వరి పంట వివిధ దశల్లో వివిధ రకాలైన పురుగులు మరియు తెగుళ్ళ తాకిడికి గురి అవుతున్నది. అంతేగాక ఈ పంట వివిధ వాతావరణ పరిస్థితుల్లో, పంటకాలల్లో పండించబడడం వల్ల, ఎరువులు మోతాదుకు మించి వేయడం వల్ల, రసాయనిక మందులు విచక్షణారహితంగా వాడడం వల్ల, పంట మార్పిడి పాటించకపోవడం వల్ల, ఈ చీడపీడల ఉధృతి మరింత పెరుగుతున్నది. అయితే ఈ చీడపీడలను నివారించే క్రమంలో రైతాంగానికి సరైనటువంటి అవగాహన లేకపోవుటవల్ల, సిఫార్సు చేసినటువంటి మందులు వాడకపోవుట వల్ల, ఒకే రకమైన రసాయనాలను తరచుగా వాడడం వల్ల ఖర్చు పెరిగి రైతకు భారంగా మారింది. రసాయన మందులు వాతావరణ కాలుష్యంతో పాటు, మిత్ర పురుగులు, ఇంకా సహజ శత్రువులు నాశనమై పురుగుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి నివారణ కష్ట తరమవుతుంది. సరైన సమయంలో, సరైన మోతాదుల్లో మందులు పిచికారి చేస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల కొంత మేరకు సాధ్యమవుతుంది. వరిలో ఆశించే వివిధ రకాల చీడపురుగులు వాటి సస్యరక్షణ వివరాలు

కాండం తొలిచే పురుగు : :

ఇది వరి పైరును ఆశించే పురుగుల్లో ప్రధనామైనది. ఇది నారుమడి దశ నుండి పైరు ఈనిక దశ వరకు ఆశిస్తుంది. తెల్ల పురుగులు ముదురు ఎండు గడ్డి రంగులో ఉండి రెక్కలపై నల్లటి చుక్కని కలిగి ఉంటాయి. ఈ తల్లి పురుగులు ఆకుల చివరి భాగంలో ఊలుతో కప్పబడిన 100-150 గుడ్లను గుంపులుగా పెడుతుంది. ఈ గుడ్లు నుండి పొదగబడిన పిల్ల పురుగులు కాండం లోపలకు చేరి లోపలి భాగాన్ని తినివేస్తూ ఉంటాయి. ఈ పురుగులు వరి పంటను పిలకలు వేసేదశలోనూ, వెన్ను పాలుపోసుకొనే దశలోను ఆశించి నష్టం కలుగజేస్తాయి. పిలకలు వేసే దశలో ఆశిస్తే మెకువ్వు చనిపోతుంది. కాబట్టి ఈ పురుగుని మెకువ్వు పురుగని అంటారు.ఈ పురుగు చేను ఈనిన తరువాత ఆశిస్తే తయారువుతున్న గింజలకు పోషక పదార్ధాలు అందక కంకి తెల్లగా ఎండిపోయి తాలుగింజలుగా మారిపోతాయి. ఈ ఎండిన తెల్ల కంకిని లాగితే సులువుగా ఊడిపోతుంది. అందుకని ఈ పురుగుని తెల్లకంకి పురుగు అని అంటారు. మెకువ్వు దశలో కన్నా వెన్నుకంకి దశలో ఎక్కువగా నష్టం కలుగుతుంది.

నివారణ :

నారుమడిలో ఒక చ.మీ. ఒక తల్లి పురుగు లేదా ఒక గుడ్ల సముదాయం, పిలకదశలో 5 శాతం చచ్చిన మెకువ్వులు లేదా చ.మీ. ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయానికి మించి ఉంటే సస్యరక్షణ చర్యలు ప్రారంభించాలి.

ఈ పురుగు యెకుక్క కోశస్థ దశలను నాశనం చేయుటకు వేసవి లోతు దుక్కులు చేయాలి.

నారు పీకబోయే ముందు ఒక సెంటు నారుమడికి 150 గ్రా. నోవా అగ్రి సైన్సెస్‌ నోవా ఫ్యూరాన్‌ గుళికలు పలుచుగా నీరు పెట్టి చల్లుకోవాలి.

