మన దేశంలో పండించే వాణిజ్యపంటల్లో పత్తి చాలా ప్రధానమైనది మరియు పత్తి ఉత్పత్తి, నూలు ఎగుమతుల్లో భారతదేశం ప్రధాన పాత్రపోషిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో కుడా అధిక విస్తీర్ణంలో పత్తి సాగులో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 9,000 హెక్టార్లలో పత్తి పంట సాగులో ఉంది. సాధారణంగా పత్తి విత్తిన 60-80 రోజుల వరకు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు ఆశించి ఎక్కువ నష్టం కలుగ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల, పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరగడం వల్ల రసం పీల్చే పురుగుల తాకిడి పత్తి పంటలో ఎక్కువగా ఉంది. ఈ సమయంలో రసం పీల్చే పురుగుల నివారణా చర్యలు అధిక ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

రసం పీల్చే పురుగులు నష్ట పరిచే విధానం :

1. పేను బంక :

పేనుబంక తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి కొన్నిసార్లు కొమ్మల చివరి భాగాల నుంచి రసాన్ని పీల్చడం ద్వారా మెకుక్కలు గిడసబారిపోతాయి. అంతే గాకుండా ఈ పురుగులు జిగురు పదార్ధాన్ని స్రవించడం ద్వారా దీని మీద నల్లని బూజు ఏర్పడతాయి. దీని వల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడుతుంది.ఈ పురుగు ఆశించిన మెకుక్కలు ముదురు ఆకుపచ్చగా కనబడతాయి. ఆకులు అడుగు భాగాన దొనెలుగా మూసుకుంటాయి. పేనుబంక ఎక్కువుగా ఆశించినప్పుడు మెకుగ్గలు రాలి, కొత్త మెకుగ్గలు ఏర్పడక దిగుబడులు తగ్గుతాయి.

2. తామర పురుగులు :

ఈ పురుగులు పంట తొలి దశలో వృద్ధి చెంది పిల్ల, పెద్ద పురుగులు ఆకు అడుగు భాగాన గుంపులుగా చేరి ఆకులోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకుపోవడమే కాక పెళుసుబారి పోతాయి. ఆకు అడుగు భాగం వెండి చారలను కలిగి ఉంటుంది. మెకుక్కలు గిడసబారిపోతాయి. వీటి ఉనికిని సన్నని పేను పురుగులను ఆకు అడుగు భాగాన చూసి నిర్ధారించవచ్చును. బెట్ట పరిస్ధితుల్లో దీని ఉధృతి బాగా పెరుగును.

3. పచ్చదోమ :

పచ్చదోమ పిల్ల, పెద్ద పురుగులు గుంపులు గుంపులుగా ఆకు అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకు ముడుచుకొని క్రమేపి లేత పసుపు రంగుకు మారి మెకుక్కలు గిడసబారిపోతాయి. ఆ తరువాత దశలో ఆకులు ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఆకుల అంచుల నుండి ఎండుతూ ఎర్రగా మారతాయి.

4. తెల్ల దోమ :

పిల్ల, పెద్ద పురుగులు ఆకులు అడుగు నుంచి రసాన్ని పీల్చడంవల్ల ఆకులు అపరిపక్వ దశలోనే రాలిపోతాయి. ఆకులు దగ్గరగా ముడుచుకుని మొక్కలు గిడసబారిపోతాయి. దీని తాకిడి ఎక్కువైనప్పుడు పువ్వులు, కాయలు కూడా రాలిపోతాయి. మొక్క ఎదుగుదల కోల్పోయి గిడసబారి క్రమేపి చనిపోయే అవకాశం ఉంది.

5. పిండి నల్లి :

పిండినల్లి ఆకులు, కాండం, మెకుగ్గలు, కాయలు మీద తెల్లని బూజు పదార్ధంతోకప్పబడి ఉంటుంది. ఆకులు ముడుచుకొని ఎండిపోతాయి. పిండినల్లి ఆశించిన మెకుక్కలుగిడసబారిపోయి, చిన్న పిందెలు కలిగి కాయలు వాడిపోతాయి. కాయలు పక్వానికి రాకుండా పగిలిపోతాయి. ఈ మధ్య కాలంలో ప్రతి పంటను తీవ్రస్ధాయిలో నష్టపరిచే రసంపీల్లే పురుగుల్లో ఇది ప్రధానమైనది. సాధారణంగా పేనుబంక ఆశించిన మెకుక్కలు 10-20 శాతం, పచ్చదోమలు ఆకుకు 2, తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు 6, లేదా పిల్ల పురుగులు 20, తామర పురుగు తల్లి పురుగులు ఆకుకు 10 ఉన్నా, అయా పురుగుల వల్ల పంటకు నష్టం అధికంగా ఉంటుంది.

