కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేయుటకు అనువైనది కోకో. దీన్ని శాస్త్రీయంగా ధియోబ్రోమా కోకో అని అంటారు. భారతదేశంలో సుమారు 40వేల హెక్టార్లలో కోకో సాగుచేయబడుతుంది. మన రాష్ట్రంలో సుమారు 24,156 హెక్టార్లలో సాగు చేయబడుతున్నప్పటికి పశ్చిమగోదావరి (18385 హె.) మరియు తూర్పుగోదావరి జిల్లాలలోనే దాదాపు (2,570) హెక్టార్లలో సాగు చేయబడుచున్నది. ధియోబ్రొమిన్‌ అనే ఆల్కలాయిడ్‌ తయారీలోను వినియోగించబడే కోకో ఉత్పత్తులు ఎగుమతికి అనువైనవి.

వాతావరణం - నేలలు :

తేమ ఎక్కువగా ఉన్న ఉష్ణమండల ప్రదేశాలు కోకోసాగుకు మిక్కిలి అనుకూలం. ఏడాదికి 1250 మి.మీ.లపైబడిన వర్షపాతం, 15-390 సెం. వరకు ఉష్ణోగ్రత, 80-100 శాతం తేమ ఉన్న ప్రదేశాలు కోకో సాగుకు అనుకూలం. మురుగునీరు పోయే సదుపాయం కలిగి ఏమాత్రం నిల్వ ఉండని నేలలు కోకో సాగుకు అనుకూలం. బంకమన్ను గల నేలల్లోనూ, గరప నేలల్లో కూడా ఈ పంటను సాగుచేయవచ్చు.

రకాలు:

ప్రపంచంలో ముఖ్యంగా రెండు రకాలు సాగులో ఉన్నాయి. ఇవి క్రయల్లో మరియు ఫారెస్టిరో రకాలు.

క్రయల్లో :

క్రయల్లో గింజలు కోసిన వెంటనే తెల్లగా ఉండి పులిసిన తరువాత గోధుమ రంగులోకి మారతాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే క్రయల్లో కాయలు గరుగ్గా ఉంటాయి. క్రయల్లో రకం చేదు రుచి కలిగి ఉండి తక్కువ దిగుబడినిస్తుంది మరియు తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. మూడు రోజులలో పులవడం పూర్తవుతుంది. ఒక్కొక్క కాయలో 20 - 30 విత్తనాలు ఉంటాయి.

ఫారెస్టిరో :

ఫారెస్టిరో రకాలు గింజలు చప్పగా ఊదా రంగులో ఉండి పులిసిన తరువాత గోధుమ రంగులోకి మారతాయి. ఫారెస్టిరో కాయలు మాత్రం కోసిన వెంటనే పచ్చ రంగులో ఉండి పక్వానికి వచ్చిన తరువాత పనుపు రంగులోకి మారి దళసరి తొక్కను కలిగి ఉంటాయి. కాయల చివర్లు నున్నగా ఉండి కనీకనిపించకుండా కొండల వరస కలిగి ఉంటాయి. అదే ఫారెస్టిరో రకానికైతే పూర్తిగా పులవడానికి ఆరు రోజులు పడుతుంది. ఒక్కొక్క కాయలో సుమారుగా 30 కంటే ఎక్కువ విత్తనాలు ఉంటాయి.

ట్రినిటారియో :

ఈ వర్గంలోని రకాలు పై రెండు వర్గాల రకాలను సంకరణ పరచడం ద్వారా ఏర్పడినవి. ఇవి పై రెండు రకాల లక్షణాలను కలిగి ఉంటాయి. కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధనా సంస్థ, ప్రాంతీయ కేంద్రం, విట్టల్‌లో జరిగిన పరిశోధనల్లో I-14, I-56, III-105, చీజ 42/94 మరియు చీజ 45/53 మంచి రకం క్లోన్స్‌గా గుర్తించడం జరిగింది. చీూ 33 ఞ Iజూ 89, I-14 ఞ చీజ 42/94, I-14 ఞ II-67, I-56 ఞ III-105, ూఎవశ్రీ ఞ చీa-33, II-67 ఞ చీజ 42/94, II-67 ఞ చీజ 29/66 మరియు Iజూ6 ఞ ూషa6 మంచి హైబ్రీడ్స్‌గా గుర్తించబడినవి.