నాటుటకు ముందు నారు కట్టల చివర్లను తుంచడం ద్వారా ఈ పురుగు యెకుక్క గుడ్ల సముదాయాలను నిర్మూలించవచ్చు.

పురుగును గమనించి నివారించడానికి నోవా అగ్రిటెక్‌ వారి ఫన్నెల్‌ ట్రాప్స్‌ను ఎరతో కలిపి ఎకరాకు 8 నుండి 10 వరకు అమర్చాలి.

పిలకదశ మరియు పైరు ఈనిక దశలో ఆశించిన పురుగును నోవా అగ్రిటెక్‌ వారి టెర్మినేటర్‌ 250 మి.లీ. / ఎకరానికి లేదా కాస్మో ప్లస్‌ 100 మి.లీ./ ఎకరానికి పిచికారి చేసుకోవడం వల్ల పురుగును పూర్తిగా నివారించుకోవచ్చు.

పంట పిలకలు తొడిగే దశలో కాండం తొలిచే పురుగు నివారణకు నోవా అగ్రి సైన్సెస్‌ వారి సింగం 0.5 మి.లీ. లేదా నోవా అగ్రి సైన్సెస్‌ వారి బాద్‌షా 50 ఇ.సి. 1.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

పంట చిరుపొట్ట / అంకురం ఏర్పడిన 10-15 రోజులకు నోవాఫ్యురాన్‌ గుళికలు ఎకరాకు 10 కిలోలు లేదా షేర్‌ఖాన్‌ 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

ఆకుముడత :

వరికి ఈ మధ్య కాలంలో ఆశించే మరొక ప్రధానమైన పురుగు ఆకుమడత. దీనినే ఆకుచుట్ట అని, నల్ల తెగులని, తెల్ల తెగులని వివిధ ప్రాంతాల్లో వివిధ రాకాలుగా పిలుస్తారు. ఈ పురుగు యెకుక్క గొంగళిపురుగు దశ వరి ఆకు రెండు అంచులను కలిపి గొట్టంలా చేసి గోకి తినడం వల్ల ఆకులు తెల్లగా ఎండిపోయినట్లు కనిపిస్తాయి. బెట్ట పరిస్థితులు, నీడ ఉన్న చోట్ల దీని ఉధృతి ఎక్కువుగా ఉంటుంది. ఆలస్యంగా నాట్లు వేసి అధిక మోతాదుల్లో నత్రజని వాడినప్పుడు మరియు వెడల్పాకు కలిగి ఉండే వరి రకాల్లో ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది.

నివారణ :

దుబ్బుకు ఒక గొంగళి పురుగు లేదా పొట్టాకు దశలో దుబ్బుకు 2 పురుగులు సోకిన ఆకులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు ప్రారంభించాలి.

ఈ పురుగును ట్రైకోగ్రామా పరాన్న జీవులను ఉపయోగించి గుడ్డు దశలోనే నిర్మూలించవచ్చు.

పైరు పై తాడులాగుట వల్ల ఆకుముడత గొంగళి పురుగులు నీటిలో పడతాయి.

పిలకదశ మరియు పైరు ఈనిక దశలో ఆశించిన పురుగును నోవా అగ్రిటెక్‌ వారి టెర్మినేటర్‌ 250 మి.లీ. / ఎకరానికి లేదా కాస్మో ప్లస్‌ 100 మి.లీ./ ఎకరానికి పిచికారి చేసుకోవడం వల్ల పురుగును పూర్తిగా నివారించుకోవచ్చు.

నోవా ప్యాంతర్‌ 1 మి.లీ. లేదా బాద్‌షా 50 1.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి లేదా నోవా డాన్‌ 4 జి గుళికలను 8 కిలోలను ఇసుకలో కలిపి జల్లాలి.

