మన రాష్ట్రంలో వరి పంట ఖరీఫ్‌ మరియు రబీ కాలాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ కూలీలు లభించినిప్పటికీ చిన్న, సన్నకారు రైతులు భరించలేని కూలీల రేట్లు రైతుల పాలిట పెను సమస్యగా మారాయి. దీని వల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలిగి రైతుకు సాగు ఖర్చులు పెరిగి నికర ఆదాయం తగ్గుతుంది. నూతన విధానంలో సాగు ఖర్చును తగ్గించి వరి సాగును మరింత లాభదాయకంగా చేయడం అత్యంత అవసరం. ఈ నేపధ్యంలో చాలా మంది రైతులు అధిక శ్రమతో కూడిన దమ్ముచేసి నాట్లు వేసే పద్ధతికి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంభించుటకు ఆసక్తి చూపుతున్నారు. దీనిలో భాగంగా వరి నాట్లు వేసి పండించే సాంప్రదాయ పద్ధతి కన్నా విత్తనాలు నేరుగా దమ్ము చేసిన పొలంలో వెదజల్లే పద్దతిలో సాగు చేయటం వల్ల పంట కాలాన్ని కోల్పోకుండా సకాలంలో వరి పంట సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధించి సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక నికర ఆదాయాన్ని పొందవచ్చు.

వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్న రైతు అనుభవాలు గమనించినట్లైతే :

నా పేరు తిరుపతి రెడ్డి కొండపల్కల గ్రామం, మానకొండూర్‌ మండలం. మాకు 14 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో నేను గత 4 సంవత్సరాల నుండి వెదజల్లే పద్దతిలో వరి పంటను సాగు చేస్తున్నాను. ఈ పద్ధతిలో ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరం అవుతుంది. మొదటగా విత్తనాలను గోనె సంచిలో వేసి 24 గంటలు నీటిలో నానబెట్టి తర్వాత చూస్తే విత్తనాలు ముక్కు పగిలి తెల్లగా మోను వస్తుంది. ఈ విత్తనాన్ని దమ్ము చేసి చదును చేసిన పొలంలో, పొలమంతా సమానంగా పలుచటి నీటి పోర ఉంచి మొక్కల సాంద్రత సమంగా ఉండే విధంగా వేదజల్లుతాను. తర్వాత ఒక వారం రోజుల పాటు పలుచగా నీరు పెడ్తాను. ఒకవేళ నీరు ఎక్కువగా ఉంటే కాలువల ద్వార బయటకు తీస్తాను.

వరి మొలకెత్తిన 8 వ రోజు నుండి దుబ్బ(పిలకలు) చేయడం మొదలు పెడుతుంది. ఇలా 50-60 రోజుల వరకు పిలకలు వస్తాయి. అయితే కలుపు సమస్యను, కూలీల సమస్యను అధిగమించటానికి విత్తిన 20 రోజుల తర్వాత శాస్త్రవేత్తల సూచన మేరకు కలుపు మందును తైవాన్‌ స్ప్రేయర్‌ కి 50 మీటర్ల పైప్‌ ను అమర్చి ఒక 4-5 షిఫ్టుల ద్వారా పొలమంతా పిచికారి చేయడం జరిగింది.

ఈ పద్ధ్దతిలో వరి సాగు చేయటానికి తక్కువ పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఎరువులను కూడా చాలా తక్కువగా వాడుతున్నాను. ఒకవేళ ఎక్కువగా వేస్తే పైరు బాగా పెరిగి పడిపోతుంది. నారు పెంపకం, నాటుకూలీ ఖర్చు, కూలీలతో కలుపు తీయు ఖర్చు లేకపోవడం వల్ల సుమారుగా ఎకారానికి రూ. 4000 సాగు ఖర్చు తగ్గుతుంది. సాధారణంగా పండించే వరి పద్ధతితో పోలిస్తే ఈ పద్ధతిలో పంట 10-15 రోజులు ముందుగా కోతకు రావడంతో పాటు అధికంగా దిగుబడిని ఇస్తుంది. నాకు ఉన్న 14 ఎకరాల పొలంలో కేవలం నేను నా భార్య ఇద్దరం కలిసి వరి పంటను వెదజల్లే పద్ధతిలో సులువుగా సాగు చేసుకుంటున్నాం.

నేను మొదటగా శాస్త్రవేత్తలను సంప్రదించి నారు పెంచకుండా వరి సాగు ఏ విధంగా చేయవచ్చు అని అడిగినప్పుడు వారు దమ్ము చేసిన పొలంలో వెదజల్లే పద్ధతిలో మరియు డ్రమ్‌ సీడర్‌తో వరి సాగు విధానం గురించి చెప్పడం జరిగింది. అయితే డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో కూడా కూలీల అవసరం ఉండటం, అదే విధంగా మా పొలం శ్రీ రాం సాగర్‌ ప్రాజెక్ట్‌ ఆయకట్ట కింద ఉండటం వల్ల నీటి సమస్య కూడా లేకపోవడం వల్ల వెదజల్లే పద్దతిలో వరి సాగుకు మొగ్గు చూపడం జరిగింది.

జె. విజయ్‌, సేద్య విభాగపు శాస్త్రవేత్త, డా. ఎన్‌. వెంకటేశ్వరరావు, సీనియర్‌ శాస్త్రవేత్త, హెడ్‌

డి. శ్రీనివాస్‌ రెడ్డి, సస్య రక్షణ శాస్త్రవేత్త, కషీ విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట, ఫోన్‌ : 8500119198