మొదటి 3 సంవత్సరాల కోకోసాగు యాజమాన్యం :

మొక్కనాటే విధానం :

కొబ్బరి తోటలలో :

రెండు కొబ్బరి వరుసల మధ్య ఒక కోకో వరుస పద్ధతిలో ప్రతి 10 అ.లకు ఒక మొక్క చొప్పున మరియు కొబ్బరి వరుసలలో చెట్లమధ్య ఒక కోకో మొక్క వచ్చేటట్లు నాటుకోవాలి. ఈ విధంగా నాటుకుంటే ఒక ఎకరానికి 200 కోకో మొక్కలు నాటుకోవచ్చు.

అయిల్‌ ఫామ్‌లో :

రెండు చెట్ల మధ్య దూరం 9 మీ (30 అ.) త్రిభుజాకార పద్ధతిలో ఉంటుంది. ప్రతి రెండు అయిల్‌ ఫామ్‌ చెట్ల మధ్య ఒక మొక్క చొప్పున నాటుకోవాలి. ఈ విధంగా నాటుకుంటే ఒక ఎకరానికి 160 కోకో మొక్కలునాటుకోవచ్చు.

గుంతల తయారి :

మొక్క నాటుటకు 10-15 రోజుల ముందుగా 1.5 అ., 1.5 అ., 1.5 అ. పరిమాణంతో గుంతలను తవ్వి ఉంచుకోవాలి. గుంత తవ్వే సమయంలో వచ్చే పై సగభాగం మట్టి ఒక వైపు కింద మట్టి రెండవ వైపు వేసి కలవకుండా చూసుకోవాలి. నాటడానికి కొద్ది రొజుల ముందుగ, ఈ గుంతలను నింపుకోవాలి పై మట్టి గుంతలో అడుగు భాగాన. కింది మట్టికి 5 కిలోలు బాగా చినికిన పశువుల ఎరువు కలిపి నింపాలి, ఆ గుంత మధ్యన, మొక్క వేర్లున్న మట్టి ముద్ద ఇమిడేంత పరిమాణంలో చేత్తో చిన్న గుంత తీయాలి.

సరియైన విధంగా నాటడం :

మొక్క ఉన్న పాలిథీన్‌ సంచిని, మట్టిముద్ద చెదిరిపోకుండా పదునైన బ్లేడుతో కోసి తీసివేసి, గుంతలో భూమట్టానికి వచ్చేలా నాటడం ముఖ్యం. పోషకాలను పీల్చుకునే పీచు వేర్లు నేలలో 15 సెం.మీ. లోతులోనే ఉంటాయి. కాబట్టి మొక్క వేరు వ్యవస్థ భూతలానికి పైకి లేదా క్రిందకు వుండకుండా సమాంతరంగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. నాటిన మొక్క చుట్టూ మట్టిని కప్పి చేతులతో మెల్లగా నొక్కాలి. మొక్క వాలిపోకుండా కర్రపుల్లలతో ఊతం కట్టాలి. ఈ దశలో రసాయన ఎరువులను వాడకూడదు. 4 నెలల తరువాత నుండే వాటిని వాడుకోవాలి. గట్టి నేలల్లో, గుంత పరిమాణాన్ని 2 అ. వెడల్పు చేయాలి. దీనివల్ల పక్క వేర్లు చొచ్చుకువెళ్ళడానికి వీలవుతుంది.

వేసవి నుండి కాపాడుట :

మొక్క నాటిన మొదటి సం||లో వేసవిలో మొక్కపై నేరుగా పండ పడకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకుగాను మొక్కకు ఇరువైపులా కొబ్బరి ఆకులతో రక్షణ ఏర్పాటు చేసుకోవాలి

నీటి యాజమాన్యం :

మొక్క అవసరమైనంత నీటిని (రోజుకు 3-5 లీ.) అందించాలి. అంతకు మించి అందించినట్లయితే మొక్క ఎదుగుదల సక్రమంగా జరుగదు. కోకో మొక్కకు నీరు అధికమైన యెడల ఆకులు తెల్లబడును. మొత్తగా, పొడవుగా కూడా పెరిగి వంగిపోతాయి. తక్కువైతే తక్కువ ఎత్తులో గొడుగు వేస్తుంది.