సుడిదోమ :

సుడి దోమలో గోధుమ రంగు దోమ, తెల్ల రంగు దోమలుంటాయి. వీటిలో పొడుగు, పొట్టిరెక్కల ఆడ, మగ పురుగులుంటాయి. ఇవి గుడ్లను ఆకు తొడుగుపై నిలువు చారలుగా పెడతాయి. వీటి తెల్ల, పిల్ల పురుగులు దుబ్బుల మెకుదళ్ళ వద్ద చేరి మెకుక్కల పోషక కణజాలం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మెకుక్కలు వాడి, ఎండిపోతాయి. సాధారణంగా సుడిదోమ పురుగులు గట్ల వెంట తక్కువుగా, పొలం మధ్యలో ఎక్కువుగా ఉంటాయి. దోమ ఆశించిన వరి పోలాలను సులభంగా గుర్తించవచ్చు. గోధుమ రంగు దోమ ఆశించిన వరి పైరు వలయాకారంలో సుడులుసుడులుగా పైరు ఎండిపోతుంది. దీన్నే సుడిదోమ, దోమపోటు లేదా హోపర్‌బర్న్‌ అని పలుపేర్లతో పిలుస్తారు. అదే తెల్ల రంగు దోమ ఆశించిన వరిపోలం వలయాకారంలో కాకుండా సమాంతరంగా ఎండిపోతుంది. ఈ దోమ గ్రాసీ స్టంట్‌, రాగ్డ్‌్‌ స్టంట్‌ అనే రెండు వైరస్‌ తెగుళ్ళును వ్యాపింజేస్తాయి.

నివారణ :

దీని ఉధృతి పొట్టి వరి రకాల్లో అధికంగా ఉంటుంది మరియు అధిక నత్రజని ఎరువులు వాడకం, గాలిలో అధిక తేమ పరిస్థితుల్లో దీని అభివృద్ధి ఎక్కువుగా ఉండి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి.

దోమలకు తట్టుకునే రకాలైన విజేత, కాటన్‌ దొర సన్నాలు, ఇంద్ర, అమర, గోదావరి, తొలకరి, వజ్రం, ప్రతిభ, చైతన్య, కృష్ణ వేణి, నంది, దీప్తి, విజేత, త్రివేణి వంటి రకాలను సాగుచేసుకోవాలి.

సకాలంలో విత్తడంతో పాటు నాటేటప్పుడు ప్రతి రెండు మీటర్లకు 20 సెం. మీ. కాలి బాటలు వదలాలి. వీటి వల్ల గాలి, వెలుతురు బాగా ప్రసరించి దోమ వృద్ధి చెందదు.

చేనును అడపాదడపా ఆరబెట్టాలి.

పైరు తొలిదశలో రసాయనిక పురుగు మందుల వినియోగాన్ని తగ్గించుకొని, మిత్ర పురుగులైన, మిరిడ్‌ నల్లులు, సాలిపురుగులు, అక్షింతల పురుగులను సంరక్షించుకోవాలి.

దుబ్బుకి పిలకలు వేసే దశలో 10-15 పురుగులు ఈనిన తరువాత 20-25 పురుగుల కంటే ఎక్కువగా ఉంటే పురుగు మందులు పిచికారి చేయాలి. అవసరమైతే 15 రోజుల తరువాత మందును మార్చి మరోసారి పిచికారి చేయాలి.

సుడిదోమను నివారించి మొక్క బలంగా పెరగడానికి నోవా వారి హూపర్‌ 50 గ్రా. లేదా ఎన్‌-క్లీన్‌ 250 మి.లీ. లేదా నోవో పవర్‌ 50 గ్రా. ఎకరానికి పిచికారి చేసుకోవాలి.

అంకురం ఏర్పడే దశలో ఎకరానికి 10 కిలోల నోవా ఫ్యూరాన్‌ 3 జి గుళికలను లేదా బుప్రోఫెజిన్‌ 1.6 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌+ ఎధిప్రోల్‌ 0.25 గ్రా. లేదా పైమెట్రోజెన్‌ 0.5 గ్రా. లేదా ఇధోఫెన్‌ ప్రాక్స్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి దుబ్బుల మెకుదళ్ళు తడిచేలా ఎకరానికి 200 లీ. మందు ద్రావణానికి తగ్గకుండా పిచికారి చేయాలి.

పురుగు మందులు చల్లే ముందు పొలంలో నీటిని తీసివేయాలి.

పవర్‌ స్ప్రేయర్‌ వాడితే మందు మోతాదును 2.5 రెట్లు, తైవాన్‌ స్ప్రేయర్‌ అయితే 1.5 రెట్లు పెంచి వాడుకోవాలి.

