ప్రస్తుత కాలపు వాతావరణ మార్పు, ప్రతికూల వాతావరణం, గులాబీ రంగు పురుగు మెత్తంగా 60-70 శాతం వరకు కాయ రాలిపోవడానికి కారణమవుతున్నాయి. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యాయాన్ని ఆచరించడం ద్వారా ఈ నష్టాన్ని తగ్గించి, దిగుబడులు పెంచవచ్చును. రైతులు రసాయనిక ఎరువులను కాకుండా జీవన మరియు సేంద్రియ ఎరువులను వాడకాన్ని పెంచి పైరు మరియు వాతావరణ సమతుల్యతను పెంపొందించవచ్చును. ఈ శీర్షికలో వివిధ రకాల ప్రకతి ఎరువులు, వాటిని వేసే విధానాలు మరియు వాటి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.

పశువుల ఎరువు :

5-6 టన్నుల బాగా చిదిమిన పశువుల ఎరువును ఎకరాకు వేయడం ద్వారా 15-20 శాతం దిగుబడిని పెంపొందించవచ్చును.

జీవన ఎరువులు :

అజాతోబాక్టర్‌, అజోస్పిరిల్లం పైరుకు మంచి నత్రజనిని అందిస్తాయి. (అధిక యూరియా వాడకం పైరుపై జీవన ఎరువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. నత్రజనిని సిఫార్సు చేసిన మొత్తంలోనే వేయడం ద్వారా వీటి సామర్థ్యం పెంచవచ్చు). సాధారణంగా పైరుకు కింద ఇవ్వబడిన మొత్తంలో ఎరువులు ఆంధ్ర ప్రాంతంలో అవసరం అవుతాయి.

నత్రజని భాస్వరం పొటాష్‌
అమెరికన్‌ పత్తికి 30 18 18
సంకర జాతి పత్తికి 48 24 24

గమనిక :

సిఫార్సు చేసిన భాస్వరం మొత్తం ఒకేసారి చివరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి.

నత్రజని మరియు పోటాష్‌లను మాత్రం 3 సమభాగాలుగా చేసి విత్తిన 30, 60 మరియు 90 రోజులకి వేసుకోవాలి.

రసాయనిక ఎరువుల్ని సాధ్యమైనంత తగ్గించుకొని, ఆలా వీలుకాని పరిస్థితుల్లో మిశ్రమ ఎరువులను కాకుండా, సూటి ఎరువులను అందించడం పైరుకు మరియు నేల మంచిది మరియు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది.

రసాయనిక ఎరువుల్ని సాధ్యమైనంత తగ్గించుకొని, ఆలా వీలుకాని పరిస్థితుల్లో మిశ్రమ ఎరువులను కాకుండా, సూటి ఎరువులను అందించడం పైరుకు మరియు నేలకు మంచిది మరియు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది.

పోటాష్‌ ధాతువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంపొందించి మంచి దూది నాణ్యతను కూడా పెంచుతుంది.

2 శాతం నత్రికామ్లం పూత మరియు కాయ అమరే దశలో మొక్కల మీద పిచికారీ చేయాలి. ఇది కాయ నిలుపుదలను పెంచి, మంచి దిగుబడిని ఇస్తుంది.

ముఖ్యమైన సూక్ష్మ ధాతు లోపాల గుర్తింపు మరియు నివారణ :

మెగ్నీషియం :

ముదురు ఆకులు అంచుల నుండి మధ్య భాగానికి పచ్చగా మారతాయి. ఈనెలు మాత్రం ఆకుపచ్చగానే ఉంటాయి. ఆకులు ఎర్రబారతాయి.

నివారణ :

10 శాతం మేగ్నెషియం సల్ఫేటు ద్రావాన్ని ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పంట 45-75 రోజుల దశలో ఉన్నప్పుడు రెండు సమదఫాలుగా చేసి పిచికారీ చేసుకోవాలి.

జింక్‌ :

మొక్క మధ్య ఆకుల మీద ఏ ధాతు లోప లక్షణాలు కనిపిస్తాయి. ఈనెలు ఆకు పచ్చగా మారి ఈనెల మధ్య పసుపు పచ్చగా మరియు కొమ్మల చివర్ల చిన్నగాను మడత పడి ఉంటాయి.

నివారణ :

జింకు సల్ఫేటు 2 గ్రా. లీటరుకు కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల చొప్పున 5-6 రోజుల తేడాలో 2-3 సార్లు వేసుకోవాలి.

బోరాన్‌ :

బోరాన్‌ లోపం ఈ మధ్యకాలం ఓ అతి సాధారణంగా అన్ని రకాల మత్తికల్లో గుర్తించబడింది. మెట్ట పైరు మరియు ముంపుకి గురైన పరిస్థితుల్లో ఈ లోపం అధికంగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల తొడిమలు చిన్నగా ఉండి మందంగా మరియు వంకరటింకరగా తయారవుతాయి. పూత దశలో ఏ లోపం వస్తే కాయ చిన్నగా అయ్యి, ఆకారం మారిపోయి కాయ పరిమాణం మరియు దూది నాణ్యత లోపించి అధిక నష్టాన్ని కలుగజేస్తాయి.

యన్‌. ఏ. ఏ :

ఈ రకం ఆక్సిన్‌ అనే హార్మోను పూత మరియు పిందె రాలడాన్ని నివారిస్తుంది. ఇది 10 పీ పీ యం మోతాదులో రెండు సార్లు 10-15 రోజుల తేడాలో పైరు పూత మరియు పిందె దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. పెరిగిన ఎరువుల ధరలు, మార్కెట్‌లో లోపించిన ఎరువుల లభ్యత రైతుల పాలిటి శాపంగా మారాయి. ఇదీ కాక అతిగా రసాయనిక ఎరువుల వాడకం పైరు, నేలలోని సూక్ష్మ జీవులకు మరియు రైతు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇది రైతుల్ని ఆర్థికంగా నష్టం కలిగిస్తాయి. రైతన్న... ఈ ఎరువుల బరువు తగ్గించి సస్య సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని ఆచరించి మంచి దిగుబడిని మరియు ఆరోగ్యాన్ని కాపాడుకొందాం.

బి. సంతోష్‌, యస్‌ రమేష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఫోన్‌ : 7396524587, 8919501692