కలుపు నివారణ :

ఎప్పటికప్పుడు మొక్క పాదులలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవలెను. తోటల్లో కలుపు లేకుండా ఉంచుకోవలెను. దీని వల్ల చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పోషకాలను మొక్కకు సమర్థవంతంగా అందించవచ్చు. కలుపు నివారణ మందులను ఉపయోగించరాదు. పాదులు శుభ్రం చేసి ఎండు ఆకులతో కప్పి మల్చింగ్‌ చేసుకోవాలి.

చీడపీడలు :

మొక్కనాటిన తరువాత మొదటి సం|| బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆకును తినివేసి జల్లెడగా మార్చే పురుగుల వల్ల నష్టం ఎక్కువ. వీటి నివారణకుగాను 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ లేదా క్లోరిఫైరిఫాస్‌ మందును లీటరు నీటికి కలిపి వారం రోజులకు ఒకసారి క్వినాల్‌ పాస్‌, రెండవసారి క్లోరిఫైరిపాస్‌ పిచికారి చేసుకోవాలి.

పరువుల యాజమాన్యం :

మొదటి సం|| మొక్కకు సంవత్సరానికి 25 గ్రా. నత్రజని, 10 గ్రా భాస్వరం మరియు 35 గ్రా. పొటాషియం అవసరమవుతాయి. వీటిని యూరియా, సూపర్‌ ఫాస్పేట్‌, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ రూపంలో అందించాలి. దీనికి గాను సం|| మొత్తం మీద సుమారుగా 75 గ్రా. యూరియా, 75 గ్రా. సూపర్‌ ఫాస్ఫేట్‌, 75 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌లను అందించవలసి ఉంటుంది. దీన్ని మూడు దఫాలుగా ఒక్కో దఫాకు 25 గ్రా. యూరియా, 25 గ్రా. సూపర్‌ 25 గ్రా. పొటాష్‌ చోప్పున అందించాలి. దీనిని మొక్కకు ఒక అడుగు దూరంలో చుట్టూ వేసి మట్టితో కప్పాలి.

వయసు న:భా:పా యూరియా + సూపర్‌ ఫాస్పేట్‌ + మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ గ్రా./ చెట్టు/దఫా అందించవలసిన దఫాలు/చెట్టు మొదలు నుండి దూరం
మొదటి సం|| 25:10:35 (25+25+26) 75 గ్రా. చెట్టు 3 1 అడుగుల
రెండవ సం|| 50:20:70 (50+50+50) 150 గ్రా. చెట్టు 3 2 అడుగుల

మొక్క నాటిన సమయంలో పశువుల పరువును వేయక పోయినట్లయితే 5 కిలోల వరకు బాగా చివికిన పశువుల ఎరువు లేదా 1 కిలో వర్మి కంపోస్ట్‌ను అదనంగా అందించాలి. రెండవ సంవత్సరం మొక్కకు 5-10 కిలోల వరకు బాగా చివికిన పశువుల ఎరువు లేదా 2 నుండి 3 కిలోల వరకు వర్మీకంపోస్ట్‌ని అందించాలి.

రసాయనిక ఎరువులకు సేంద్రియ ఎరువులకు 20-30 రోజుల వ్యవధి ఉండేటట్లు చోసుకోవాలి. రెండవ సం|| మొక్కకు రోజుకు 10-15 లీటర్లు నీటిని అందించాలి. మోడు ఆపై వయసు మొక్కలకు రోజుకు 25-40 లీటర్లు నీటిని అందించాలి. నీటి తడులకు డ్రిప్‌ వ్యవస్థ ద్వారా అందించినట్లయితే నీరు వృధా కాకుండా సమర్థవంతంగా మొక్కలు ఉపయొగించుకుంటాయి.

గొడుగు (జూర్మ్యెట్‌ చేయుట):

ఆరోగ్యకరమైన మొక్క సం||లోపు గొడుగు వేయును అనగా తల భాగంలో 3 నుండి 5 పక్క కొమ్ములతో శాఖలుగా విడిపోవును. ఈ భాగాన్ని జార్క్వెట్‌ అని కూడా అంటారు. ఈ ప్రక్క కొమ్ములను ఫాస్‌ కొమ్ములు అంటారు. ఈ కొమ్మలే ప్రధాన కొమ్మలుగా మారుతాయి.