ఉల్లికోడు :

ఈ పురుగును దుంపరోగం లేదా ఉల్లికోడు లేదా గొట్టపు రోగమని కూడా అంటారు. ఈ పురుగు దోమజాతికి చెందినది. ఇది ఎరుపు రంగులో ఉండి ఒక జత రెక్కలను కలిగి ఉంటుంది. తల్లిపురుగు 100-200 గుడ్లను పిలకలపై పెడుతుంది. గుడ్ల నుంచి పొదిగిన పిల్లపురుగులు కాండంలోనికి తొలచుకొనిపోయి అంకురం వృద్ధి చెంది కోశస్ధదశకు మారుతుంది. ఆ సమయంలో అక్కడ జరిగిన రసాయనిక మార్పుల వల్ల అంకురం ఆకుగా వృద్ధి చెందక ఆకుపచ్చని పొడవాడి గొట్టంగా మార్పుచెంది ఉల్లికోడువలే బయటకు వచ్చి పిలకలు వేయక క్రమేపి ఎండిపోతుంది. వరినాట్లు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో ఈ పురుగు తాకిడి అధికంగా ఉంటుంది.

నివారణ :

ఉల్లికోడును తట్టుకునే వరి వంగడాలను నాటుకోవాలి. ఉదా : సురేఖ, సురక్ష, ఫాల్గుణ, పోతన, కావ్య, దివ్య, ఎర్రమల్లెలు, అభయ, ధాన్యలక్ష్మీ, శ్రీకాకుళం సన్నాలు, వసుంధర, రుధ్రమ మెకుదలగునవి.

పంటను తొందరగా వేసుకున్నట్లైతే పంటను రక్షించువచ్చు. ప్రధాన పొలంలో 5 శాతం ఉల్లి గొట్టాలున్నా లేదా దుబ్బుకి ఒక ఉల్లికోడు సోకిన పిలకలున్నా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

నారుమడిలో నారు తీతకు వారం రోజులు ముందు 5 సెంట్లు నారుమడికి కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు 800 గ్రా. లేదా నోవా ఫోరేట్‌ 10 జి గుళికలు 250 గ్రా. వేయాలి.

ప్రధాన పొలంలో నాటిన 15 రోజులకు నోవా ఫ్యురాన్‌ గుళికలు 10 కిలోలు లేదా నోవా ఫోరేట్‌ 10 జి గుళికలు 5 కిలోలు ఒక ఎకరానికి వేయాలి. తరువాత 15 రోజులకు అవసరమైతే క్లోరోఫైరిపాస్‌ 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తాటాకు తెగులు :

ఈ పురుగు నలుపురంగులో ఉండి, వీపుపై చిన్నచిన్న ముళ్ళు కలిగి ఉంటుంది. తల్లి పురుగు 30-100 గుడ్లను ఆకుచివరన కానీ ఆకు వెనుక భాగాన కానీ పెడుతుంది. తల్లి, పిల్ల పురుగులు ఆకు పై భాగాన్ని గోకి తినడం వల్ల చారలు, చారలుగా ఆకు పై తెల్లని మచ్చలు ఏర్పడి ఎండిపోతాయి. ఈ పురుగు ఎక్కువుగా వర్షాభావ పరిస్థితుల్లో వరినారు మడిలో ఆశిస్తుంది.

నివారణ :

వరి నాటేటప్పుడు నారు కట్టల కొనలను తుంచి నాటాలి.

నోవా అగ్రి సైన్సెస్‌ వారి సింగం 0.5 మి.లీ. లేదా క్లోరోఫైరిఫాస్‌ 2 మి.లీ. లేదా నోవా అగ్రి సైన్సెస్‌ వారి రాక్‌స్టార్‌ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

కంపునల్లి :

ఈ పురుగు ఉధృతి తెలంగాణ జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో అధికంగా ఉంటుంది. తల్లి పురుగు వరి ఆకుకు ఇరువైపులా 250-300 గుడ్లను ఒకటి లేదా రెండు వరుసల్లో పెడుతుంది. దీని తల్లి, పిల్ల పురుగులు గింజ పాలుపోసుకునే సమయంలో పంటను ఆశించి గింజలు నుండి రసంపీల్చడం వల్ల తాలుగింజలు ఏర్పడతాయి. అంతే కాకుండా ఈ పురుగు ఆశించిన పొలం నుండి దుర్గంధమైన చెడువాసన వస్తుంది. ఈ వాసన బియ్యానికి కూడా వచ్చి తినడానికి పనికిరావు. గింజపై చిన్న గోధుమ మచ్చ ఏర్పడుతుంది.

