంగనీసు లోప లక్షణాలు:  

మాంగనీసు లోపం మొక్కలపై భాగంలో లేత  ఆకులలో కనిపిస్తాయి .లేత ఆకుల ఈనెలు మాత్రం మామూలుగా ముదురు ఆకుపచ్చగా వుండి ఈనెల మద్యభాగం పసుపు రంగుకు మారుతాయి, కాని తెలుపు రంగుకు మారవు.ఒక దశలో ఇనుము,మాంగనీసు  లోపాలు ఒకటిగా వున్న  లోప తీవ్రతను ,ఆకులు తెల్లబడటాన్ని బట్టి ఏ పోషక పదార్థాంలో లోపించిందో తెలుసుకోవచ్చు. 
వరి, జొన్న,సజ్జ ,వేరుశనగ పంటలపై

మాంగనీసు లోప నివారణకు సిఫార్సులు :హెక్టారుకు 50 కిలోల మాంగనీసు సల్ఫేటేను భూమికి వేయాలి. చౌడు భూములకు హెక్టారుకు100 నుండి 150 కిలోల వరకు వేసుకోవచ్చు.పంటలపై లోప లక్షణాలు కనిపిస్తే 0.2% నుండి 0.3% మాంగనీసు సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవదిలో 2-3 సార్లు పిచికారి చేయాలి 2గ్రాముల మాంగనీసు సల్ఫేట్ లీటర్ నీటికి కలపాలి .
రాగి:

రాగి లోపం ముఖ్యంగా వరి,జొన్న వేరుశనగ పంటలలో కనిపిస్తుంది 
 రాగి లోప లక్షణాలు: మొక్కలపై భాగంలో రాగి దాతువు వలన కొత్త ఆకుల చిగుళ్ళు పచ్చ దనాన్ని కోల్పొయి పసుపు రంగుకు మారి చివరలలో వంకర్లు తిరిగి మిళితమైన తెల్లటి మచ్చలు కూడా కనిపిస్తాయి .మొక్కలలో నత్రజని చెందాల్సిన రసాయనిక మార్పులను  ఆటంకం కలుగజేస్తుంది .కిరణజన్య సంయోగ క్రియలో పాత్ర వహిస్తుంది.
రాగి లోప నివారణకు సిఫార్సులు : రాగి దాతులోప నివారణకు 0.2% కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవదిలో 2 నుంచి 3 సార్లు పిచికారి చేయాలి