చేతులతో మెల్లగా నొక్కాలి. మొక్క వాలిపోకుండా కర్రపుల్లలతో ఊతం కట్టాలి. ఈ దశలో రసాయన ఎరువులను వాడకూడదు. 4 నెలల తరువాత ముంచే వాటిని వాడకోవాలి. గట్టి నేలలో గుంత పరిమాణాన్ని 2 అ. వెడల్పు చేయాలి దీనివల్ల పక్క వేర్లు చొచ్చు కువెళ్లడానకి వీలవుతుంది.

జార్వ్కెట్‌ ఏర్పడే ఎత్తు అనేది ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది :

1. మొక్క స్వభావం 2. పోషకాల అందుబాటు 3. నీడ / నీటి లభ్యత, 4. నాటే సమయంలో పశువుల ఎరువు అందచేత

మొక్క నాటిన తర్వాత అనగా ఒక సం||లోపు వయస్సులో ఉన్నప్పుడు చిగురుకు పురుగుల వలన కాని మరే ఇతర కారణముల వల్ల కాని హాని జరిగిన యెడల, దెబ్బతిన్న చిగురు.

కింద భాగం నుండి 2 లేదా అంతకంటే ఎక్కువ చుపాన్‌లు వచ్చును. వాటిలో ఒక ఆరోగ్యవంతమైన చుపాన్‌ ఎంచుకుని దానిని మాత్రమే ఎదగనిచ్చి మిగిలిన వాటిని కత్తిరించి వేయవలెను. లేని యెడల అవి అన్ని గొడుగులు వేసి చెట్లు ఆకృతి కోల్పోతుంది.

చుపాన్‌ అనగా :

మొలక నుంచి పైకి పెరిగే కాండం అంటే గొడుగునిచ్చే కాండాన్ని చుపాన్‌ అంటారు. దీని ఆకు అమరిక కాండానికి చుట్టూ మెలిక పద్ధతిలో ఉంటుంది. గొడుగు వేసిన భాగం నుండి ప్రక్కకు విస్తరించే కొమ్ములను ఫాన్‌ కొమ్ములు అంటారు. ఫాన్‌ కొమ్ము ఆకుల అమరిక కొమ్మకు ఇరువైపులకు మాత్రమే ఉంటుంది.

సూక్ష్మధాతు లోప నివారణ :

మొదటి, రెండవ సంవత్సర మొక్కలో సూక్షధాతులోప నివారణకు మిశ్రమం (ఫార్ములా4)ను లీటరు నీటికి 4 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి.

కొమ్మ కత్తిరింపులు (ట్రైనింగ్‌ / శిక్షణ) :

ప్రధాన కాండంపై వచ్చే పక్క పిలకలను (చుపాన్‌) ఎప్పటికప్పుడు కత్తిరించి వేయాలి. ఫాన్‌ కొమ్మల చివర భాగాలను నేలకు తాకకుండా చివర్ల కత్తిరించవలెను. ఎట్టి పరిస్థితుల్లోను ప్రధాన కొమ్మలను కత్తిరించరాదు. 3 అడుగల ఎత్తు లోపు గొడుగు వేసినట్లయితే అవసరాన్ని బట్టి గొడుగు క్రింద వచ్చు చుపాన్‌ను రెండవ అంతస్థుకు ఎదగనివ్వవలెను. అలా చేయుటం వల్ల మొదటి అంతస్థులో అన్న కొమ్మలు క్రమేపి బలహీనపడిపోతాయి. తరువాత వాటిని తొలగించుటం వల్ల కావలసిన ఎత్తు ఉండే ఒకే మొదలు కలిగిన కోకో చెట్టు ఏర్పడును. గొడుగు ఏర్పడిన భాగం నుండి ఒక అడుగు దూరం వరకు ఫాన్‌ కొమ్మలపై అడ్డదిడ్డంగా వచ్చు కొమ్మలను కత్తిరించవలెను.

కోకో చెట్చు గొడుగు కొమ్మలను హానికలిగిన అనగా విరిగిపోయిన దీనికి కూడా మొదలు నుండి ఒక చుపాన్‌ను వదలాలి. అది పెరిగి గొడుగు వేయును. అది బాగా విస్తరించిన తర్వాత మొదటి గొడుగులో మిగిలిన ఫాన్‌ కొమ్మలను తీసివేయాలి

కోకోలో కాయకోత - అనంతర యాజమాన్యం :

కోకో కాయలు పసుపు పచ్చ రంగులోనికి మారడం మొదలవ్వగానే పక్వానికి వచ్చినట్లుగా గుర్తించి కోయవలెను.

