రబీ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో యాజమాన్య పద్ధతులు


రచయిత సమాచారం

ఎస్‌. మధుసూదన్‌ రెడ్డి, జి. గోపాలకృష్ణ, ఆర్‌. సాయికుమార్‌, నాగేందర్‌, రాజేంద్రనగర్‌, వ్యవసాయ కళాశాల


పొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనెగింజల పంటగా ప్రాముఖ్యత సంతరించుకుంది. పొద్దుతిరుగుడులో నూనె (49 శాతం) మరియు మాంసకృత్తులు (22 శాతం) ఉంటాయి. ఈ నూనెలో లినోలిక్‌  ఆమ్లం (65 శాతం) ఎక్కువగా ఉండడం మూలాన ఆరోగ్యపరంగా కూడా వేరుశనగ మరియు నువ్వుల నూనె కంటే శ్రేష్టమైనది. అంతేగాక ఈ నూనెను వనస్పతి తయారీకి , వార్నిష్‌, సబ్బు, కలప పరిశ్రమల్లో విస్తారంగా వాడుతున్నారు. నూనె తీసిన తరువాత వచ్చిన పిప్పిని పశువులకు కోళ్ళకు దాణాగాను విరివిగా వాడుతున్నారు.

ఖరీఫ్‌ సమయంలో పండిండే పొద్దుతిరుగుడు దిగుబడి కంటే రబీ సమయంలో సాగు చేసే పొద్దుతిరుగు దిగుబడి అధికంగా సాధించవచ్చు. పలు యాజమాన్యంతో పాటు విత్తనోత్పత్తిలో మెలకువలను పాటిస్తే మరింత దిగుబడులను సాధించవచ్చు. తాలు గింజలు అధికంగా ఏర్పడకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విత్తనం అధిక శాతము ఏర్పడటానికి ఏమి మెలకువలను పాటించాలి. పలు విషయాలను రైతులు తెలుసుకున్నట్లయితే పొద్దు తిరుగుడులో అధిక దిగుబడులు సాధించవచ్చు.

అనువైన వాతావరణ పరిస్థితి : 

ఈ పంట యొక్క ఎదుగుదల 12 గంటల పగటి సమయం ఉన్నట్లయితే అధికంగా ఉంటుంది. ఈ పంట సాగుకు 20-250  ఉష్ణోగ్రత అనువైనది. పూత గింజకట్టు దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. నీటి పారుదల కింద ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చు. అయితే పంట విత్త్తేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయమేమిటంటే పూత గింజలు తయారయ్యే దశలో ఎక్కువ తేమ శాతం, ఉష్ణోగ్రత ఉండకుండా చూసుకోవాలి. 

విత్తే సమయం : 

రబీలో నవంబర్‌ - డిసెంబరు మరియు జనవరిలో కూడా విత్తుకోవచ్చు. వరి తరువాత పొద్దుతిరుగుడు వేసుకునే వారు డిసెంబరు ఆఖరి వారం  నుండి జనవరి మొదటివారం వరకు విత్తుకోవాలి. విత్తేసమయం కూడా నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించే మరియు విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువ వస్తుంది. 

అనువైన నేలలు :

నీటి వసతి అనుకూలంగా ఉన్నట్లయితే తేలిక నేలలు అత్యంత అనుకూలమైనవి. నీరు నిల్వఉండని తటస్థ భూములైన ఎర్ర, ఇసుక, రేగడి మరియు ఒండ్రునేలలు దీని సాగుకు శ్రేష్ఠం.

నేల తయారీ : 

భూమిని మూడు నుంచి నాలుగు సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. 

