ఆంధ్రప్రదేశ్‌లో మామిడి 30414 హెక్టార్లలో 27,37,008 టన్నుల ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎక్కువగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు, కడప జిల్లాల్లో సాగు చేస్తున్నారు. 

ప్రూనింగ్‌ (కత్తిరింపులు) : 

మామిడిలో మేలైన యాజమాన్య పద్ధతులు మరియు ప్రూనింగ్‌ చేయకపోవడం ద్వారా మామిడిలో దిగుబడులు తగ్గిపోతున్నాయి. కాబట్టి రైతు సోదరులు పెద్ద చెట్లలో ప్రతి సంవత్సరం కాయకోత తరువాత జూన్‌-జులైలో అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను, ఎండిపోయిన కొమ్మలను, రెమ్మలను తీసివేయడం ద్వారా నిద్రావస్త తొలగి కొత్తచిగురులు వస్తాయి. అలాగే కాయ వదిలేసిన తొడిమలను కత్తిరించడం ద్వారా ప్రతి ఒక్క రెమ్మ చివరి నుండి 3-5 చిగుర్లు వస్తే రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి. ఇలా చేయడం ద్వారా సూర్యరశ్మి చెట్టంతా బాగా సోకడం కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి పిండి పదార్థాలు తయారుచేసుకోవడం ద్వారా మంచికాపునిస్తుంది. 

ఎరువులు- యాజమాన్యం : 

ఎరువులు తొలకరి నెలల్లోనే జీలుగు (10 కిలోలు / ఎకరానికి) లేదా జనుము (25 కిలోలు / ఎకరానికి)లాంటి పచ్చిరొట్ట పైర్లను మామిడిచెట్ల మధ్య వేసి 45-50 రోజుల తరువాత భూమిలో కలియ దున్నడం ద్వారా భూమి సారవంతమవ్వడం మరియు సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా సేంద్రియ పదార్ధం పెరుగుతుంది. 

అలాగే రసాయన ఎరువులు చెట్టు యొక్క వయసును బట్టి వేసుకోవాలి. ఒక్క మొక్కకు మొదటి సంవత్సరం 200 గ్రా. యూరియా, 500 గ్రా. సింగిల్‌ సూపర్‌ఫాస్ఫేట్‌ మరియు 150 గ్రా. మ్యూరేట్‌ఆఫ్‌పొటాష్‌ అలాగే వీటితోపాటు 50 కిలోల పశువుల ఎరువు చెట్టు మొదటి నుండి 3 అడుగుల దూరంలో వేసుకోవాలి. అలాగే 10 సంవత్సరాల తరువాత ప్రతి చెట్టుకు 2 కిలోల యూరియ, 3 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌, 1.5 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ రెండు దఫాలుగా అంటే మొదటి దఫా జూన్‌-జులైలో రెండవ దఫాలో సెప్టెంబరు-అక్టోబరులో మిగిలిన మూడవ దఫా ఫిబ్రవరి-మార్చిలో చెట్టు మొదలు నుండి 1.5 మీటర్ల దూరంలో పైన సిఫార్సు చేసిన ఎరువులను వేసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి పొందడమే కాకుండా తరువాత సంవత్సరం కాపుకు దోహదపడుతుంది.

సూక్ష్మపోషక లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రా. జింక్‌్‌ సల్ఫేట్‌ + 2.5 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ + 2 గ్రా. బోరాన్‌ + 2 గ్రా. కాల్షియం సల్ఫేట్‌ + 3 గ్రా. మెగ్నీషియం లస్ఫేట్‌ కలిపి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు జూన్‌ - జులై, సెప్టెంబరు-అక్టోబరు మరియు డిసెంబరు-జనవరి నెలల్లో మూడుసార్లు పిచికారి చేయాలి. 

మామిడిలో అంతర పంటల సాగు : 

మామిడిని ఎక్కువ దూరంలో నాటుకోవడం ద్వారా చెట్ల మధ్యలో 60-70 శాతం దూరం ఖాళీగా ఉంటుంది. ఈ స్థలంలో లేత తోటల్లో కూరగాయలు చిక్కుళ్ళు, బీర, కాకర, వంగ, బెండ మరియు ఆకు కూరలు, పెసర, అలసంద వంటి అంతర పంటలను వేసుకోవాలి. అలాగే బొప్పాయి లాంటి పండ్ల తోటలను మిశ్రమ పంటలుగా వేసుకోవచ్చు. ముదిరిన తోటల్లో నీడలో పెరిగే అల్లం, పసుపు నాటుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మామిడి తోట ఆదాయం కాకుండా అదనంగా అంతర పంటల ద్వారా ఎకరానికి   రూ. 35,000-40,000 నికర ఆదాయం పొందవచ్చు. 

డా|| ఎన్‌. సత్తిబాబు, కె. ధరణి ¬ంసైన్స్‌, డా|| ఇ. చంద్రాయుడు, ఎంటమాటజీ, పి. ప్రదీప్‌ కుమార్‌,

కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, విశాఖపట్నం, ఫోన్‌ : 9010619130