కోకో కాయలను పదునైన కత్తితో మాత్రమే కోయాలి.

కోకో కోసే సమయంలో పుష్పగుచ్చ / ఫ్లవర్‌ కుషన్‌ దెబ్బ తినకుండా జాగ్రత్త వహించవలెను. కాయ తొడిమ (కాడ) భాగం చెట్టుకు ఉండేటట్లు కాయలను కోయాలి.

కోసిన కాయలను నీడలో అయిదురోజులపాటు ఉండవలెను. దీనివలన అన్ని కాయలు పూర్తిగా పండి నాణ్యమైన గింజలు వచ్చును.

అయిదు రోజుల తర్వాత కాయలను ఏదైన కర్రతో పగులగొట్టి గింజలను వేరుచేసుకోనవలెను.

కాయలను పగులగొట్టు సమయంలో గుజ్జు క్రిందపడి ఇసుక అంటుకోకుండా ఉండేందుకు శుభ్రమైన పొడిగా ఉన్న ఒక పట్టాను కింద పరచవలెను.

కాయ మధ్యభాగాన ఉన్న కాడలను వదిలివేసి గింజలను మాత్రమే తీయాలి.

కాయలో మొలకలు కలిగిన గింజలను ఉపయోగించరాదు. తెగుళ్ళు సోకిన, ఎండిపోయిన కాయలను వేరుచేసి నాశనం చేయాలి.

తడి గింజల పరిమాణం 50కిలోల కంటే తక్కువగా ఉన్నపుడు ముక్కబెట్టు విధానం :

వెదురుతో చేసిన బుట్ట విధానం అనుకూలమైనది.

బుట్ట ప్రక్క భాగాలను అరటి లేదా కోకో ఆకులతో కప్పాలి. అడుగుభాగాన ఎటువంటి ఆకులతో కప్పకూడదు.

కాయల నుండి వేరు చేసిన తడిగింజలను బుట్టలో నింపి పైన అరటి లేదా కోకో ఆకులతో కప్పి దానిపై ఒక గోనె సంచి కప్పాలి.

ఈ బుట్టలను నీడలో మూడు లేదా నాలుగు ఇటుకలపై ఉంచవలెను. దీని వలన బట్టు అడుగు భాగం నుండి గుజ్జు కారిపోయి గింజలు ముక్కడానికి అవసరం అయిన గాలి సోకును.

ఈ గింజలను మూడవ మరియు అయిదవ రోజు బాగా కలియతిప్పాలి.

బాగా ముక్కిన గింజలను ఏడవరోజున జుట్టు నుండి తీసి ఎండలో గింజ గింజ అతుక్కోకుండా ఎండబెట్టాలి. బాగు మాగిన గింజలు ముదురు గోధుమ రంగులోకి మారతాయి. లోపలి భాగం కత్తిరించి చూసినట్లయితే ముదురు గోధుమ రంగు వలయం గమనించవచ్చు, ముదురు గోధుమ రంగులోనికి మారుతుంది.

తడిగింజల పరిమాణం 50 కిలోల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాగబెట్టే విధానం :

చెక్కబల్ల విధానం ఉత్తమమైనది.

గింజలను మాగ పెట్టినప్పుడు గుజ్జు కారుటకు అనుకూలంగా ఉండు ఒక చెక్కబల్ల అవసరం.

కాయ నుండి తీసిన గింజలను ఒకటిన్నర అడుగుల ఎత్తు కలిగిన గుట్టగా పోసి రంధ్రాలు కలిగిన పాలిథీన్‌ కాగితం కప్పి దాని పైన గోనెసంచితో కప్పాలి.

బల్లపైన గింజను మూడవ, అయిదవ రోజు కలియతిప్పాలి. 7వ రోజున బల్లపై నుంచి తీసి గింజలను ఎండలో గింజ గింజ అతుక్కోకుండా ఎండబెట్టవలెను.

గుట్ట ఎంత పెద్దది అయితే గింజలు అంత బాగా ముక్కతాయి.

ఎట్టి పరిస్థితులలో కోకో గిరజలను యూరియా, సిమెంటు, మొక్కజొన్న సంచుల్లో మాగబెట్టరాదు.