ఏర్పాటు దూరం :    

  పునాది విత్తనం  ధృవీకరణ విత్తనం
రకాలు 400  200
సంకరాలు 600 400

విత్తనం, విత్తుట :

అధీకృత సంస్థల నుండి విత్తనాన్ని సేకరించి దానికి సంబంధించిన చీటి మరియు రశీదు పొందాలి. తాజా విత్తనాలకు నిద్రావస్థ 45-60 రోజుల వరకు ఉంటుంది. అందుకని మంచి మొలకశాతం పొందుటకు 2-3 మాసాల ముందు పండించిన విత్తనం వాడటం మంచిది. మొలకశాతం పెంచుటకు తాజా విత్తనాన్ని 300 పిపిఎమ్‌ ఇథóరిల్‌ ద్రావణంలో 8 గంటలు లేదా 0.5 శాతం నైట్రోజన్‌ ద్రావణంలో 16 గంటల పాటు నానబెట్టి, ఆరిన తరువాత విత్తుకోవాలి.                 

  విత్తన మోతాదు   విత్తేదూరం
  6కి/ఎకరానికి  45I20 సెం.మీ
సంకర రకాలు    
జనని 4.8 కి/ఎకరానికి 60I30 సెం.మీ
జనక  1.6 కి / ఎకరానికి 45I20 సెం.మీ

 

వరుసల నిష్పత్తి     8:1 లేదా 4:1

 విత్తన శుద్ధి : 

2 గ్రా. కార్బండిజమ్‌ అనే మందును కిలో విత్తనానికి వాడాలి. 4 గ్రా. ఇమిడాక్లోపిడ్‌ అనే మందును 1 కిలో విత్తన శుద్ధికి వాడాలి. 

పలుచన చేయుట :

విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తరువాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మొక్కల మధ్య నీరు పోషకాల కోసం పోటేతగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందుటకు దోహదపడుతుంది. 

తాలు విత్తనాలు ఏర్పడటానికి కారణాలు : 

1. పరాగ సంపర్కం :

పొద్దు తిరుగుడు పరపరాగ సంపర్క పంట. ఈ సంపర్కం తేనెటీగల ద్వారా సిద్ధ్దిస్తుంది. తేనెటీగల సంఖ్య కీటక నాశినుల ఉపయోగం పై ఆధారపడి ఉంటుంది. కీటకాల చర్య తక్కువగా ఉన్నప్పుడు విత్తనం ఏర్పడేవి కూడా తగ్గుతుంది. తాలు విత్తనాలు ఏర్పడతాయి. 

2. గ్రీవ పుష్పాలు : 

వెలుగు, తీవ్రత ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో సాధారణంగా గ్రీవ పుష్పాలు ఏర్పడతాయి. ఇవి తల పెరుగుదలకు పోషకాలను తీసుకోవడం మూలాన ప్రధాన తలకి పోషకాలు సరిగా అందవు. 

3. సూక్ష్మ పోషక లోపాలు : 

్గఅ : Iూూ ఉత్పత్తి, ఖీవ, దీ : పుప్పొడి వంధ్యత్వం మరియు పుప్పొడి మొలకెత్తుటకు ఉపయోగం లాంటిది లోపిస్తే తాలు విత్తనాలు ఎక్కువగా వస్తాయి.

4. స్వ విరుద్ధత :

స్వ విరుద్ధత వలన తన పువ్వులోని విత్తనాలను సరిగా కట్టలేదు.

తీసుకోవలసిన జాగ్రత్తలు : 

ఎరువుల యాజమాన్యం : 

ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే 2-3 వారాల ముందు వేయాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి. నత్రజని మొదటి దఫా విత్తేటప్పుడు 2-6 కిలోల యూరియా తరువాత రెండవ దఫాగా విత్తిన 30 రోజుల తరువాత మొగ్గ తొడిగే దశలో 13 కిలోల యూరియా మూడవ దఫాగా 50 రోజుల తరువాత పువ్వు వికసించే దశలో 13 కిలోల యూరియా ఒక ఎకరానికి వేసుకోవాలి. మొత్తం భాస్వరాన్ని, పొటాష్‌ (150 - 20 కిలోలు) ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పైపాటు ఎరువు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో 55 కిలోలు వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులను పొందవచ్చు. 2 గ్రాముల బొరాక్స్‌ లీటరు నీటికి చొప్పున కలిపి పైరు పూత దశలో ఎకరాకు 200 మందు ద్రావణం పిచికారీ చేయాలి. దీనివల్ల గింజలు ఎక్కువగా తయారవుతాయి. 

