మా గురించి

రైతులను ఉత్పత్తిదారులుగాను, సాంకేతిక నిపుణులుగాను, అత్యంత విలువైన భూమిపుత్రులుగాను గౌరవించి, వ్యవసాయాన్ని పవిత్ర వృత్తిగా గుర్తించే సమాజం కోసం గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం పండగని నిరూపించే కథనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పాఠకులకు సమగ్రంగా అందిస్తూ, పాఠకుల విశేష ఆదరాభిమానాలతో నడుస్తున్న మన అగ్రిక్లినిక్‌ సమగ్ర వ్యవసాయ మాసపత్రికను విజయవంతంగా ప్రచురిస్తున్న సంగతి మీకు తెలిసిందే. ప్రపంచం ఓ కుగ్రామంగా మారి, ప్రతి ఒక్కరికి ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చిన నేటి అంతర్జాల ప్రపంచంలో https://www.agriclinic.org అనే వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటికే డిజిటలైజేషన్‌లోకి ప్రవేశించి ప్రపచంలోని తెలుగువారందరికీ అందుబాటులో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆధునిక విజ్ఞాన సమాచారాన్ని అరచేతిలో ఇమిడింపచేస్తున్న నేటి సమాజంలో మరింత మందికి చేరువయ్యేందుకు 'అగ్రిక్లినిక్‌' యాప్‌ ద్వారా మీ ముందుకు వస్తున్నామని తెలియజేయుటకు గర్విస్తున్నాము. ఈ యాప్‌ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నూతన వ్యవసాయ పద్ధతులను ప్రతిక్షణం అన్ని ప్రముఖ భాషలలో రైతు సోదరులకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేసి, మీకు మరింత సేవ చేసే దిశగా ముందుకు సాగుతున్నాము. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న ఈ శుభ తరుణంలో ప్రచురణను నిలిపివేసి, పూర్తి డిజిటలైజేషన్‌ వైపు అడుగులు వేస్తున్న మా ఈ ప్రయత్నంలో కూడా మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ.....

Group of Companies
సదా రైతు సేవలో....

ఏలూరి సాంబశివరావు, M.Sc., (Hort)

సంపాదకులు