సస్యరక్షణ చర్యలు :

వాతావరణంలోని మార్పుల కారణంగా రసం పీల్చే పురుగుల తాకిడి మెకుక్క మెకులచిన నుండి పంట చివరి దశ వరకు ఆశించి నష్టాన్ని కలిగిసున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతాంగం ఈ రసం పీల్చే పురుగుల నివారణపై సరైన అవగాహనలేక పురుగు మందులను విచిక్షణా రహితంగా వాడుతున్నారు. దీని వల్ల రసం పీల్చే పురుగులు పురుగు మందులకి నిరోదక శక్తిని పెంచుకునే ప్రమాదముంది. అంతేకాకుండా ఈ రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచే పరాన్న జీవులు, పరాన్న భుక్కులు సంఖ్య తగ్గిపోతుంది. వాతావరణ కాలుష్యం అధికమగును, పురుగు మందులపై పెట్టే ఖర్చు పెరిగిపోతుంది. ఈ సమయంలో రైతాంగానికి లాభసాటిగా ఉండే కాండానికి మందు పూసే పద్ధతిపై అవగాహాన పెంచుకోవడం ఎంతైనా అవసరం. సాధారణంగా రసం పీల్చే పురుగులు మెకుక్క తొలి దశలో (శాఖీయ దశలో) ఎక్కువగా పంటను ఆశిస్తాయి. కావున పంట తొలి 80-90 రోజుల వరకు పంటను గమనించి కాండానికి మందు పూత చర్యలుపాటించాలి.

కాండానికి మందు పూసే పద్ధతి :

ఈ పద్ధతిలో మోనోక్రోటోఫాస్‌ (లేదా) ఇమిడాక్లోప్రిడ్‌ మందును మెకుక్క కాండానికి పూత పూస్తారు.

మోనోక్రోటోఫాస్‌ మరియు నీరు 1ః 4 నిష్పత్తిలో వాడాలి (అంటే 1 మి.లీ. మందుకు 4 మి.లీ. నీరు కలిపి వాడాలి

అదే విధంగా ఇమిడాక్లోప్రిడ్‌ వాడినట్లైతే 1 ః20 నిష్పత్తితో వాడుకోవాల్సి ఉంటుంది (1 మి.లీ. మందు మరియు 20 మి.లీ. నీరు)

పై మందులను విత్తిన 25, 40 మరియు 55- 60 రోజులకు మెకుక్క కాండానికి బ్రష్‌తో పూస్తే రసం పీల్చే పురుగులు అదుపులో ఉంచుతుంది.

ఈ పద్ధతిలో మందు ద్రావణం మెకుక్కలోపలకి వెళ్ళుటకు తక్కువ సమయర సరిపోతుంది. వర్షం వచ్చినా మందు వృధా కాదు.

ఈ పద్ధతిలో తక్కువ మందు, నీరు సరిపోతుంది. కాబట్టి ఖర్చు తగ్గి రైతాంగానికి లాభసాటిగా ఉంటుంది మరియు పని భారం తగ్గుతుంది.

ఈ పద్ధతిలో పురుగు మందు ఖర్చు తగ్గడమేకాక వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.

మిత్ర పురుగులకు ఎటువంటి హాని కలుగదు.

ఈ పద్ధతిలో మందును పూత పూయుటకు పరికరాన్ని మన సౌలభ్యతను బట్టి స్ధానికంగా తయారు చేసుకోవచ్చును.

రసాయన పద్ధతిలో పిచికారి

చివరిగా అవసరాన్ని బట్టి రసం పీల్చే పురుగులు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.5 మి.లీ. లేదా మిధైల్‌ డెమోటాన్‌ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 200 యస్‌.యల్‌. 0.4 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా థయోమిథాక్సామ్‌ 0.2 గ్రా. లేదా ఫ్లోనికమిడ్‌ 0.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు నివారణకు నీలి రంగు తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు ఆకర్షక ఎరలను ఎకరానికి 10 ఉంచితే సరిపోతుంది.

కొద్దిపాటి దోమ తీవ్రత ఉంటేె, ట్రైజోఫాస్‌ 2.0 మి.లీ. మరియు వేపనూనె 5 మి.లీ. కలిపి పిచికారి

పిండి పురుగు యాజమాన్యం కొరకు కలుపు మెకుక్కలు తీసివేయాలి

ప్రొఫినోఫాస్‌ 2 మి. లీ. లేదా ట్రైజోఫాస్‌ 2 మి. లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. (1 మి.లీ. శాండోవిట్‌ లేదా టీపాల్‌తో) ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

డా.జి.చిట్టిబాబు, శాస్త్రవేత్త, డా.పి.వెంకట్రావు, శాస్త్రవేత్త, డా.డి.చిన్నం నాయుడు, సీనియర్‌ శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, ఆముదాలవలస, ఫోన్‌ : 9849035068

అగ్రిక్లినిక్‌ డెస్క్‌