చెక్కబల్ల కనీసం అయిదు అడుగు వెడల్పు ఉండవలెను. పొడవు అసరమైనంత వరకు పొడిగించుకోవచ్చును. చెక్కబల్లను 21 అంగుళాలు సైజుగల రీపర్‌ బద్దతో, బద్దల మధ్య 1/4 అంగుళం దూరం ఉంచునట్లు తయారు చేసుకోవాలి. చెక్కబల్లను నీడలో తగినంత ఎత్తులో ఉంచవలెను.

గింజ పూర్తిగా ముక్కినట్లు గుర్తించుట ఎలా?

ఆరు రోజుల పాటు ముక్కిన గింజలను గట్టిగా వత్తినట్లయితే ముదురు గోధుమ రంగు (ముక్కు పొడుము రంగు) ద్రవం బయటకు వచ్చును.

గింజలను కోసి చూసినట్లయితే గోధుమ రంగు వలయం కనిపించును.

గింజలను ఎండబెట్టడం :

పూర్తిగా మాగబెట్టిన గింజలను ఇసుకలేని శుభ్రమైన ప్రదేశంలో 5-6 రోజులపాటు ఎండలో ఎండబెట్టి తేమశాతంను 7కు తగ్గించవలెను. గింజలు అతుక్కుని ఉండలు రాకుండా చక్కగా విడదీయవలెను. పూర్తిగా ఎండిన గింజలను పిడికెట్లో ఉంచి నొక్కినట్లయితే చిట్లిన శబ్దం గ్రహించవచ్చును.

గింజలను ఇసుక లేదా మట్టి అంటుకునే సందర్భాలు :

1. కాయ పగులగొట్టినప్పుడు :

తోటలలో కాయలు పగులగొట్టినప్పుడు తడిగింజలు నేలపైపడినప్పుడు గింజలకు ఇసుక లేదా మట్టి అంటుకొనే అవకాశం కలదు.

. మాగ పెట్టినప్పుడు :

మూడవ, అయిదవ రోజున మాగ పెట్టిన గింజలను కలియ తిప్పునప్పుడు కిందపడి ఇసుక లేదా మట్టి గింజలకు అంటుకునే అవకావం కలదు.

3. ఎలుకలు, ఉడుతలు పాడుచేసిన గింజలు :

ఎలుక, ఉడుతలు పాడుచేసిన కాయల నుండి రాలి కిందపడిన ఇసుక లేదా మట్టి అంటుకొనే అవకాశం కలదు.

పైన పేర్కొనబడిన 3 సందర్భాలలో ఇసుక లేదా మట్టి అంటిన గింజలను నీటితో కడిగి ముక్కబెట్ట గింజలు కలిగిన గుట్ట లేదా బుట్టలో వేయవలెను.

4. ఎండబెట్టినప్పుడు :

ముక్కిన గింజలు జిగురు స్వభావం కలిగి ఉండుట వల్ల శుభ్రం చేయని ప్రదేశాల్లో ఎండబెట్టినప్పుడు గింజలను ఇసుక లేదా మట్టి అంటుకోవచ్చును. ఈవిధంగా ఇసుక అంటుకొన్న గింజలను వేరుచేసి నీటితో కడిగి తిరిగి శుభ్రమైన ప్రదేశంలో ఎండబెట్టవలెను. గింజలను ఎండబెట్టు ప్రదేశాలను (యార్డులను) గాలి అవరోధాలు (చెట్లు) గల ప్రదేశములో నిర్మించుకోవాలి. దీని వలన గాలి వీచినపుడు ఇసుక లేదా మట్టి గింజలపై పడకుండా ఉండును.

నిల్వచేయడం :

బాగా ఎండిన గింజలను తప్పలు, ముక్కలు, కాడలు మరియు రాళ్ళు వంటి వ్యర్థపదార్థాలు తీసి వేసిన తరువాత మాత్రమే శుభ్రమైన గోనె సంచులలో నింపి తేమలేని గదులలో భద్రపరచవలెను. పూర్తిగా ఎండని గింజలను నింపిన గోనె సంచులను నేలప పరచిన చెక్కబల్లలపై పెట్టి గాలి సోకేటట్లు ఉంచవలెను.

యూరియా లేదా సింమెటు వంటి ప్లాస్టిక్‌ సంచుల్లో గింజలను నిల్వచేయరాదు. గింజలను పురుగు మందులకు, పొగ, హానికరమైన రసాయన పదార్థాలు, ఘాటైన వాసనలకు దూరంగా నిల్వచేయాలి.

