సుస్థిర అక్వా పరిశ్రమలో ప్రోబయోటిక్స్‌ ప్రాముఖ్యత

అధిక దిగుబడిని సాంద్ర సాగు పద్ధతి ద్వారా పొందాలనే ఉద్ధేశంతో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక కార్యకలాపాల్లో ఆక్వాసాగు ఒకటిగా మారింది. ఏ సాగులోనైనా మరణాలను కలుగచేసే వ్యాధి వ్యాప్తి అన్నది చాలా ప్రధానమైన సమస్య. ఇలాంటి వ్యాధికారకాలను అణచివేయడానికి కొన్ని సప్లిమెంట్‌ సమ్మేళనాల ఉపయోగం దిగుబడిని పెంచుతుంది. అక్వాసాగులో వ్యాధి కారక బాక్టీరియాను అణచివేయడానికి మేతలో యాంటి బయోటిక్‌ను విస్తృతంగా వాడుతున్నారు. ఇలా యాంటి బయోటిక్‌ మందులను విచక్షణారహితంగా వాడడం వల్ల ఔషధ నిరోధక బాక్టీరియా రకాలు అభివృద్ధి చెందుతుండడం వల్ల యాంటి బయోటిక్‌ మందులను వ్యాధి చికిత్సలో ప్రభావంతంగా ఉపయోగించడంలో సమస్యలకు దారితీస్తుంది. ఆక్వా సాగులో మేతలో యాంటి బయోటిక్‌ వాడకంపై పెరుగుతున్న ప్రజల ఆందోళన, ప్రత్యామ్నాయ శోధనకు మార్గం సుగమం చేయడం వల్ల ప్రోబయోటిక్‌ వాడకాన్ని ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగించడం జరుగుతుంది.

సూక్ష్మ జీవుల వాడకం ద్వారా ప్రేగులో కావల్సిన బాక్టీరియా సంఖ్యను వృద్ధి చేసి కాలనీలుగా పెంపొందించడానికి అనేక రకాల వాణిజ్య ప్రేగు ఔషదాలు మార్కెట్లో అందుబాటులో వచ్చాయి. అతిథేయికి సంబంధించిన లేదా దాని పరిసర ప్రాంతాల్లోని సూక్ష్మజీవులను అదుపులో ఉంచుతూ అతిథేయి మేత యొక్క పోషక విలువలను పెంచడం ద్వారా మేతను బాగా తీసుకునేలా చేయడం. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం లేదా పరిసర ప్రాంతాల యొక్క నాణ్యతను మెరుగుపరచడం వంటి ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉన్న సూక్ష్మజీవుల సమ్మేళనం 'ప్రోబయోటిక్స్‌' నిర్వచనం.

1920లో ఇతర జంతువుల్లో ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల వినియోగం మొదలైంది. ప్రోబయోటిక్స్‌ అనే పేరును పార్కర్‌ అనే శాస్త్రవేత్త చేత ప్రవేశపెట్టబడింది. జలచర జీవుల్లో మాత్రం ఇటీవలే పేగు వ్యాధిని నియంత్రించ గల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రోబయోటిక్స్‌ వాడకం మొదలైంది.

ప్రోబయోటిక్స్‌ పనిచేసే విధానం :

వివిధ రకాల వ్యాధికారక బ్యాక్టీరియా మీద ప్రోబయోటిక్స్‌ చర్య కింది విధాలుగా ఉంటుంది.

1. యాంటీమైక్రోబియల్‌ సమ్మేళనాలైనటువంటి సేంద్రియ ఆమ్లాలు మరియు యాంటిబయోటిక్‌ పదార్థాల ఉత్పత్తి లేదా ఉదజని సూచిక(జూన)ను తగ్గించడం ద్వారా సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించడం.

2. అతిథేయి జీర్ణాశయంలోని సొంత ఎంజైముల చర్యలను మార్చడం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా కాలనీలను తగ్గించడం.

3. అతిథేయి యొక్క సాధారణ రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపణ వల్ల యాంటిబాడీల విదుదలను మరియు ఫాగోసైటిక్‌ చర్యలను పెంచడం వల్ల

ఆక్వాసాగులో ఉపయోగించే ప్రోబయోటిక్స్‌ :

చాలాకాలం కింద కనుగొన్న మొట్ట మొదటి ప్రోబయోటిక్‌ 'లాక్టోబాసిల్లస్‌' ఇది లాక్టిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా..

