మొక్కజొన్నలో కత్తెరపురుగు ఈ సంవత్సరం నుండి పంటను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. దీన్ని ''ఫాల్‌ ఆర్మివామ్‌'' అని కూడా అంటారు. కత్తెరపురుగు 80 రకాల పంటలను ఆశించినప్పటికి మన రాష్ట్రంలో మొక్కజొన్నపై ఆశిస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది.

కత్తెర పురుగును మొట్టమొదటగా ఈ సంవత్సరం షిమోగా జిల్లా మే 2018 సం||లో గుర్తించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆగష్టు మొదటి పక్షంలో కత్తెరపురుగు మొక్కజొన్న పంటపై ఆశించినట్లు గుర్తించారు.

పంట నష్ట పరిణామాలు :

మొదటిదశ లార్వాలు ఆకులపై పత్రహరితాన్ని గోకి తినడంవల్ల ఆకులపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.

రెండవదశ, 3వ దశ లార్వాలు ఆకుసుడుల్లో ఉంటూ తినడం వల్ల కొత్తగా విచ్చుకున్న ఆకులపై వరుస రంధ్రాలు గమనించడం జరుగుతుంది.

ఈ పురుగులు సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరిస్తాయి. ఎదిగిన లార్వాలు ఆకులను వెలుపలి నుండి పూర్తిగా తిని ఈనెలను మాత్రమే మిగులుస్తాయి.

కంకి ఏర్పడిన తరువాత పొరలను తొలుచుకొని లోపలి గింజలను తిని నష్టపరుస్తాయి.

సమగ్ర సస్య రక్షణ చర్యలు :

కత్తెర పురుగు ఉధృతిని తగ్గించుటకు పప్పుజాతి పంటలను అంతరపంటగా వేయాలి.

మొక్కజొన్న చుట్టూ ఖ వరుసల్లో నేపియర్‌ గడ్డి అనే పశుగ్రాసం వేయడం వల్ల ఈ పురుగులు ఆ గడ్డిపై గుంపులు గుంపులుగా గుడ్లను పెడతాయి కాబట్టి వీటిని ఏరి నాశనం చేయాలి.

మొదటి దశ పురుగుల నివారణకు వేప మందైన అజాడిరెక్టిన్‌ (1500 జూజూఎ) 5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

రెండవ దశ లార్వాలను నివారించుటకు స్పైనోశాడ్‌ 0.3 మి.లీ., ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా., ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బెంజోయేట్‌ 0.4 గ్రా., ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎదగిన లార్వాలను నివారించుటకు క్లోరాంట్రనిప్రోల్‌ 0.3 మి.లీ., ఇండాక్సాకార్బ్‌ 1 మి.లీ. థయోమిధాక్సామ్‌ మరియు లామ్టాసైహలోత్రిన్‌ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను వాడాలి. దీన్ని 10కి. తవుడు, 2 కిలోల బెల్లం, నీరు 2-3 లీటర్లతో కలుపుకొని విషపు ఎరను తయారు చేసి మొక్క సుడుల్లో ఉదయం, సాయంత్రం వేసుకున్నట్లయితే కత్తెర పురుగును నివారించవచ్చు.

ఎ. శ్రీనివాస్‌, ఆర్‌. శ్రీనివాస్‌, ఎమ్‌.ఎస్‌.సి., (హార్టి) బి.వి.ఎస్‌ కిరణ్‌, పి.హెచ్‌.డి. స్కాలర్‌ (అగ్రోనమి)

ఆచార్య ఎన్‌.జి.రంగా యూనివర్శిటీ, ఫోన్‌ : 9381304582, 8121990380