నివారణ :

కలుపు వెకుకుక్కలను తొలగించాలి.

దుబ్బుకి 1-2 పురుగులు ఉన్నట్లయితే క్లోరిపైరిఫాస్‌ (2 మి.లీ.) లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

పిచికారి సాయింత్రం వేళల్లో ఒక వలయాకారంలో పొలం బయట నుంచి లోపలకు పిచికారి చేయాలి.

పొడ తెగులు :

పొడ తెగులు సాధారణంగా పైరు తర్వాతి దశలలో రైజోక్టనియా సోలని అనే సిలింద్రం వల్ల ఆశిస్తుంది. దుబ్బు చేసే దశలో లేదా కణుపులు సాగే తొలి దశలలో (దాదాపు నీరు కట్టిన 10-15 రోజుల తరువాత) నీటి మట్టానికి దగ్గరగా, అడుగున ఉన్న ఆకులు, మట్టలపై మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు సాధారణంగా ఆకు మొదళ్ళలో ఆకుపచ్చ కలిసిన ఊదా రంగులో పొడవుగా కోలగా, నీటి డాగు మచ్చలలాగ మొదలౌతాయి. ఆకులు పండిపోయాక ఈ మచ్చలు ఎండి ముదురు గోధుమ రంగు అంచులు కల బూడిద రంగు మచ్చలుగా మారతాయి. దీని వల్ల పైరు ఎండిపోయి కుళ్ళి పోతుంది. వెన్ను దశలో ఆశిస్తే వెన్ను కుళ్ళిపోయే అవకాసం ఉంది.

అనుకుల వాతావరణం :

గాలిలో ఉగ్రతలు 25-280 సెం.మధ్య ఉంటూ, గాలిలో తేమ 90 శాతం కంటే ఎక్కువగా ఉండి మబ్బులతో కూడిన వర్షం ఎక్కువ రోజులు కురుస్తుంటే ఈ తెగులు త్వరగా వ్యాపిస్తుంది. సిఫార్సు చేసిన దాని కంటే ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువు వేస్తే తెగులు తాకిడి మరింత పెరుగుతుంది.పైరు నేతిలో మునిగినప్పుడు లేదా ఎక్కువ తేమ ఉన్నప్పుడు కూడా ఈ తెగులు వ్యాప్తి అధికం. వెన్ను పైకి వచ్చు దశ నుండి, పాలుపోసుకునే దశ మధ్యలో, తరచూ వర్షాలు పడుతున్నప్పుడు, ఆకాశం మేఘావతమైనప్పుడు ఈ తెగులు వేగంగా వ్యాపిస్తుంది.

నివారణ :

గట్లపైన, చేనులో కలుపు లేకుండా చూడాలి.

అధిక మోతాదులో నత్రజని వాడరాదు.

నోవా వారి కోంబాట్‌ 5 ఇ 2 మి.లీ. లేక బేబీలాన్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి మందు ద్రావణాన్ని 15 రోజులకొకసారి రెండు పర్యాయాలు పిచికారి చేయాలి.

పొడ తెగులు అగ్గి తెగులు కలిపి ఆశించిన ప్రాంతాల్లో ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్‌ + టేబ్యూకనజోల్‌ మిశ్రమం పొడి 80 గ్రా. చొప్పున 200 లీ. నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

అగ్గి తెగులు :