ఆక్వాసాగులో వాడడానికి ఆమోదం పొందిన ప్రోబయోటిక్స్‌ :

ఏరోమోనాస్‌, హైడ్రోఫిలా, ఆల్బెరోమోనాస్‌, బాసిల్లస్‌ సబ్‌టిలిస్‌, కొరినిబాక్టీరియం ఇన్‌హిబిన్‌, డిబారియోమైసిన్‌ హాన్సెని, ఎంరోకోకస్‌ ఫీసియమ్‌, లాక్టోబాసిల్లస్‌ హెల్వెటికస్‌, లాక్టోబాసిల్లస్‌్‌ ప్లాంటీరమ్‌, లాక్టోబాసిల్లస్‌ రామ్మోసస్‌, మైక్రోకోకస్‌ లూటియస్‌, సుడోమోనాస్‌ ఫోరెసెన్స్‌, రోజియాబాక్టర్‌, స్ట్రైప్టోకోకస్‌ ధర్మోఫిలస్‌, శకారోమైసిన్‌, సురెవిసే, శకారోమైసిన్‌ ఎక్సోజియస్‌, వింబియో ఆల్గినో లైటికస్‌, విబ్రియో ప్లువియాలిస్‌, టెట్రాసెల్మాస్‌ సుసికా మరియు వీసెల్లా హెలెనికా..,

ప్రోబయోటిక్స్‌ ఒకటి లేదా వివిధ రకాల బాక్టీరియాలను కలిగి ఉంటాయి. ప్రోబయోటిక్స్‌ తయారీలో సాధారణంగా ఉపయోగించే బాక్టీరియా రకాలు...

లాక్టోబాసిల్లస్‌     అసిడోఫిలస్‌     స్ట్రెప్టోకోకస్‌     థర్మోఫిలస్‌

లాక్టోబాసిల్లస్‌     ప్లాన్టేదమ్‌     స్ట్రెప్టోకోకస్‌     ఫీసియమ్‌

లాక్టోబాసిల్లస్‌     బల్గారికస్‌     శకారోమైసెస్‌     సెరవిసే

లాక్టోబాసిల్లస్‌     సాల్వేరికస్‌     స్ట్రెప్టోకోకస్‌     ఇన్‌ఫాంటేరియస్‌

లాక్టోబాసిల్లస్‌     కోయాగ్యులెన్స్‌     ఎంటిరోకస్‌     ఫీసియమ్‌

లాక్టోబాసిల్లస్‌     రామ్‌నోసన్‌     బాసిల్లస్‌     లైకెనిఫార్మిస్‌

లాక్టోబాసిల్లస్‌     ఫార్శీమినిస్‌     బాసిడోబాక్టీరియమ్‌

లాక్టోబాసిల్లస్‌     లాక్టిస్‌     లాక్టోబాసిల్లస్‌     హెల్వెటికస్‌

ఆక్వాసాగులో ప్రోబయోటిక్‌ ప్రయోజనాలు :

నిరోధక సమ్మేళనాల ఉత్పత్తి :

ప్రోబయోటిక్‌ బాక్టీరియా, గ్రామ్‌పాజిటీవ్‌ మరియు గ్రామ్‌ నెగటీవ్‌ బాక్టీరియాలను నిరోధించే వివిధ రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. వీటిలో బాక్టీరియోసిన్లు, సైడెరోఫియర్స్‌, లైనోజైములు, ప్రోటోజైములు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లు ఉన్నాయి. ఉదా : లాక్టిక్‌ ఆసిడ్‌ బాక్టీరియా-బాక్టీరియోసిన్లను ఉత్పత్తి చేస్తాయి.

వ్యతిరేక బ్యాక్టీరియా :

బాక్టీరియా విరోధం ప్రకృతిలో ఒక సాధారణ ప్రక్రియ. అందువల్ల సూక్ష్మజీవుల సంఘర్షణలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మరియు వ్యాధికారక సూక్ష్మజీవుల మధ్య పోటీ సమతుల్యతను ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఉదా : ఆక్వా సాగులో సూదో ఆల్డెరోమోనాస్‌కు వ్యతిరేకంగా నిషేద ప్రభావాలను చూపిస్తుంది.

