వస ఎండిన రైజోమ్‌లు మత్తు పానీయాలను సుగంధ భరితంగా చేయుటకు బుద్ధి మాంధ్యము, నిస్సత్తువ, మతిమరుపు వ్యాధులలోనూ మాట స్పష్టత కొరకు ఉపయోగిస్తున్నారు. కొమ్మలను ఎక్కువగా ఉబ్బసం, అతిసారం, జీర్ణకోశ సంబంధ వ్యాధులకు మరియు జీర్ణశక్తి వృద్ధి చేయుటకు ఉపయోగిస్తారు. ఇది ఎక్కువ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండించ తగిన పంట.

నేలలు :

తేమగా ఉండే నేలలు, బంక నేలలు, తేలికపాటి ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు అనుకూలం. వరి పంట సాగు చేసే పద్ధతిలోనే దీన్ని కూడా దమ్ము చేసి నీరు నిల్వ ఉంచి సాగు చేయాలి.

వాతావరణం :

ఉష్ణ సమశీతోష్ణ మండలాల్లో సాగుచేయవచ్చు. దీనికి 100-300 సెం. ఉష్ణోగ్రత 70-250 సెం. మీ. వర్షపాతం అనుకూలం.

ప్రవర్ధనం :

వసను దుంపల పిలకల ద్వారా ప్రవర్ధనం చేయాలి. ఎకరానికి 20.000 దుంపల పిలకలు అవసరమవుతాయి.

నాటు సమయం :

జూన్‌-జూలై నెలలో పంటను నాటుకోవాలి.

నాటే దూరం :

వరుస వరుసకు మధ్య దూరం 60 సెం.మీ. మొక్క మొక్కకు మధ్య 30 సెం.మీ. దూరం ఉండాలి.

పంట కాలం :

జూన్‌-జులై నుండి ఫిబ్రవరి-మార్చి వరకు (9 నెలలు)

నేల తయారీ :

వరి సాగు చేసి పద్ధతిగా భూమిని తయారుచేసి ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు 50 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం మరియు 25 కిలోల పొటాష్‌ వేసుకోవాలి. నాటిన 3 నెలలకు ఒకసారి మరియు 6 నెలలకు ఒకసారి 23 కిలోల నత్రజని వేసుకోవాలి.

అంతరకృషి :

మొత్తం పంటకాలంలో 4-5 సార్లు కలుపు తీయాలి. ప్రతిసారి మొక్క మొదలు దగ్గర మట్టి గట్టిగా నొక్కాలి.

సస్యరక్షణ :

ముఖ్యంగా పిండి పురుగు మరియు గొంగళి పురుగులు ఆశిస్తాయి. తెగుళ్ళలో ఆకుపచ్చ ముఖ్యమైనది.

నివారణ :

గొంగళి పురుగు నివారణకు లీటరు నీటికి వేపనూనె 4 మి.లీ. కలిపి ఆకు మీద పిచికారి చేయాలి. అలాగే కాండం చుట్టూ తడపాలి.

ఆకుమచ్చ నివారణకు లీటరు నీటికి 1 గ్రా. మాంకోజెబ్‌ మరియు పిండి పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిపాస్‌ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. తప్పనిసరి పరిస్థితిలో రసాయన మందులు వాడాలి.

కోత :

నాటిన 9 నెలల తరువాత పొలం పాక్షికంగా ఎండబెట్టి నాగలితో దున్ని వేరుకొమ్మలు తీయాలి. వీటిని 5-7 సెం.మీ. పొడవు గల మొక్కలు చేసి కడిగి పీచు వేర్లు తొలగించి గాలి తగిలేచోట నీడలో ఆరబెట్టాలి. ఎండిన తరువాత గరుకుగా రాయికి రుద్ధి పొలుసు తొలగించాలి.

యస్‌. నాగరాజు, డి. రమేష్‌, ఫోన్‌ : 6305871036