సాధారణంగా పైరిక్యులేరియా గ్రిసియా అనే శిలీంద్రం కారణంగా వరి పైరుకు అగ్గి తెగులు సోకుతుంది. ఈ సిలింద్రం ఎక్కువగా పంట లేని సమయంలో పొలం గట్లపై పెరిగే తుంగ, గరిక, ఊద, గాటేరు వంటి గడ్డి జాతి మొక్కల మీద పెరుగుతుంది.మబ్బుతో కూడిన వాతావరణం ఏర్పడి, అనుకూలంగా ఉన్నప్పుడు ఈ శిలీంద్రం త్వరగా పెరిగి బీజాలను ఉత్పత్తి చేస్తుంది. శిలీంద్ర బీజాలు గాలి ద్వారా వ్యాపిస్తూ వరి పంటపై దాడి చేస్తాయి. వీటివల్ల ముందుగా ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. అవి క్రమేపీ నూలు కండె ఆకారానికి మారతాయి. మచ్చల అంచులు ముదురు గోధుమ రంగులో, వాటి మధ్య భాగం బూడిద రంగులో కన్పిస్తాయి. తెగులు ఉధ తి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులపై మచ్చలు పెద్దవై ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. దీంతో పైరు పాక్షికంగా లేదా పూర్తిగా ఎండుతుంది. మొక్కలు ఎండి కాలినట్లు పైరంతా తగలబడినట్టు కన్పిస్తాయి. అందుకే దీనిని అగ్గి తెగులు అని పిలుస్తారు.

అనుకుల వాతావరణం :

వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 15-200 సెం. మధ్య ఉంటూ, గాలిలో తేమ 90 శాతం కంటే ఎక్కువగా ఉండి వానలు లేదా మంచు కురుస్తుంటే అగ్గి తెగులు త్వరగా వ్యాపిస్తుంది. సిఫార్సు చేసిన దాని కంటే ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువు వేస్తే తెగులు తాకిడి మరింత పెరుగుతుంది. సాంబ మశురి, స్వర్ణ వంటి రకాలలో ఈ తెగులు ఉధ తి ఎక్కువగా ఉంటుంది.

నష్ట లక్షణాలు :

పిలకలు వేసే సమయంలో అగ్గి తెగులు సోకితే వరి పైరు కురచగా మారి తక్కువ పిలకలు వేస్తుంది.

ఈ తెగులు కణుపులకు సోకినప్పుడు అవి గోధుమ / నలుపు రంగుకు మారతాయి. కణుపు భాగం విరిగిపోతుంది. కంకుల మెడ భాగానికి తెగులు సోకితే నష్టం అధికంగా ఉంటుంది. ఆ భాగం ముదురు గోధుమ / నలుపు రంగుకు మారి కణజాలం కుళ్లుతుంది.

వరి వెన్నులు మెడ వద్ద విరిగి కిందికి వాలిపోతాయి. ఫలితంగా వెన్ను భాగానికి పోషకాల సరఫరా ఆగిపోయి, గింజలు తాలుగా మారతాయి. దీనినే మెడవిరుపు తెగులు అంటారు.

నివారణ మార్గాలు :

అగ్గి తెగులు నివారణకు పొలం గట్ల మీద, పొలం లోపల ఉన్న గడ్డి జాతి కలుపు మొక్కల్ని తొలగించాలి.

నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదులోనే 3-4 దఫాలుగా వాడాలి.

తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే ట్రైసైక్లోజోల్‌ 75 శాతం 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలేన్‌ 40% 1.5 మీ.లి. లేదా కాసుగా మైసిన్‌ 2.5 మీ.లి. చొప్పున కలిపి పైరు బాగా తడిసేలా 15 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.

కాండం కుళ్ళు తెగులు :

ఈ తెగులు చివరి దశలో అనగా పిలకలు తొడిగే దశ నుండి పాలు పోసుకునే వరకు సోకే అవకాశం ఉంది. ముందుగా దుబ్బులోని ఒక కర్ర లేదా పిలకలోని కింది వరుసలోని ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేణా దుబ్బులోని పిలకలు మొత్తం ఎండిపోతాయి. వ్యాధి తీవ్రమయ్యే కొలది పొలంలోని పైరు పక్వానికి రాకముందే ఎండిపోవడం జరుగుతుంది. మొదలు వద్ద ఉన్న కణం లోపలి భాగం కుళ్ళిపోవడం వల్ల పిలకలు మెత్తబడి పైరు వాలిపోతుంది. కాండం కుళ్ళు ఆశించినప్పుడు పిలకలు చీల్చి చూసినప్పుడు లోపలి భాగం ముదురు గోధుమ లేదా నలుపు రంగుకు మారి ఉంటుంది. ఇటువంటి రంగు మార్పు కణుపుల వద్ద ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా ఎండిన పిలకలను పరిశీలించినప్పుడు లోపలి భాగంలో నల్లని చిన్న చిన్న శిలీంద్ర బీజాలు కనిపిస్తాయి.