జీర్ణక్రియకు పోషకాహార, ఎంజైమ్‌ సహకారాల కోసం సూక్ష్మజీవులు :

ప్రోబయోటిక్స్‌లో సాధారణంగా ఉపయోగించే సూక్ష్మజీవులు లాక్టిక్‌ ఆమ్ల బ్యాక్టీరియా ఇది అతిథేయి జీర్ణక్రియకు అవసరమైన పోషకాలను ఉత్పత్తి చేసి జీర్ణక్రియ ప్రక్రియకు అవసరమైన ఎంజైములకు దోహదం చేస్తుంది.

బంధన ప్రదేశాల కొరకు పోటీ :

ప్రోబయోటిక్స్‌ శ్లేష్మస్రావిత కణాల ఉపరితలంలో సంశ్లేషణ ప్రదేశాలు మరియు ఆహారం కొరకు వ్యాధి కారకాలలో పోటీ పడడం వల్ల వాటి పెరుగుదలను అరికడతాయి.

ఉదా : విబ్రియో ఆంగ్విల్లేరమ్‌ మరియు ఏరోమోనాస్‌ హైడ్రోఫిలా, వివిధ రకాల వ్యాధికారకాలతో బందన ప్రదేశాల కోసం పోటీపడతాయి.

పోషకాల కొరకు పోటీ :

అతిథేయ శరీరంలో వ్యాధికారక సూక్ష్మజీవులు వాటి మనుగడకు కొన్ని రకాల పోషకాల మీద ఆధారపడతాయి. ప్రోబయోటిక్‌ సూక్ష్మజీవులు ఆ పోషకాల కోసం పోటీపడి వాటి సంఖ్య వృద్ధి కాకుండా అడ్డుకుంటాయి.

జీర్ణక్రియకు పోషకాలు, ఎంజైమ్‌ సహకారం :

కొంత మంది పరిశోధకులు జలచర జీవుల జీర్ణాశయ ప్రక్రియలో ప్రోబయోటిక్‌ సూక్ష్మజీవుల ప్రయోజనకరమైన ప్రభావాన్ని ప్రయోజనకరమైన ప్రభావాన్ని సూచించారు. బాక్టెరాయడ్స్‌ మరియు క్లాస్ట్రిడియం బాక్టీరియా చేప యొక్క పోషణకు దోహదపడతాయి. ముఖ్యంగా కొవ్వు ఆమ్లాలు మరియు విటమిన్లు సరఫరా చేయడం ద్వారా ఆగ్రోబాక్టీరియం, సుడోమోనాస్‌, బ్రేవిబాక్టీరియం, మైక్రోబాక్టీరియం మరియు స్టాఫిలోకోకస్‌ వంటి కొన్ని సూక్ష్మజీవులు ఆర్కిటిక్‌ చర్‌ చేపల్లో పోషక ప్రక్రియలకు దోహదం చేస్తాయి. మరికొన్ని బాక్టీరియా ప్రోటిఏజ్‌, లైపేజ్‌ అలాగే పెరుగుదలకు అవసరమైన బాహ్యకణజాల ఎంజైములను ఉత్పత్తి చేస్తాయి.

రోగనిరోధక వ్యవస్థ - ప్రతి స్పందన వృద్ధి :

అవిశేషమైన రోగనిరోధక వ్యవస్థ (నాన్‌ స్పెసిపిక్‌ ఇమ్యూన్‌ సిస్టమ్‌) ప్రోబయోటిక్స్‌ ద్వారా ప్రేరేపించబడుతుంది. క్లాస్ట్రిడియమ్‌ బ్యుటిరికమ్‌ అనే బాక్టీరియా రెయిన్‌బో ట్రౌట్‌ అనే చేపలో విబ్రియోసిన్‌ వ్యాధికి ల్యూకోసైట్‌ కణాల ఫ్యాగోసైటిక్‌ చర్యను పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నీటి నాణ్యతపై ప్రభావం :

ప్రోబయోటిక్స్‌ చేపల/ రొయ్యల చెరువుల్లో నీటి నాణ్యతను మెరుగుపరచేందుకు దోహదం చేస్తాయి. చేపలు / రొయ్యలు నత్రజని వ్యర్థాలను అమ్మోనియా (చీన3) లేదా అమ్మోనియం అయాన్‌ (చీనం4) రూపంలో విడుదల చేస్తాయి. ఇవి చేపలకు హానికరం. నైట్రజోమెనాస్‌ అనే బ్యాక్టీరియా అమ్మోనియాను నైట్రైట్‌గా మారుస్తాయి. అదే విధంగా ఈ నైట్రేట్‌ను నైట్రోబాక్టర్‌ అనే బ్యాక్టీరియా నైట్రేట్‌గా మారుస్తుంది. ఈ విధంగా ప్రోబయోటిక్‌ బాక్టీరియా అమ్మోనియా యొక్క హానికర ప్రభావాన్ని తగ్గించి నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అదే విధంగా సల్ఫర్‌ను తగ్గించే బ్యాక్టీరియా, సల్ఫేట్‌ను సల్ఫైడ్‌ తక్కువ (విష పూరితం)గా మారుస్తాయి. మిథేన్‌ తగ్గించే బాక్టీరియా, కార్బన్‌డై ఆక్సైడ్‌ను ఉపయోగించుకొని మిథేన్‌ వాయువును గాలిలోకి విడుదల చేయడం వల్ల నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి.