నీటి యాజమాన్యం : 

వాతావరణాన్ని బట్టి ఎర్రనేలల్లో 6-10 రోజుల వ్యవధిలో నల్ల రేగడి నేలల్లో 15-20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి. నీటి తడులకు కీలక దశలు మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించు దశ, గింజకట్టు దశలు.

అనుబంధ సంపర్కం : 

అనుబంధ సంపర్కం 50 శాతం పూతసమయంలో మెత్తటి గుడ్డను చేతితో పువ్వులపై ఉదయం 7-11 గంటల మధ్య రోజు విడిచి రోజు సున్నితంగా రుద్దడం వల్ల సిద్దిస్తుంది. తేనెటీగల పెట్టెలను కూడా అమర్చి ఈ ఫలితాన్ని పొందవచ్చు. 

తలలు తుంచుట : 

సంకర విత్తనోత్పత్తిలో ఉపయోగించే మగ, వరుసల్లో పక్క కొమ్మలు వస్తాయి. ఇవి పరాగ సంపర్కం జరిగి అధిక విత్తనం పొందుటకు దోహదపడతాయి. అయితే పునాది విత్తనోత్పత్తిలోని మగ వరుసల్లో ఈ పక్క కొమ్మలు తుంచివేయడం ద్వారా ప్రధాన తలలోని విత్తన దిగుబడి పెరుగుతుంది. 

కల్తీల ఏరివేత : 

శాఖీయ దశ నుండి పంట కోత వరకు విత్తన పొలంలోని కల్తీ మొక్కలను ఎత్తు, తల పరిమాణం, కొమ్మలు వేసే గుణం, పూతల సంఖ్య, గింజరంగు మొదలగు లక్షణాల ఆధారంగా తీసివేయాలి. 

పక్షుల బెడద : 

ఈ పంటకు ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ. వీటి నివారణకు పైరును పెద్ద కమతాలతో వేయాలి. మెరుపు రిబ్బనులను పైరుపైన అడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బనుపై పడేటట్లు ఉత్తర, దక్షిణ దిశగా కట్టాలి. శబ్దం చేయడం వల్ల కాని, దిష్టి బొమ్మలను  ఉపయోగించి కాని పక్షులను తరిమికొట్టాలి.

పంట కోత : 

తల రంగు ఆకుపచ్చ నుండి నిమ్మ పసుపు రంగుకు మారినప్పుడు పక్వానికి వచ్చినట్లుగా గుర్తించవచ్చు. ఇది దాదాపు పూత తరువాత 40-45 రోజులు తీసుకుంటుంది. తలాన్ని ఒక్కసారిగా కోత చేపట్టవచ్చు. సంకర విత్తనోత్పత్తిలో మగ వరుసలు ముందుగా కోసిన తరువాతనే ఆడ వరుసలను కోసుకోవాలి. పక్వతను ముందుగా పొందడానికి ఎస్త్రషశ్రీ 2 ను 8 కిలోలు ఎకరానికి వేసుకోవాలి.

నూర్పిడి : 

కోత తరువాత తలలను 15-18 తేమ శాతానికి ఆరబెట్టి తరువాత గింజలను వేరు చేయాలి.  

ఆరబెట్టుట : 

తలల నుండి వేరు చేసిన విత్తనాలను 10-12 శాతం తేమ వచ్చే వరకు ఆరబెట్టాలి.

ఈ విధంగా రబీ సమయంలో వేసుకునే ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తున్నట్లయితే నాణ్యమైన విత్తన దిగుబడిని పొందవచ్చు.