తెగులు వ్యాప్తికి దోహదపడే అంశాలు :

ఈ తెగులు కారక శిలీంద్రం భూమిలో ఎక్కువకాలం జీవించి ఉ ంటుంది. సాగు నీటి ద్వారా, విత్తనం ద్వారా ఒక ప్రదేశం నుండి వేరొక చోటికి వ్యాపిస్తాయి.

వరి పండించే ప్రాంతాల్లో మురుగు నీరు పోయే వ్యవస్థ సరిగా లేనప్పుడు కాండం కుళ్ళు తెగులు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వ్యాపించే అవకాశం ఉంది.

వరి పంటలో పోషకాలు సమతుల్యంగా లేక బలహీనపడి మొక్కల్లో, సుడిదోమ, కాండం తొలుచుపురుగు ఆశించినప్పుడు, అవి ఏర్పరచిన గాయాల ద్వారా తెగులు కారక శిలీంద్రాలు వ్యాప్తి చెందుతాయి.

వాలిపోయే పైరులో ఈ తెగులు వృద్ధి ఎక్కువగా ఉంటుంది.

నత్రజని, భాస్వరం ఎరువులను నేలలో వేసినప్పుడు ఈ పోషకాలు శిలీంద్రం త్వరగా వ్యాప్తిచెందుటకు దోహదపడతాయి.

బరువైన నేలలో వరి తరువాత వరి పండించే విధానంలో కూడా తెగులును కలుగచేసే శిలీంద్రం క్రమంగా ఉధృతి స్థాయికి చేరవచ్చు.

తీసుకోవల్సిన యాజమాన్య చర్యలు :

తెగులు ఆశించిన పొలాన్ని పంట కోత తరువాత వేసవి సమయంలో లోతు దుక్కి చేయాలి.

పొలంలో గత పంటకు సంబంధించిన మోళ్ళు, ఇతర పంట అవశేషాలు లేకుండా శుభ్రం చేయాలి.

తెగులు సోకిన పొలంలో పంట కోసిన తరువాత గడ్డి పరచి తగుల పెట్టాలి.

విత్తనంలో తేమ శాతం14 కి. మించకుండా బాగా ఎండనిచ్చి, గాలికి తూర్పారబట్టి, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేయాలి.

తెగులు సోకని పొలం నుండి విత్తనం సేకరించుకోవాలి. విధిగా విత్తనశుద్ధి చేయాలి.

పొలంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి.

సుడిదోమ, కాండం తొలుచు పురుగులను సకాలంలో నివారించుకోవాలి.

కాండం కుళ్ళు తెగులు ఆశించిన పంటను కోసేటప్పుడు మొదళ్ళ వరకు కోయాలి. పొలంలో పంట అవశేషాలను తొలగించి పొలాన్ని శుభ్రంగా ఉంచాలి.

శిలీంధ్ర నాశనులను పిచికారి చేసే సమయంలో పొలంలో నీటి మట్టాన్ని బాగా తగ్గించాలి.

తెగులు ప్రారంభ చిహ్నాలు గమనించిన వెంటనే హెక్సాకొనజోల్‌ (2 మి.లీ / లీటరు నీటికి) లేదా వాలిడామైసిన్‌ (2 మి.లీ / లీటరు నీటికి) లేదా బినోమిల్‌ (1 గ్రా. / లీటరు నీటికి) పిచికారి చేసి నివారించుకోవాలి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్న ఎడల నాటివో (0.4 గ్రా. /లీటరు నీటికి) ఎకరానికి 80 గ్రా. చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు.

పత్తి వెంకటనారాయణ, వీ.రష., (ూస్త్రతీఱ), ప్లాంట్‌ ఫిజియాలజి, ఫోన్‌ : 8247083031