ఫైటో ప్లాంక్టన్‌పై ప్రభావం :

ప్రోబయోటిక్స్‌ బాక్టీరియా అనేక రకాలైన ఆల్గేలపై ప్రత్యేకంగా రెడ్‌డైట్‌ ప్లావక్టన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అదే విధంగా హాట్చరీలలో నీటి ఆకుపచ్చ ఆల్గే పెరుగుదలను నియంద్రించడంలో కూడా ప్రోబయోటిక్‌ సూక్ష్మజీవులు దోహదం చేస్తాయి.

వైరస్‌ నిరోధక ప్రభావం (యాంటి వైరల్‌ యాక్టివిటీ) :

కొన్ని ప్రోబయోటిక్స్‌ సూక్ష్మజీవులు, వైరస్‌ నిరోధకాలుగా పనిచేస్తాయి. సుడోమోనాస్‌, విబ్రియో, ఏరోమోస్‌ మరియు కొరినిఫార్మ్‌ వంటి బ్యాక్టీరియా ఇన్‌ఫెక్చువస్‌ హెమాటోపాయిటిక్‌ నెక్రోసిన్‌ వైరస్‌ (Iనచీహ)పై నిరోధక ప్రభావాన్ని చూపిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది. అదే విధంగా మోరాక్సెల్లా బ్యాక్టీరియా పోలియో వైరస్‌ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

ఆక్వాసాగులో ఉపయోగించే వివిధ రకాల ప్రోబయోటిక్స్‌ :

బ్యాక్టీరియా ప్రత్యేకత
ఏరోమోనాస్‌ మీడియా ూ199 ఫసిపిక్‌, ఆయిస్టర్‌ లార్వేకు వ్యాధి కారకమైన విబ్రియో తుబియాషిని నిరోధిస్తుంది మరియు రొయ్య మరణాలను తగ్గిస్తుంది.
ఫీనియోమోనాస్‌ జాతి ప్రధాన వ్యాధి కారకాలైన సూడోమోనాస్‌ ఏరోజినోసా సుడోమోనాస్‌ ఫోరసెన్స్‌ మరియ ద్వితీయ వ్యాధి కారకాలైన సాల్మొనెల్లా, షిజెల్లా, ఇ-కొలై, స్ట్రెప్టోకోకస్‌లను నిరోధిస్తుంది.
సూడోమోనాస్‌ జాతి పీనాయిడ్‌ రోయ్యల్లోని వ్యాధికారక విబ్రియోలను సమర్థవంగా నిరోధిస్తుంది. విబ్రియోకు ప్రతికూలంగా కణ బాహ్య పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది.
ఎంటిరో బ్యాక్టీరియేసి ఆహార నాణ్యతను మరియు నీటి పరిశుభ్రతను తెలుపుతాయి.
విబ్రియో ూ62, విబ్రియో ూ62 పీనియస్‌ వన్నామితో రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది.
బాసిల్లస్‌ ూ11 వ్యాధి నిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నియంత్రిస్తుంది. రొయ్యల దిగుబడిని పెంచుతుంది.
లాక్టోబాసిల్లస్‌ ప్లాంటేరమ్‌ ఫీనాల్‌ ఆక్సిడేజ్‌ (ూూ) క్రియ, రెస్టిరేటరి ఒరెస్ట్‌, సూపర్‌ ఆక్సైడ్‌ డిస్‌మ్యూటేజ్‌ (ూూణ) క్రియ మరియు శుభ్రపరచే సామర్ధ్యాన్ని ప్రేరణ చేస్తుందని గుర్తించబడింది.
విబ్రియో ఆల్జినోలైటికన్‌ ఫీనాల్‌ ఆక్సిడేజ్‌ (ూూ) క్రియ, రెస్టిరేటరి ఒరెస్ట్‌, సూపర్‌ ఆక్సైడ్‌ డిస్‌మ్యూటేజ్‌ (ూూణ) క్రియ మరియు శుభ్రపరచే సామర్ధ్యాన్ని ప్రేరణ చేస్తుందని గుర్తించబడింది.
(చీజIవీదీ 1339) ప్రతికూలంగా పనిచేసే
విబ్రియో గాజోజీన్స్‌ లిటోపీనియస్‌ వన్నామి
(చీజIవీదీ 2250) పెరుగుదలకు దోహదం చేస్తాయి.