ఆఫ్‌ సీజన్‌ (నాసిరకం) పంట నిర్మూలన :

జూలై నుండి అక్టోబరు నెలవరకూ కోతకు వచ్చే కాయల్లో గింజలు చిన్నవి గాను అధిక శాతం తప్పలతోను కూడా ఉంటాయి. ఈ గింజలు చాక్కెట్‌ తయారీకి పనికిరావు. సాధారణంగా సీజనులో వచ్చే గింజలు ఒక్కో గింజ బరువు ఒక గ్రాము లేదా గ్రాము కన్నా ఎక్కువ బరువుఉండి 100 గ్రాములకు 90 నుండి 100 గింజలు వరకూ తూగుతాయి. అదే వర్షాకాలంలో వచ్చే గింజలలో వినియోగపదార్థాలైన కోకో బట్టర్‌ & పౌడర్‌ సీజను గింజలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఈ గింజలను చాక్లెట్‌ తయారీకి ఉపయోగించటప్పుడు చేసే రోస్టింగ్‌ ప్రక్రియలలో మాడి పోయి ఉత్పత్తులకు పొగవాసన వస్తుంది. కాబట్టి వర్షాకాలంలో వచ్చే పంటను నిరోధించుకోవలెను.

సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వేసవి నెలలైన మార్చి, ఏప్రిల్‌, మే నెలలో ఉండే అధిక ఉష్ణోగ్రతకు (45-470 సెం.) కాయలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతొ కాయలలోని గింజలు చిన్నవిగాను మరియు అధిక శాతం తప్పలు కలిగి ఉంటాయి. కాబట్టి మార్చి, ఏప్రిల్‌, మే నెలలో ఏర్పడే పిందెలను తుంచి వేసినట్లయితే వర్గాకాలంలో పంట రాకుండా ఉండి, చెట్లు తగిన విశ్రాంతి తీసుకొని సీజనులో వచ్చే కాయ దిగుబడి పెరగటంతో పాటు ముందుగానే వచ్చి మంచి దిగుబడితో పాటు నాణ్యమైన గింజలను పొందవచ్చు.

కొనుగోలు చేయునప్పుడు సంస్థ పాటించు నాణ్యతా (క్వాలిటీ) ప్రమాణాలు :

ముక్క పెట్టని లేదా తక్కువ రోజులు ముక్కపెట్టిన (పెర్మెంటేషన్‌) గింజలు కొనుగోలు చేయరాదు.

చెక్కబల్ల, గంప వంటి సాధారణ పద్ధతులలో కాకుండా యూరియా సంచి వంటి ప్లాస్టిక్‌ సంచులలో ముక్కపెట్టిన గింజలు కొనుగోలు చేయబడవు.

తేమశాతం (7 శాతం కంటే) ఎక్కువగా ఉన్న గింజలు కొనుగోలు చేయరాదు.

బూజుపట్టిన, పుచ్చన గింజలు కొనుగోలు చేయరాదు.

తప్పలు, కాడలు ఉండడంతో కూడిన గింజలు కొనుగోలు చేయకూడదు.

కౌంటు ఎక్కువగా (100 గ్రా. 115 గింజలు దాటిన) ఉన్న గింజలు కొనుగోలు చేయకూడదు.

ఇసుక అంటిన గింజలు, ఇసుకతోనూ లేదా ఇతర చెత్తా చెదారంతో కూడిన గింజలు కొనుగోలు చేయకూడదు.

ఎలుకలు, ఉడతలు పాడు చేసిన గింజలను పెర్మెంటేషన్‌ చేయకుండా (ముక్కపెట్టకుండా) ఎండబెట్టి వాటిని మంచి గింజల్లో కలిపిన, అటువంటి గింజలు కూడా కొనుగోలు చేయకూడదు.

మొలకెత్తిన గింజలను పెర్మెంటేషన్‌ చేయడం వల్ల గింజలకు రంధ్రాలు, పగుళ్ళు ఏర్పడి బూజుపడతాయి. కాబట్టి అటువంటి గింజలు కూడా కొనుగోలుకు పనికిరావు.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌

మోండలీజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రై. లిమిటెడ్‌, ఏలూరు వారి సౌజన్యంతో