అయితే అధిక మోతాదులో ప్రోబయోటిక్స్‌ను ఉపయోగిస్తే చనిపోయిన బ్యాక్టీరియా అవశేషాలు పెరిగి నీటిలోని అమైనియమ్‌ అధికమై విషపూరితం అవుతుంది. నీటిలో ఉన్న ప్రోబయోటిక్‌ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సరైన కర్భన పదార్థాలు అవసరం. డెక్ట్రోస్‌, ఇథనాల్‌, స్టార్చ్‌, ఎసిటేట్లు, బెల్లం మొదలగునవి నీటిలోని బ్యాక్టీరియా పెరుగుదలకు తగిన వాతావరణనాన్ని ఏర్పరుస్తాయి. తక్కువ మోతాదులో సహజమైన కర్బన పదార్ధాలను వాడడం వల్ల ఆక్వా రైతులు వాళ్ళ చెరువులను, బురద, అమ్మోనియం నైట్రేట్‌, టర్బిడిటీ వంటి వాటి నుండి కాపాడుకోవచ్చు.

ప్రోబయోటిక్స్‌ను వ్యాధి చికిత్సకంటే వ్యాధి నివారిణిగా వాడడం మంచిది. ప్రోబయోటిక్‌ సూక్ష్మజీవులు వాటి కాలనీలను స్థిరమైన నీటి వ్యవస్థలో అధిక సంఖ్యలో ఏర్పరచుకుంటాయి. కలుషితమైన నీటి కన్నా పరిశుభ్రమైన నీటిలో వీటి చర్య ప్రభావంతంగా ఉంటుంది. వీటిని ఉపయోగిస్తున్నప్పుడు ఇతర ఫంగస్‌ మరియు ప్రోటోజోవన్‌ వ్యాధుల చికిత్సకు వాడే రసాయనాలను లేదా మందులకు ఉపయోగించకూడదు.

ప్రతి ప్రోబయోటిక్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. కనుక వాటిని సరిగ్గా ఉపయోగిస్తే ఆక్వాసాగులో అధిక దిగుబడిని పొందవచ్చు. అయితే ఈ ప్రోబయోటిక్స్‌ను ఆక్వాకల్చర్‌లో విస్తృతంగా ఉపయోగిస్తే వ్యాధి సంక్రమణం మరియు పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కావున ప్రోబయోటిక్స్‌ను ఉపయోగించేటప్పుడు ఎంపిక చేయబడ్డవి మరియు పర్యావరణంతో పాటు చేపల చెరువుకు నిర్దిష్టమైనవి మాత్రమే వాడాలి. ప్రోబయోటిక్స్‌ను ఉపయోగించే ముందు చేపల చెరువు నీటి నాణ్యతను మరియు మట్టిని పరీక్షించాలి. ప్రోబయోటిక్స్‌ను తక్కువ మోతాదులో ఉపయోగిస్తూ, ఆక్వాసాగు ఉత్పత్తులను అభివృద్ధి చేయడం అత్యంత అవసరం.

డా|| ఎ. దేవి వరప్రసాద్‌ రెడ్డి, శాస్త్రవేత్త, డా|| టి. విజయ నిర్మల, శాస్త్రవేత్త, డా|| సి.హెచ్‌ బాలకృష్ణ, శాస్త్రవేత్త, డా|| ఇ. రుణశ్రీ, ప్రధాన శాస్త్రవేత్త & హెడ్‌, కృషీ విజ్ఞాన కేంద్రం, డా|| ఆర్‌.వి.ఎస్‌.కె రెడ్డి, విస్తరణ సంచాలకులు, డా|| వై.ఎస్‌.ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం, డా|| కె. వెంకటసుబ్బయ్య, శాస్త్రవేత్త, జి. శాలిరాజు, శాస్త్రవేత్త,

కృషీ విజ్ఞాన కేంద్రం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఫోన్‌ : 9966636318.